హోమ్ /వార్తలు /సినిమా /

అశ్లీల సినిమా బంద్ చేయాలంటూ మహిళల ధర్నా...

అశ్లీల సినిమా బంద్ చేయాలంటూ మహిళల ధర్నా...

డిగ్రీ కాలేజ్ సినిమా పోస్టర్

డిగ్రీ కాలేజ్ సినిమా పోస్టర్

అశ్లీల డిగ్రీ కాలేజీ సినిమాను నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ PDSU, PYL సంఘాల ఆధ్వర్యంలో నిజామాబాద్ జిల్లాలో ఆందోళ‌న‌కు దిగారు.

అశ్లీల డిగ్రీ కాలేజీ సినిమాను నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ PDSU, PYL సంఘాల ఆధ్వర్యంలో నిజామాబాద్ జిల్లాలో ఆందోళ‌న‌కు దిగారు.. న‌గ‌రంలో సినిమా ప్రదర్శిస్తున్న అశోక్ థియేటర్ వద్ద సినిమా పోస్టర్లను చించివేసి, దగ్ధం చేసారు. సినిమాకు వ్య‌తిరేకంగా నినాదాలు చేసారు. డిగ్రీ కాలేజీ పేరుతో అశ్లీల సినిమాని విద్యార్థులపైకి వ‌దిలి యువతను నిర్మాత తప్పుదోవ పట్టిస్తున్నార‌న్నారు.. రాష్ట్ర ప్రభుత్వం, సెన్సార్ బోర్డు ఉదాసీనంగా ఉండటం దుర్మార్గమన్నారు. దిశా, నిర్భయ ఘటనలు మరిన్ని జరగాలని ప్రభుత్వం కోరుకుంటున్నట్లుగా ఉందని మండిప‌డ్డారు.. సినిమాకు అనుమతించిన సెన్సార్ బోర్డు అధికారుల పై చర్యలు తీసుకోవాలని, నిర్మాతలపై కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేసారు. ఇప్పటికే రాష్ట్రంలో ఉన్నత విద్య పతనావస్థలో ఉందని, ఇట్లాంటి సినిమాలతో కాలేజీలు శృంగార కేంద్రాలుగా మారే ప్రమాదం ఉందని విద్యార్థి నాయ‌కులు హెచ్చరించారు. ఇప్పటికైనా ప్రభుత్వం, సెన్సార్ బోర్డు కళ్ళు తెరవాలని సూచించారు. సామ్రాజ్యవాద, అశ్లీల సంస్కృతికి వ్యతిరేకంగా పి.డి.ఎస్.యూ, పి.వై.ఎల్ సంఘాలు తమ పోరాటాన్ని కొనసాగిస్తాయన్నారు.

బస్టాపుల్లో డిగ్రీ కాలేజీ పోస్టర్లు...

తాజాగా ఈ సినిమా పోస్టర్లు హైదరాబాద్న గరంలోని పలు బస్టాపుల్లో వెలిశాయి. దీంతో మహిళలు, విద్యార్థినులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. అయితే డిగ్రీ కాలేజ్‌ సినిమా పోస్టర్లు అశ్లీల సన్నివేశాలతో అసభ్యంగా ఉన్నాయని, యువతను చెడుమార్గంలో తీసుకువెళ్లేలా పోస్టర్లు వేసిన వారిపై చర్యలు తీసుకోవాలని ఇప్పటికే విద్యార్థి, యువజన సంఘాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. అలాగే డిగ్రీ కాలేజీ సినిమాలో ఉన్న అశ్లీల దృశ్యాలను వెంటనే తొలగించాలని విద్యార్థి సంఘాల నేతలు డిమాండ్‌ చేస్తున్నారు.

ప్రతీకాత్మకచిత్రం

ఈ సినిమాలో టైటిల్‌ అభ్యంతరంగా ఉండటంతో పాటు విజ్ఞానానికి కేంద్రమైన తరగతి గదిలో అశ్లీల కార్యకాలపాలు జరుతున్నట్లు చిత్రీకరించడం ద్వారా, విద్యావ్యవస్థను తీవ్రంగా అవమానపరిచారని విద్యార్థి నేతలు ఆరోపిస్తున్నారు. ఈ సినిమాకు వ్యతిరేకంగా ఇప్పటికే విద్యార్థి, యువజన సంఘాల నుంచి సెన్సార్‌ బోర్డు, సిటీ పోలీస్‌ కమిషనర్‌, ఫిలిం చాంబర్‌ ఆఫ్‌ కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. సినిమాలోని అశ్లీల దృశ్యాలను తొలగించాలని లేనిపక్షంలో సినిమాను అడ్డుకుంటామని విద్యార్థి సంఘాల నేతలు హెచ్చరిస్తున్నారు.

డిగ్రీ కాలేజ్ సినిమా పోస్టర్

1940లో ఒక గ్రామం పేరుతో సినిమా తీసి జాతీయ అవార్డు అందుకున్న నరసింహ నంది ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. గతంలో నరసింహ నంది హైస్కూల్, కమలతో నా ప్రయాణం, లజ్జ వంటి సినిమాలకు దర్శకత్వం వహించాడు. తాజాగా డిగ్రీ కాలేజ్ పేరుతో సినిమాను తెరకెక్కించాడు. ఈ సినిమా ఫస్ట్ పోస్టర్ రిలీజైనప్పటి నుంచే వివాదాలకు దారితీసింది. సినిమా ట్రైలర్‌లో మొత్తం సెక్స్ గురించే చూపించారంటూ వివాదాలు చుట్టుముట్టాయి. ఇప్పుడు మరోసారి వివాదంలో చిక్కుకుంది.

First published:

Tags: Telangana, Tollywood Movie News

ఉత్తమ కథలు