పాయల్‌కు బంపర్ ఆఫర్.. భారీ సినిమాలో అవకాశం..

పాపులర్ డైరెక్టర్ శంకర్‌ దర్శకత్వంతో కమలహాసన్‌ హీరోగా ఇండియన్‌ 2 చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే.

news18-telugu
Updated: July 4, 2020, 2:59 PM IST
పాయల్‌కు బంపర్ ఆఫర్.. భారీ సినిమాలో అవకాశం..
పాయల్ రాజ్‌పుత్ Photo : Twitter
  • Share this:
Payal Rajput : పాయల్ రాజ్‌పుత్.. 'ఆర్ ఎక్స్ 100' చిత్రంలో తన నటనతో పాటు తన అందచందాలతో కుర్రకారు హృదయాలను దోచుకున్న అందాల ముద్దుగుమ్మ. పాయల్ ఆ సినిమాలో నటించి ఓ సంచలనం సృష్టించిదనే చెప్పాలి. ఆ తర్వాత అలాంటి బలమైన పాత్ర పాయల్‌కు లభించలేదు. ఇటీవల వెంకటేష్ 'వెంకీమామ', రవితేజ డిస్కోరాజా వంటి చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది పాయల్. అది అలా ఉంటే పాయల్‌ రాజ్‌పుత్‌ కమలహాసన్‌తో కలిసి నటించనుందని సమాచారం. ఈ విషయాన్ని పాయల్‌ సన్నిహితులే ధృవీకరించారు. పాపులర్ డైరెక్టర్ శంకర్‌ దర్శకత్వంతో కమలహాసన్‌ హీరోగా ఇండియన్‌ 2 చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. భారతీయుడు చిత్రానికి సీక్వెల్‌ వస్తోంది. లైక ప్రొడక్షన్స్‌ ఈ చిత్రాన్ని భారీ హంగులతో నిర్మిస్తోంది.

ఇక ఈ సినిమాలో కమల్ సరసన కాజల్‌ అగర్వాల్‌, రకూల్‌ప్రీత్‌ సింగ్‌ నటిస్తుండగా.. తాజాగా ఆ జాబితాలోకి పాయల్‌ వచ్చి చేరింది. ఈ సినిమాలో పాయల్ ఓ స్పెషల్ సాంగ్‌లో మెరవనుందని సమాచారం. మామూలుగా దర్శకుడు శంకర్‌ తన పాటల్నీ భారీ ఎత్తున చిత్రీకరిస్తుంటాబు. అందులో భాగంగా ఈ ప్రత్యేక గీతాన్ని కూడా భారీ సెట్టింగులతో చిత్రీకరిస్తున్నారని సమాచారం.
Published by: Suresh Rachamalla
First published: July 4, 2020, 2:59 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading