హోమ్ /వార్తలు /సినిమా /

మరోసారి ఆ పాత్రలో కనిపించనున్న.. పాయల్ రాజ్‌పుత్

మరోసారి ఆ పాత్రలో కనిపించనున్న.. పాయల్ రాజ్‌పుత్

Instagram/rajputpaayal

Instagram/rajputpaayal

Payal Rajput : పాయల్ రాజ్‌పుత్.. తొలి చిత్రం 'RX100'లోనే అందాలు ఆరబోసి.. యూత్‌లో సూపర్ క్రేజ్ తెచ్చుకుంది.

పాయల్ రాజ్‌పుత్.. తొలి చిత్రం 'RX100'లోనే అందాలు ఆరబోసి.. యూత్‌లో సూపర్ క్రేజ్ తెచ్చుకుంది. ఆ సినిమా సూపర్ హిట్ అవ్వడంతో ఈ భామకు వరుసగా ఆఫర్స్ వెల్లువలా వస్తున్నాయి. పాయల్ ప్ర‌స్తుతం వెంకటేష్ సరసన 'వెంకీమామ‌'లోను రవితేజతో 'డిస్కోరాజా'లో నటిస్తోంది. ఈ సినిమాలతో పాటు మరో సినిమా 'RDX ల‌వ్‌' అనే సినిమాలో న‌టిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకు సంబందించిన ట్రైలర్ ఈ మధ్య విడుదలై సోషల్ మీడియాలో వైరల్‌‌గా మారింది. అలాగే తేజ దర్శకత్వంలో ఈ ఏడాది విడుద‌లైన 'సీత' చిత్రంలో పాయ‌ల్ గెస్ట్ రోల్‌లో కనిపించి.. స్పెష‌ల్ సాంగ్‌లో అదరగొట్టిన విషయం తెలిసిందే. కాగా మరోసారి పాయల్ అలాంటి పాత్రలోనే నటించనుందని.. అంతేకాదు తేజ దర్శకత్వంలో వస్తున్న ఆ సినిమాలో మరోసారి ఐటెమ్ సాంగ్‌లో కనిపించనుందని సినీ ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. అయితే ఈ  వార్తల్లో నిజమెంతో తెలియాలంటే ఈ విషయంపై పాయల్ లేదా తేజ స్పందించాల్సి వుంది.

View this post on Instagram

Teaser coming soon .... #RDXLove 🎬


A post shared by Payal Rajput (@rajputpaayal) onపాయల్ ప్రస్తుతం.. ‘ఆర్ డీ ఎక్స్ లవ్’ పేరుతో ప్రేక్షకుల ముందుకు రానుంది. హ్యాపీ మూవీస్ పతాకంపై సి కళ్యాణ్ నిర్మించిన ఈ 'RDX లవ్' చిత్రానికి శంకర్ భాను దర్శకత్వం వహిస్తున్నారు.  'RDX లవ్' అనే సినిమాలో పాయల్ అందాలనే ప్రధాన ఆకర్షణగా తెరకెక్కించారని ఈ సినిమా ట్రైలర్ చూస్తే తెలుస్తోంది. అక్టోబర్ 11న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకురానుంది.

First published:

Tags: Payal Rajput, Telugu Movie News

ఉత్తమ కథలు