ఆ ఇద్దరు హీరోలతో కలిసి నటించాలనేదే నా కోరిక : పాయల్ రాజ్ పుత్..

Payal Rajput : 'ఆర్ ఎక్స్ 100' భామ తాజాగా సోషల్ మీడియా వేదికగా మాట్లాడుతూ టాలీవుడ్‌లో ఇద్దరి హీరోలతో నటించాలని ఉందని.. ఆ కోరిక త్వరలోనే నేరవేరనుందని పేర్కోంది.

news18-telugu
Updated: July 8, 2020, 11:11 AM IST
ఆ ఇద్దరు హీరోలతో కలిసి నటించాలనేదే నా కోరిక : పాయల్ రాజ్ పుత్..
పాయల్ రాజ్‌పుత్ Photo : Instagram
  • Share this:
Payal Rajput : పాయల్ రాజ్‌పుత్.. 'ఆర్ ఎక్స్ 100' చిత్రంలో తన నటనతో పాటు తన అందచందాలతో కుర్రకారు హృదయాలను దోచుకున్న అందాల ముద్దుగుమ్మ. పాయల్ ఆ సినిమాలో నటించి సూపర్ స్టార్ డమ్‌ను సంపాదించింది. ఆ తర్వాత అలాంటి బలమైన పాత్ర పాయల్‌కు లభించలేదు. ఇటీవల వెంకటేష్ 'వెంకీమామ', రవితేజ డిస్కోరాజా వంటి చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది పాయల్. అది అలా ఉంటే పాయల్‌ రాజ్‌పుత్‌ కమలహాసన్‌తో కలిసి నటించనుందని వార్తల్నీ కొట్టి పడేసిన పాయల్ డైరెక్టర్ శంకర్‌ దర్శకత్వంతో కమలహాసన్‌ హీరోగా ఇండియన్‌ 2 చిత్రంలో ఎటువంటీ ఐటెమ్ సాంగ్‌లో నటించడంలేదని స్పష్టం చేసింది. 'సీత' సినిమాలో స్పెషల్ సాంగ్ చేయడానికి కారణం తేజగారు. ఆయన దర్శకత్వంలో నటించాలనేది నా డ్రీమ్ అందువల్లే ఆ చిత్రంలో స్పెషల్ సాంగ్ చేయడానికి అంగీకరించానని.. ఇకపై స్పెషల్ సాంగ్ చేయకూడదని డిసైడ్ అయ్యానని పేర్కోంటూ.. ఇక నుంచి మంచి కథా బలమున్న పాత్రలే చేయాలని నిర్ణయించుకున్నానని తెలిపింది.

ఇంకా ఆమె మాట్లాడుతూ.. తనకు టాలీవుడ్‌లో తనకు ఓ ఇద్దరు స్టార్ హీరోలతో కలిసి పని చేయాలని ఉందని వారిలో ఒకురు.. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ అని.. మరోకరు రౌడీస్టార్ విజయ్ దేవరకొండ అంటూ.. ఈ కలిసి నటించాలని ఉందని, త్వరలోనే ఆ కోరిక నెరవేరుతుందని ఆశిస్తున్నట్లుగా పాయల్ రాజ్‌పుత్ తెలిపింది. నటీ మణుల గురించి మాట్లాడుతూ.. నటి రమ్యకృష్ణతో కూడా కలిసి నటించాలనేది తన డ్రీమ్ అని పాయల్ తెలిపింది. సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో ఓ సినిమా చేయాలనీ ఉందని తన కోరికను తెలిపింది పాయల్.
Published by: Suresh Rachamalla
First published: July 8, 2020, 11:11 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading