
పాయల్ రాజ్‌పుత్ Photo : Twitter
Payal Rajput : పాయల్ రాజ్‌పుత్.. 'ఆర్ ఎక్స్ 100' చిత్రంలో తన నటనతో పాటు తన అందచందాలతో కుర్రకారు హృదయాలను దోచుకున్న ముద్దుగుమ్మ.
Payal Rajput : పాయల్ రాజ్‌పుత్.. 'ఆర్ ఎక్స్ 100' చిత్రంలో తన నటనతో పాటు తన అందచందాలతో కుర్రకారు హృదయాలను దోచుకున్న ముద్దుగుమ్మ. పాయల్ ఆ సినిమాలో నటించి సంచలనం సృష్టించిదనే చెప్పాలి. ఆ తర్వాత అలాంటి బలమైన పాత్ర పాయల్‌కు లభించలేదు. ఇటీవల వెంకటేష్ 'వెంకీమామ', రవితేజ డిస్కోరాజా వంటి చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది పాయల్. అది అలా ఉంటే పాయల్ రాజ్‌పుత్‌కు అతిలోక సుందరి శ్రీదేవి అంటే చాలా ఇష్టమట. శ్రీదేవి బయోపిక్ లో ఆమె పాత్ర పోషించాలని ఆశగా ఉందట. పాయల్ మాట్లాడుతూ.. 'చిన్నప్పటి నుంచీ నేను శ్రీదేవికి వీరాభిమానిని. ఆమె బయోపిక్ లో నటించాలనేది నా కల. అటువంటి అవకాశం వస్తే నా అంతటి అదృష్టవంతులు ఎవరూ వుండరు' అని పేర్కోంది. ఇక పాయల్ సినిమాల విషయానికి వస్తే.. ఆమె ప్రముఖ దర్శకుడు జయంత్ సి.పరాన్జీ దర్శకత్వంలో వస్తోన్న 'నరేంద్ర'లో నటిస్తోంది. ఈ సినిమాలో పాయల్ ఇండియన్ ఫస్ట్ ఫిమేల్ ఫైటర్ పైలెట్‌గా ఒక ప్రత్యేకమైన పాత్రలో కనిపించనుంది. ఇప్పటివరకు దాదాపు గ్లామర్ రోల్స్ చేసిన పాయల్ ఏకంగా లేడీ పైలట్ గా ఛాలెంజింగ్ రోల్ లో కనిపించనుంది.
First published:June 23, 2020, 14:03 IST