news18-telugu
Updated: July 6, 2020, 12:23 PM IST
పాయల్ రాజ్‌పుత్ Photo : Twitter
టాలీవుడ్ భామల్లో ట్రెండింగ్ హాట్ ఫిగర్ ఎవరంటే వెంటనే గుర్తొచ్చే పేరు.. పాయల్ రాజ్‌పుత్. తన డెబ్యూ మూవీలోనే బోల్డ్‌గా కనిపించడంలో ఏమాత్రం రాజీ పడలేదు ఈ ముద్దుగుమ్మ. తాజాగా ఈ భామ తనపై వస్తోన్న రూమర్స్‌ను ఖండించింది. వివరాల్లోకి వెళితే.. పాయల్ రాజ్‌పుత్.. తాజాగా అల్లు అర్జున్ హీరోగా నటిస్తోన్న ‘పుష్ప’ సినిమాతో పాటు కమల్ హాసన్ ‘భారతీయుడు 2’ సినిమాలో ఐటెం సాంగ్స్ చేయడానికి ఓకే చెప్పినట్టు వస్తోన్న వార్తలను ఖండించింది. తనపై ఎవరో కావాలనే ఈ రూమర్స్‌ను స్ప్రెడ్ చేస్తున్నారంది. ఒకవేళ నేను ఏదైనా సినిమాలో నటిస్తే.. ఆ విషయాన్ని నేనే స్వయంగా సోషల్ మీడియా వేదికగా తెలియజేస్తానంది. ఇప్పట్లో నేను ఏ సినిమాలో ఐటెం సాంగ్స్ చేయడానికి ఓకే చెప్పలేదు అంటూ క్లారిటీ ఇచ్చింది. అంతేకాదు ఇప్పట్లో ఏ సినిమాలో కూడా ఐటెం పాటలు చేయనని చెప్పేసింది. ఒకవేళ ఆయా చిత్రానికి సంబంధించిన వాళ్లు తనను ఇప్పటి వరకు సంప్రదించలేదంది. ఒకవేళ వాళ్లు నన్ను అడిగితే.. అపుడు ఐటెం పాటలు చేయాలా వద్దా అని ఆలోచిస్తా అంటూ గడుసుగా సమాదానమిచ్చింది పాయల్.

అల్లు అర్జున్, పాయల్ రాజ్ పుత్ Photo : Twitter
పాయల్ రాజ్‌పుత్ గతేడాది బాలయ్యతో ‘ఎన్టీఆర్ కథానాయకుడు’ సినిమాలో జయసుధ పాత్రలో నటించింది. ఇక గతేడాది చివర్లో వెంకటేష్‌తో జోడీ కట్టి 'వెంకీమామ' రూపంలో సూపర్ హిట్ సాధించిన పాయల్.. ఇటీవలే 'డిస్కో రాజా' సినిమాతో రవితేజ సరసన మెరిసింది. ఈ సినిమా ’ఈ అమ్మడి ఆశలను నీరుగార్చింది. ప్రస్తుతం పాయల్ రాజ్‌పుత్.. కంటెంట్ ఉన్న కథలను వింటోంది. కరోనా కారణంగా షూటింగ్స్‌కు దూరంగా ఉంటోంది. ప్రస్తుతం ఈ భామ పలు క్రేజీ ప్రాజెక్ట్స్‌లో హీరోయిన్గా నటిస్తోంది.
Published by:
Kiran Kumar Thanjavur
First published:
July 6, 2020, 12:23 PM IST