news18-telugu
Updated: July 24, 2020, 7:00 AM IST
పాయల్ Photo : Twitter
పంజాబీ ముద్దుగుమ్మ పాయల్‌రాజ్‌పుత్.. 'ఆర్ఎక్స్ 100' చిత్రంతో తెలుగు సినిమాలకు పరిచయమై.. తొలి సినిమాతోనే కుర్రకారు హృదయాల్ని కొల్లగొట్టింది. ఇక ఆ తర్వాత ఈ భామ నటించిన వెంకటేష్, చైతన్య 'వెంకీమామ' రవితేజ 'డిస్కోరాజా' చిత్రాలు కూడా గుర్తింపును తెచ్చిపెట్టాయి. దీంతో ప్రస్తుతం ఈ భామకు తెలుగులో సూపర్ క్రేజ్ వచ్చింది. అందులో భాగంగా పరిశ్రమ నుంచి పలు భారీ చిత్రాల్లో ప్రత్యేకగీతాల్లో నటించమని ఆఫర్లు వస్తున్నాయట.. అయితే ఇక నుంచి ఐటెంసాంగ్స్ చేయనని చెప్పింది పాయల్‌రాజ్‌పుత్. ఆమె మాట్లాడుతూ ' 'భవిష్యత్తులో ఐటెంసాగ్స్ చేయొద్దనుకుంటున్నా. మహిళా ప్రధాన చిత్రాలు, న్యూ కాన్సెప్ట్‌తో ఉన్న సినిమాల్లోనే నటించాలనీ కోరుకుంటోందట. ఇంకా ఆమె మాట్లాడుతూ.. తెలుగు చిత్రసీమలో నాకు ఎన్నో కలలున్నాయి. ముఖ్యంగా ప్రభాస్, విజయ్ దేవరకొండ వంటి టాప్‌స్టార్స్ సరసన హీరోయిన్గా నటించాలన్నది తన కోరికని పేర్కోంది. ఆమె ఇంకా మాట్లాడుతూ.. సీనియర్ నటీమణుల్లో రమ్యకృష్ణ నటనను ఎంతగానో ఇష్టపడతానని, ఆమెతో కలిసి ఒక్క సినిమాలో నటిస్తే అంతకుమించిన ఆనందం లేదని పాయల్‌రాజ్‌పుత్ తన కోరికను తెలిపింది.

పాయల్ రాజ్‌పుత్ (Payal Rajput Instagram)
అది అలా ఉంటే ప్రస్తుతం ఏమాత్రం ఆశ జనకంగా లేని సినిమాలను వదిలి.. పాయల్ వెబ్ సీరిస్‌కు ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. హీరోయిన్లు చాలా మంది ఇప్పుడు డిజిటల్ ప్లాట్ ఫాం వైపు దృష్టి సారిస్తున్నారు. అలా ఇప్పటికే పలువురు హీరోయిన్లు వెబ్ సీరీస్ లో నటిస్తున్నారు. సమంత నుండి మొదలుకొని.. కాజల్, తమన్నా, షాలినీ పాండే, కియారా ఇలా అందరూ ఈ భాటలో నడుస్తున్నవారే.. అక్కడ క్లిక్ అయితే మరోసారి సినిమాల్లో అవకాశాలు వచ్చే ఆస్కారం ఉండడంతో ప్రస్తుతానికి సినిమాలకు కొంత గ్యాప్ ఇచ్చి.. వెబ్ సిరీస్‌లపై దృష్టి సారిస్తున్నారు హీరోయిన్స్. ఈ క్రమంలో పాయల్ రాజ్ పుత్ కూడా ఓ వెబ్ సీరీస్ లో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట. ఇక వెబ్ సీరీస్ అంటే పాయల్ ఎంత హాట్‌గా దర్శనమిస్తుందో అని ఆశగా ఎదురుచూస్తున్నారు ఆమె అభిమానులు.
Published by:
Suresh Rachamalla
First published:
July 24, 2020, 7:00 AM IST