నక్కతోక తొక్కిన పాయల్ రాజ్ పుత్.. బన్ని సినిమాలో ఛాన్స్..

మూమూలుగానే సుకుమార్ సినిమాలో ఐటెమ్ సాంగ్స్ ఓ రేంజ్‌లో ఉంటాయి. దానికి అల్లు అర్జున్ లాంటీ హీరో తోడైతే అది ఇక మరో రేంజ్‌లో ఉంటుంది.

news18-telugu
Updated: July 2, 2020, 1:29 PM IST
నక్కతోక తొక్కిన పాయల్ రాజ్ పుత్.. బన్ని సినిమాలో ఛాన్స్..
అల్లు అర్జున్, పాయల్ రాజ్ పుత్ Photo : Twitter
  • Share this:
అల్లు అర్జున్ అల వైకుంఠపురములో లాంటీ బ్లాక్ బస్టర్ సినిమా తర్వాత సుకుమార్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే.  ‘పుష్ప’ అంటూ ఫస్ట్ లుక్ విడుదల చేసి సంచలనం స‌ృష్టించింది చిత్రబృందం. కాగా విడుదలైన ఫస్ట్ లుక్‌లో అల్లు అర్జున్ రఫ్ అండ్ రస్టిక్ లుక్ కేక పెట్టిస్తున్నాడు. ఓ షేడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ సినిమాలో ఓ స్పెషల్‌ సాంగ్‌ ఉండనుందట. మూమూలుగా సుకుమార్ సినిమాలో ఐటెమ్ సాంగ్స్ అదిరిపోతాయి. అందులో భాగంగా ఈ సినిమాలో కూడా ఓ స్పెషల్ సాంగ్‌ను ప్లాన్ చేశాడట సుకుమార్. అయితే ఈ సాంగ్‌ను మొదటినుండి ఓ బాలీవుడ్ భామపై చిత్రీకరించనున్నారని వార్తలు వచ్చాయి. అంతేకాదు ఈ సాంగ్‌లో కియారా నటిస్తుందని.. ఆ తర్వాత మరో హాట్ బ్యూటీ ఊర్వశి రౌటెలాను తీసుకోబోతున్నారని కొన్ని వార్తలు హల్ చల్ చేశాయి. అయితే తాజాగా వస్తోన్న సమాచారం మేరకు హాట్ బ్యూటీ పాయల్ రాజ్ పుత్ ను ఎంపిక చేశారనీ ప్రచారం జరుగుతోంది. మరి ఈ ముగ్గురిలో ఏవరితో బన్ని డాన్స్ చేయనున్నాడనేది తెలియాల్సి ఉంది.

ఇక ఈ సినిమాలో అల్లు అర్జున్‌కు జోడిగా అందాల తార.. వరుస విజయాలతో దూసుకుపోతున్న రష్మిక మందన్న నటిస్తోంది. ఎప్పటిలాగే దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించనున్నాడు. ప్యాన్ ఇండియన్ సినిమాగా తెరకెక్కుతోన్న ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తోంది.
First published: July 2, 2020, 1:29 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading