news18-telugu
Updated: November 13, 2020, 9:36 AM IST
చేతిలో మందు గ్లాస్‌తో పాయల్ Photo : Instagram
ఆర్ ఎక్స్ 100 చిత్రం ద్వారా సెక్సీ తారగా పేరుతెచ్చుకున్న భామ పాయల్. ఆ సినిమాలో తన అందచందాలతో కుర్రకారుకు నిద్రలేకుండా చేసిందీ పంజాబీ ముద్దుగుమ్మ. 'ఆర్ఎక్స్ 100' తర్వాత ఈ భామ నటించిన వెంకటేష్, చైతన్య 'వెంకీమామ' రవితేజ 'డిస్కోరాజా' చిత్రాలు కూడా గుర్తింపును తెచ్చిపెట్టాయి. దీంతో ప్రస్తుతం ఈ భామకు హాట్ భామగా తెలుగులో సూపర్ క్రేజ్ వచ్చింది. అందులో భాగంగా పరిశ్రమ నుంచి పలు భారీ చిత్రాల్లో ప్రత్యేకగీతాల్లో నటించేందుకు ఆఫర్స్ వస్తున్నాయట. అయితే కేవలం ఐటెమ్ సాంగ్స్ మాత్రమే వస్తున్నాయట.ద దీంతో ఇక అలాంటీ సాంగ్స్‌లో నటించనని చెబుతోంది పాయల్. అది అలా ఉంటే పాయల్ రాజ్ పుత్ తాజాగా ఓ లిక్కర్ బ్రాండుకి ప్రచారకర్తగా మారింది. చేతిలో రాయల్ ఛాలెంజ్ విస్కీ గ్లాసుతో ఆమె ఈ బ్రాండుకి చేస్తున్న ప్రచారం ప్రస్తుతం టాలీవుడ్లో సంచలనం అవుతోంది. అయితే మామూలుగా ఆల్కహాల్ బేస్డ్ యాడ్స్‌కి లేదా ఉత్పత్తులకి హీరోలు బ్రాండ్ అంబాసిడర్లుగా వుంటారు. కానీ ఇక్కడ అంతా రివర్స్ చేసింది పాయల్. ట్రెండుని మార్చి పాయల్ కొత్తట్రెండ్ని సెట్ చేసింది. ఇక దీనికి సంబందించిన ఓ ఫోటోను తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన పాయల్.. గ్లాస్ విస్కీతో వున్న ఫోటోని పంచుకుంది. అంతేకాదు తెలంగాణలో లభించే సరికొత్త సున్నితమైన ఖరీదైన విస్కీ అని క్యాప్షన్ కూడా ఇచ్చింది. అయితే మాములుగా చాలా మంది మద్యం సేవించినప్పటికీ.. బహిరంగంగా దాని గురించి మాట్లాడటానికి ఇష్టపడరు కానీ పాయల్ మాత్రం అందిరికి భిన్నంగా విస్కీని ప్రమోట్ చేయడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోందని అంటున్నారు నెటిజన్స్.
ఇక పాయల్ సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం ఏమాత్రం ఆశ జనకంగా లేని సినిమాలను వదిలి.. పాయల్ వెబ్ సీరిస్‌కు ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. హీరోయిన్లు చాలా మంది ఇప్పుడు డిజిటల్ ప్లాట్ ఫాం వైపు దృష్టి సారిస్తున్నారు. అలా ఇప్పటికే పలువురు హీరోయిన్లు వెబ్ సీరీస్ లో నటిస్తున్నారు. సమంత నుండి మొదలుకొని.. కాజల్, తమన్నా, షాలినీ పాండే, కియారా ఇలా అందరూ ఈ భాటలో నడుస్తున్నవారే.. అక్కడ క్లిక్ అయితే మరోసారి సినిమాల్లో అవకాశాలు వచ్చే ఆస్కారం ఉండడంతో ప్రస్తుతానికి సినిమాలకు కొంత గ్యాప్ ఇచ్చి.. వెబ్ సిరీస్‌లపై దృష్టి సారిస్తున్నారు హీరోయిన్స్. ఈ క్రమంలో పాయల్ రాజ్ పుత్ కూడా ఓ వెబ్ సీరీస్ లో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట. ఇక వెబ్ సీరీస్ అంటే పాయల్ ఎంత హాట్‌గా దర్శనమిస్తుందో అని ఆశగా ఎదురుచూస్తున్నారు ఆమె అభిమానులు.
Published by:
Suresh Rachamalla
First published:
November 13, 2020, 9:36 AM IST