
పాయల్ రాజ్పుత్ (Payal Rajput Instagram)
ఎంతో ఉజ్వల భవిష్యత్తు ఉన్న సుశాంత్ సింగ్ రాజ్పుత్... హఠాత్తుగా ఆత్మహత్య చేసుకొని తనువు చాలించడాన్ని చాలా మంది జీర్ణించుకోలేకపోతున్నారు. తాజాగా పాయల్ రాజ్పుత్ కూడా బాలీవుడ్లో తాను ఎదుర్కొన్న అవమానాల గురించి చెప్పుకొచ్చింది.
ఎంతో ఉజ్వల భవిష్యత్తు ఉన్న సుశాంత్ సింగ్ రాజ్పుత్... హఠాత్తుగా ఆత్మహత్య చేసుకొని తనువు చాలించడాన్ని చాలా మంది జీర్ణించుకోలేకపోతున్నారు. ఈయన మరణానికి బాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్న రాజకీయాలే కారణం అని కంగనా రనౌత్ సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే కదా. ఈమె వ్యాఖ్యలకు వివేక్ ఓబరాయ్, రవీనా టాండన్, శేఖర్ కపూర్, ప్రకాష్ రాజ్ వంటి వాళ్లు మద్దతు తెలిపారు. తాజాగా పాయల్ రాజ్పుత్ కూడా తాను బాలీవుడ్లో అవకాశాల కోసం ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నట్టు వారికి తన వంత పాడింది. పాయల్ రాజ్పుత్ కూడా సుశాంత్ సింగ్ బాటలో టీవీలో పాపులర్ అయిన తర్వాత సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత బాలీవుడ్లో అవకాశాల కోసం ప్రయత్నిస్తే.. ఆమెకు కొన్నిఅవమానాలు ఎదురయ్యాయని చెప్పుకొచ్చింది. నీవు హీరోయిన్గా పనికిరావు. నీలో ఆ లక్షణాలు అసలు లేవు. అపుడు నాకు చాలా బాధ కలిగిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేసుకుంది.ఆ తర్వాత పాయల్ ఓ పంజాబీ సినిమాతో హీరోయిన్గా పరిచయమైంది. ఇక తెలుగులో RX 100 తో సెన్సేసనే క్రియేట్ చేసింది. ఆ తర్వాత కథానాయికగా పాయల్ తన కంటూ ప్రత్యేకు గుర్తింపు తెచ్చుకుంది.
Published by:Kiran Kumar Thanjavur
First published:June 18, 2020, 12:27 IST