హోమ్ /వార్తలు /సినిమా /

అక్టోబర్ 11న పాయల్ రాజ్‌పుత్.. 'RDX ల‌వ్‌'...

అక్టోబర్ 11న పాయల్ రాజ్‌పుత్.. 'RDX ల‌వ్‌'...

Twitter/ProducerCKalyan

Twitter/ProducerCKalyan

Payal Rajput : పాయల్‌ అందాలనే ప్రధాన ఆకర్షణగా తీర్చి దిద్దిన  ‘ఆర్ డీ ఎక్స్ లవ్’  విడుదల తేది కన్ఫామ్ అయ్యింది. అక్టోబర్ 11న ఈ సినిమాను విడుదల చేయనున్నామని ప్రకటించారు చిత్ర దర్శక నిర్మాతలు.

    పాయల్ రాజ్‌పుత్.. తొలి చిత్రం 'RX100'లోనే అందాలు ఆరబోసి.. యూత్‌లో సూపర్ క్రేజ్ తెచ్చుకుంది. ఆ సినిమా సూపర్ హిట్ అవ్వడంతో ఈ భామకు వరుసగా ఆఫర్స్ వెల్లువలా వస్తున్నాయి. పాయల్ ప్ర‌స్తుతం వెంకటేష్ సరసన 'వెంకీమామ‌'లోను రవితేజతో 'డిస్కోరాజా'లో నటిస్తోంది. ఈ సినిమాలతో పాటు మరో సినిమా 'RDX ల‌వ్‌' అనే సినిమాలో న‌టిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకు సంబందించిన ట్రైలర్ ఈ మధ్య విడుదలై సోషల్ మీడియాలో వైరల్‌‌గా మారింది.    పాయల్‌ అందాలనే ప్రధాన ఆకర్షణగా తీర్చి దిద్దిన  ‘ఆర్ డీ ఎక్స్ లవ్’  విడుదల తేది కన్ఫామ్ అయ్యింది. అక్టోబర్ 11న ఈ సినిమాను విడుదల చేయనున్నామని ప్రకటించారు చిత్ర దర్శక నిర్మాతలు. దానికి సంబందించిన పోస్టర్స్‌ను కూడా విడుదల చేసింది చిత్రబృందం. పాయల్‌కు జోడిగా తేజస్ కంచ‌ర్ల  నటిస్తున్నారు. హ్యాపీ మూవీస్ పతాకంపై సి కళ్యాణ్ నిర్మించిన ఈ 'RDX లవ్' చిత్రానికి శంకర్ భాను దర్శకత్వం వహించారు.


    First published:

    Tags: Payal Rajput, Telugu Movie News

    ఉత్తమ కథలు