పాయల్ రాజ్‌పుత్ ‘RDX లవ్’ హాట్ వీడియో సాంగ్ రిలీజ్.. యూ ట్యూబ్‌లో రచ్చే..

కొందరు హీరోయిన్లకు హిట్లు ఫ్లాపులతో అస్సలు పనుండదు. వాళ్లకు క్రేజ్ మాత్రమే ఉంటుంది. అలాంటి లిస్టులోకి చాలా త్వరగా వచ్చేసిన ముద్దుగుమ్మ పాయల్ రాజ్‌పుత్. RX 100 సినిమాతో ఈమె సృష్టించిన..

Praveen Kumar Vadla | news18-telugu
Updated: October 18, 2019, 8:52 PM IST
పాయల్ రాజ్‌పుత్ ‘RDX లవ్’ హాట్ వీడియో సాంగ్ రిలీజ్.. యూ ట్యూబ్‌లో రచ్చే..
RDX Love సినిమాలో పాయల్ రాజ్‌పుత్ (Source: Twitter)
  • Share this:
కొందరు హీరోయిన్లకు హిట్లు ఫ్లాపులతో అస్సలు పనుండదు. వాళ్లకు క్రేజ్ మాత్రమే ఉంటుంది. అలాంటి లిస్టులోకి చాలా త్వరగా వచ్చేసిన ముద్దుగుమ్మ పాయల్ రాజ్‌పుత్. RX 100 సినిమాతో ఈమె సృష్టించిన సంచలనాలకు మాటల్లేవు. ఆ తర్వాత చాలా గ్యాప్ తీసుకుని ఈ మధ్యే RDX లవ్ అంటూ ప్రేక్షకుల ముందుకొచ్చింది. కానీ ఈ చిత్రం అస్సలు ఆకట్టుకోలేదు సరికదా దర్శకుడు శంకర్ భాను కెరీర్‌కు మచ్చగా మారిపోయింది. దిగజారిపోయి తీసావంటూ విమర్శలు ఎదుర్కొన్నాడు. అయితే ఇప్పుడు ఈ చిత్రంలోని ఓ హాట్ వీడియో సాంగ్ విడుదల చేసారు దర్శక నిర్మాతలు. ఏ పాటను అయితే చూపించి సినిమాకు పబ్లిసిటీ చేసుకున్నారో.. ఏ స్టిల్స్ అయితే వాడుకుని బిజినెస్ చేసుకున్నారో ఇప్పుడు అదే పాట యూ ట్యూబ్‌లో వచ్చేసింది.

నీ నకసికలే అంటూ సాగిపోయే ఈ పాటలో పాయల్ అందాలే ఆయుధం. ఈ గ్లామర్ షోనే ఇప్పుడు యూ ట్యూబ్‌లో పాట ట్రెండ్ అయ్యేలా చేస్తుంది. విడుదలైన క్షణం నుంచి పాట దున్నేస్తుంది. సినిమా ఫ్లాప్ అయినా కూడా కచ్చితంగా పాయల్ అందాల ఆరబోతతో ఈ వీడియో సాంగ్ మాత్రం బ్లాక్ బస్టర్ అయ్యేలా కనిపిస్తుంది. వ్యూస్ పరంగా యూ ట్యూబ్‌లో హాట్ వీడియో సాంగ్స్‌కు ఎప్పుడూ డిమాండ్ ఉంటుంది. దానికి పాయల్ గ్లామర్ ప్లస్ క్రేజ్ కూడా తోడైతే అడ్డేముంటుంది. ఇప్పుడు కూడా ఇదే జరగబోతుంది. కచ్చితంగా RDX లవ్ సాంగ్ కుమ్మేయడం ఖాయంగా కనిపిస్తుంది.

First published: October 18, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>