సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న రాశీ ఖన్నా, పాయల్ టిక్‌ టాక్ వీడియో..

తాజాగా వెంకటేష్, నాగ చైతన్య హీరోలుగా నటించిన ‘వెంకీ మామ’ సినిమాలో వెంకటేష్ చెప్పిన డైలాగ్స్‌ను పాయల్ రాజ్‌పుత్, రాశీ ఖన్నా టిక్ టాక్ వీడియో చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసారు.

news18-telugu
Updated: December 9, 2019, 12:58 PM IST
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న రాశీ ఖన్నా, పాయల్ టిక్‌ టాక్ వీడియో..
పాయల్ రాజ్‌పుత్, రాశీఖన్నా టిక్‌టాక్ వీఢియో (twitter/Photo)
  • Share this:
ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో టిక్ టాక్ చాల పాపులర్ అయింది. మన ఫేవరేట్ హీరో, హీరోయిన్స్ వాయిస్‌ను టిక్‌టాక్ చేస్తున్నారు. అచ్చు వాళ్లు మాట్లాడినట్టే మనం ఎక్స్‌ప్రెషన్స్ ఇస్తే చాలు. తాజాగా వెంకటేష్, నాగ చైతన్య హీరోలుగా నటించిన ‘వెంకీ మామ’ సినిమాలో వెంకటేష్ చెప్పిన డైలాగ్స్‌ను పాయల్ రాజ్‌పుత్, రాశీ ఖన్నా టిక్ టాక్ వీడియో చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసారు. ఈ సినిమాలో వెంకటేష్ గోదావరిలో ఈత నేర్పా.. బరిలో ఆట నేర్పా.. ఇపుడు జాతరలో వేట నేర్పిస్తా .. రారా అల్లుడు అంటూ వెంకీ మామ ట్రైలర్‌లో వెంకటేష్ చెప్పిన డైలాగ్‌ను ఈ భామలిద్దరు డబ్ స్మాష్ చేసి కలిసి టిక్‌టాక్ వీడియో చేసారు. ఈ వీడియో ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వెంకీ మామ చిత్ర యూనిట్ వెళుతున్న బస్సులో పాయల్ రాజ్‌పుత్,రాశీ ఖన్నా డైలాగ్స్ చెబుతుండగా మధ్యలో చైతూ వస్తాడు. ఈ టిక్‌టాక్ వీడియో ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.First published: December 9, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>