టాలీవుడ్‌లో పాయల్ రాజ్‌పుత్ ప్రకంపనలు.. RX100 బ్యూటీ నెక్ట్స్ టార్గెట్ అదే..

'ఆర్ఎక్స్ 100' చిత్రంతో టాలీవుడ్ వెండితెరకు పరిచయమైన హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్. ఈ చిత్రంలో ఈ అమ్మడు నెగెటివ్ పాత్రలో నటించి అదరగొట్టింది.

news18-telugu
Updated: September 26, 2019, 2:55 PM IST
టాలీవుడ్‌లో పాయల్ రాజ్‌పుత్ ప్రకంపనలు.. RX100 బ్యూటీ నెక్ట్స్ టార్గెట్ అదే..
పాయిల్ రాజ్‌పుత్ (Instagram/Photos)
  • Share this:
'ఆర్ఎక్స్ 100' చిత్రంతో టాలీవుడ్ వెండితెరకు పరిచయమైన హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్. ఈ చిత్రంలో ఈ అమ్మడు నెగెటివ్ పాత్రలో నటించి అదరగొట్టింది. పైగా, అందాలను  ఆరబోసి... యువత పిచ్చెక్కిపోయేలా చేసింది. ఈ చిత్రం సూపర్ హిట్ కావడంతో అటు నిర్మాతలకు కాసుల వర్షం...హీరోయిన్‌గా పాయల్‌కు మంచి గుర్తింపును తెచ్చిపెట్టింది. ప్రెజంట్.. పాయ‌ల్ రాజ్‌పుత్ ప్ర‌ధాన పాత్ర‌లో ‘RDX లవ్’ సినిమా తెరకెక్కింది. శంక‌ర్ భాను ద‌ర్శ‌క‌త్వంలో తెరకెక్కిన  ఈ చిత్రాన్ని  సీకే ఎంట‌ర్‌టైన్‌మెంట్స్‌, హ్యాపీ మూవీస్ సంయుక్తంగా నిర్మించాయి.మరోవైపు ప్రస్తుతం తనకున్న క్రేజ్ క్యాచ్ చేసుకునేలా సోషల్ మీడియాలో అందాల విందుకు దిగుతోంది పాయల్. తన తాజా సినిమా RDX లవ్ విశేషాలు, ఆ సినిమాలో ఆమె చేసిన గ్లామర్ ట్రీట్ తాలూకు పోస్టర్స్ షేర్ చేస్తూ మాయ చేస్తోంది.

పాయల్ రాజ్‌పుత్ (Instagram/Photos)


ఈ కోవలోనే పాయల్ రాజ్‌పుత్  ఓ ట్వీట్ చేసి సంచలనం సృష్టించింది ."ప్రకంపనలు సృష్టించాలని డిసైడ్ అయ్యా" అంటూ సెక్సీ పిక్ ద్వారా ఆమె నెటిజన్ల నుద్దేశిస్తూ ట్వీట్ చేసింది. ప్రకంపనలు అంటోందంటే ఇంకెలాంటి విషయాల పట్ల ఓపెన్ అవుతుందో అని నెటిజన్స్ చెవులు కొరుక్కుంటున్నారు.  కానీ పాయల్ రాజ్‌పుత్ మాత్రం తన RDX లవ్ సినిమా ద్వారా జనాలను ఎడ్యుకేట్ చేయబోతున్నామంటూ గర్వంగా చెప్పుకుంటోంది.అందాలు వడ్డించడంలో దిట్ట అయిన ఈ ముద్దుగుమ్మ.. తన మొదటి సినిమా Rx 100 తోనే కుర్రకారు మనసు దోచుకుంది. ఆ తర్వాత 'సీత' సినిమాలో బులెట్ మీదొచ్చే బుల్ రెడ్డి పాటతో తనలోని హాట్‌నెస్ అంతా బయటపెట్టింది పాయల్. మరోవైపు ఈ భామ నటించిన ‘వెంకీ మామ’ త్వరలో విడుదలకు కానుంది.

First published: September 26, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>