HOME »NEWS »MOVIE »payal rajput feed to cows in gow shala video goes viral on social media ta

పాయల్ రాజ్‌పుత్‌లో గ్లామర్‌తో పాటు ఈ యాంగిల్ కూడా ఉందా..

పాయల్ రాజ్‌పుత్‌లో గ్లామర్‌తో పాటు ఈ యాంగిల్ కూడా ఉందా..
పాయల్ రాజ్‌పుత్ (Instagra/Photo)

Payal Rajput : ఆర్‌ఎక్స్100 సినిమాతో తెలుగు ప్రేక్షకుల గుండెల్లో గుబులు పుట్టించిన పాయల్ రాజ్‌పుత్ సందర్భాన్ని బట్టి అందాలు ప్రదర్శిస్తూనే ఉంది.తాజాగా ఈమెలో మరో కోణాన్నిఆవిష్కరించింది.

  • Share this:
    Payal Rajput : ఆర్‌ఎక్స్100 సినిమాతో తెలుగు ప్రేక్షకుల గుండెల్లో గుబులు పుట్టించిన పాయల్ రాజ్‌పుత్ సందర్భాన్ని బట్టి అందాలు ప్రదర్శిస్తూనే ఉంది. ఇన్‌స్టాగ్రామ్‌లో యాక్టివ్‌గా ఉండే ఈ బ్యూటీ.. తన హాట్ ఫోటోలను షేర్ చేస్తూ అభిమానులకు కనువిందు చేస్తోంది. పాయల్ తన డెబ్యూ మూవీలోనే బోల్డ్‌గా కనిపించడంలో ఏమాత్రం రాజీ పడలేదు ఈ ముద్దుగుమ్మ. ఇక ఈ సినిమా తర్వాత ఈ హాట్ భామకు అలాంటి క్యారెక్టర్సే క్యూ కట్టాయట ఆ తర్వాత. కానీ, 'నేనలాంటి దాన్ని కాదు..' అంటూ వాటన్నింటినీ సున్నితంగా తిరస్కరించింది.  అయితే ఆ తర్వాత విభిన్నమైన చిత్రాలు ఎంచుకుంటూ అందరికీ దగ్గరైంది పాయిల్. గతేడాది చివర్లో వెంకటేష్‌తో జోడీ కట్టి 'వెంకీమామ' రూపంలో సూపర్ హిట్ సాధించిన పాయల్.. ఇటీవలే 'డిస్కో రాజా' సినిమాతో రవితేజ సరసన మెరిసింది. ఈ సినిమా ’ఈ అమ్మడి ఆశలను నీరుగార్చింది. తాజాగా పాయల్ రాజ్‌పుత్ ఓ మీడియాతో మాట్లాడి తన కెరీర్, పెళ్ళికి సంబంధించిన విషయాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఈ సందర్భంగా ముద్దు సీన్లు, బోల్డ్ సన్నివేశాలలో నటించే టపుడు ఇబ్బంది పడకుండా ముందుగా అలాంటి వాటి గురించి తన తల్లితో స్వేచ్చగా చర్చిస్తానని చెబుతోంది పాయల్.  ఈ భామలో గ్లామర్ కోణమే కాదు.. మంచి మనసు ఉంది. తాజాగా ఈ భామ ఓ గోశాలలో ఆవులకు గ్రాసం పెడుతోంది. అంతేకాదు.. వీలు దొరకినపుడల్లా గోవులకు ఆహారం పెడితే తనకు సంతృప్తి ఉంటుందని చెప్పుకొచ్చింది.

    Published by:Kiran Kumar Thanjavur
    First published:June 10, 2020, 13:24 IST