'RX100' చిత్రంతో టాలీవుడ్ లో ఒక్కసారిగా హాట్ టాపిక్ అయింది పాయల్ రాజ్పుత్. తొలి చిత్రంతోనే తెలుగు ప్రేక్షకుల్ని తనవైపు తిప్పుకుందీ ఈ పంజాబీ భామ. అందాల విందు చేయడమే కాదు, అభినయంతోనూ మెప్పిస్తూ తెలుగు ప్రేక్షకులను కిర్రెక్కిస్తోంది. తాజాగా‘RDX లవ్’ అనే చిత్రంతో మరోసారి ప్రేక్షకుల ముందు కొచ్చింది. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర సరైన ఫలితాన్ని రాబట్టలేదు. తాజాగా పాయల్.. ఒక ప్రముఖ మీడియా ఇంటర్వ్యూ కు పలు ఆసక్తికర అంశాలను వెల్లడించింది. లక్ష రూపాయలు చేతిలో పట్టుకుని సినీ అవకాశాలు వెతుక్కుంటూ తొలిసారి ముంబయిలో అడుగుపెట్టా. ఆ డబ్బు సంపాదించడం కోసం ఏడాది కష్టపడ్డా. ఎన్నో ప్రకటనల్లో నటించా. పలు వేదికలపై వ్యాఖ్యాతగా పనిచేశా. అలా నన్ను నేను నిరూపించుకునేందుకు సిద్ధమయ్యా. తెలుగు, తమిళ చిత్రసీమల్లో ఎన్నో ఆడిషన్లకు హాజరయ్యా. ప్రతిచోటా నాకు తిరస్కారాలే ఎదురయ్యాయి. కొందరు నా ముఖం దక్షిణాది చిత్రాలకు పనికిరాదనే చెప్పేవారు. చివరికి ‘ఆర్ఎక్స్ 100’ చేసే ఛాన్స్ దొరికింది అంటూ తెలిపింది పాయల్.

Instagram/rajputpaayal
ఇక తనను చేసుకోబోయేవాడు ఎలా ఉండాలన్న దానిపై క్లారిటీ ఇచ్చింది. నన్ను చేసుకోబోయే వాడు అందంగా ఉండాలి.. ఇంత ఎత్తుండాలనేమీ చెప్పను. నాకు తగ్గట్టుగా ఉంటే చాలు. హాస్య చతురత మాత్రం తప్పనిసరి. నేనే విషయంలోనైనా అలిగితే నన్ను బుజ్జగించాలి. భవిష్యత్తులో చేసుకుంటే గీసుకుంటే ఖచ్చితంగా ప్రేమ పెళ్లి చేసుకుంటా. చిత్ర పరిశ్రమకు చెందిన వ్యక్తిని మాత్రం అస్సలు చేసుకోను అంటూ ఈ సందర్భంగా తెలిపింది పాయల్. ఈ సందర్భంగా తన కుటుంబం గురించి మాట్లాడుతూ ... మాది ఉమ్మడి కుటుంబం కావడంతో ప్రతి పండగ మా ఇంట్లో ఒక పెద్ద సంబరంలా జరుగుతుంది. ముఖ్యంగా దసరా, దీపావళి లాంటి పండగలు మరింత ప్రత్యేకంగా చేస్తారు. నాకు ఖాళీ దొరికితే చాలు అమ్మతో కలిసి వంట గదిలో దూరిపోతా. నాకు అన్ని వంటలూ వచ్చు. ముఖ్యంగా పంజాబీ వంటకాలు అదరగొట్టేస్తా. ప్రస్తుతం మాంసాహారం తినడం మానేశా అంటూ చెప్పింది పాయల్.
Published by:Kiran Kumar Thanjavur
First published:October 23, 2019, 15:02 IST