Payal Ghosh: అనురాగ్ కశ్యప్ పై ముంబై పోలీసులకు ఫిర్యాదు చేయనున్న పాయల్ ఘోష్..

అనురాగ్ పై పోలీసులకు ఫిర్యాదు చేయనున్న పాయల్ ఘోష్ (Twitter/Photo)

రీసెంట్‌గా బాలీవుడ్ నటి పాయల్ ఘోష్.. దర్శకుడు అనురాగ్ కశ్యప్  తనను లైంగికంగా వేధించాడని పేర్కొంది. ఈ సందర్భంగా పాయల్ ఘోష్.. దర్శకుడు అనురాగ్ కశ్యప్ చట్టపరమైన చర్యలు తీసుకోవాలంటూ పోలీసులకు కంప్లైంట్ ఇవ్వనుంది.

  • Share this:
    గత కొన్ని రోజులుగా బాలీవుడ్‌లో క్యాస్టింగ్ కౌచ్ ఇష్యూ నడుస్తున్న సంగతి తెలిసిందే కదా. ఈ క్యాస్టింగ్ కారణంగా కొంత మంది దర్శకులు, నటులు తమ అవకాశాలను  కోల్పోయారు. రీసెంట్‌గా బాలీవుడ్ నటి పాయల్ ఘోష్.. దర్శకుడు అనురాగ్ కశ్యప్  తనను లైంగికంగా వేధించాడని పేర్కొంది. ఓ సందర్భంలో తనకు కథ చెబుతానని చెప్పిన అనురాగ్ కశ్యప్.. తన గదిలోకి తీసుకెళ్లాడని .. ఆ సమయంలో అనురాగ్‌ కశ్యప్‌ 'బాంబే వెల్‌వెట్‌' సినిమాను డైరెక్ట్‌ చేస్తున్నాడని చెప్పింది. అయితే ఆ సినిమాలో నటించాలనుకుంటే తనతో పడక సుఖాన్ని పంచుకోవాలని కోరినట్టు పాయల్ ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే కదా. అంతేకాదు తనతో సన్నిహితంగా మెలిగితే భవిష్యత్తులో మరిన్ని సినిమాల్లో ఆఫర్స్ ఇస్తానని చెప్పినట్టు పాయల్ పేర్కొంది. అంతేకాదు సినిమా ఇండస్ట్రీలో శారీరక సంబంధం కలిగి ఉండటం పెద్ద తప్పేం కాదన్నట్లు చెప్పాడు.  అంతేకాదు తనకు శారీరక సుఖాన్ని అందించాలని కోరుతు తనను తాకాలని ప్రయత్నించాడు. ఆ సమయంలో తను ఎలాగో అలా తప్పించుకొని వచ్చినట్టు చెప్పింది పాయల్.


    ఆ తర్వాత మరే దర్శకుడితో  ఇలాంటి అనుభవం ఎదురు కాలేదని పాయల్ చెప్పిన సంగతి తెలిసిందే కదా. తాజాగా అనురాగ్ కశ్యప్ పై ఈ రోజు సాయంత్రం తన లాయర్‌తో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్టు పాయల్ ఘోష్ పేర్కొంది. అంతేకాదు అతనిపై చట్టపరమైన చర్యలు తీసుకునేవరకు పోరాడుతానంది.



    అనురాగ్ కశ్యప్, పాయల్ ఘోష్ (Twitter/Photo)


    అనురాగ్ కశ్యప్ పై కంప్లైట్ చేసినందకు తనకు వివిధ వ్యక్తులు నుంచి బెదిరింపు ఫోన్ కాల్స్  వస్తున్నాయని పాయల్ తెలిపింది. ఈ సందర్భంగా తనకు ప్రాణ రక్షణ కల్పించమని మహారాష్ట్ర హోం మంత్రి అనిల్ దేశ్‌ముఖ్‌కు తన లాయర్ ఓలేఖ రాయనున్నట్టు తెలిపింది.  నాకు తెలిసినంత వరకు అనురాగ్ కశ్యప్ డ్రగ్స్ వాడే అలవాటు ఉందా లేదా అనే సంగతి మాత్రం తనకు తెలియదంది. కానీ నేను అతన్ని  కలిసినపుడు అతను స్మోక్ చేస్తున్నాడు. కానీ అది సిగరెట్ కాదు మరేదో అంటూ పాయల్ పేర్కొనడం విశేషం. ఈ ఇష్యూలో అనురాగ్ కశ్యప్‌‌ను కొంత మంది వెనకేసుకొచ్చారు. ఆయనకు మద్ధతుగా మాట్లాడతూ..  నన్ను తప్పు పట్టారు. అనురాగ్‌కు సపోర్ట్ చేసినవాళ్లు ఆయనతో ఏదో ఒక సహాయం పొంది ఉంటారు. అందుకే ఈ రకంగా వారు తనకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నట్టు పాయల్ పేర్కొంది.


    నురాగ్ కశ్యప్ పై కంప్లైట్ చేసినందకు తనకు వివిధ వ్యక్తులు నుంచి బెదిరింపు ఫోన్ కాల్స్  వస్తున్నాయని పాయల్ తెలిపింది. ఈ సందర్భంగా తనకు ప్రాణ రక్షణ కల్పించమని మహారాష్ట్ర హోం మంత్రి అనిల్ దేశ్‌ముఖ్‌కు తన లాయర్ ఓలేఖ రాయనున్నట్టు తెలిపింది.  నాకు తెలిసినంత వరకు అనురాగ్ కశ్యప్ డ్రగ్స్ వాడే అలవాటు ఉందా లేదా అనే సంగతి మాత్రం తనకు తెలియదంది. కానీ నేను అతన్ని  కలిసినపుడు అతను స్మోక్ చేస్తున్నాడు. కానీ అది సిగరెట్ కాదు మరేదో అంటూ పాయల్ పేర్కొనడం విశేషం. ఈ ఇష్యూలో అనురాగ్ కశ్యప్‌‌ను కొంత మంది వెనకేసుకొచ్చారు. ఆయనకు మద్ధతుగా మాట్లాడతూ..  నన్ను తప్పు పట్టారు. అనురాగ్‌కు సపోర్ట్ చేసినవాళ్లు ఆయనతో ఏదో ఒక సహాయం పొంది ఉంటారు. అందుకే ఈ రకంగా వారు తనకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నట్టు పాయల్ పేర్కొంది.
    Published by:Kiran Kumar Thanjavur
    First published: