Home /News /movies /

PAY FOR VIEW DISASTER KGF 2 RRR WILL WORK OUT FOR PUBLIC TO WILLING TO PAY EXTRA MONEY TA

Pay For View : పే ఫర్ వ్యూ వర్కౌట్ అయ్యేనా.. ఎక్స్‌ట్రా మనీకి ఆడియన్స్ నో..

పే ఫర్ వ్యూ పద్దతిన ఓటీటీ సంస్థలు (Twitter/Photo)

పే ఫర్ వ్యూ పద్దతిన ఓటీటీ సంస్థలు (Twitter/Photo)

Pay For View : ఇప్పటికే ప్రేక్షకులు వందలకు వందలు పెట్టి థియేటర్స్‌లో సినిమాలు చూసిన ఆడియన్స్‌కు ఆ తర్వాత ఓటీటీలో  సినిమా చూద్దామంటే.. ఇపుడు పే ఫర్ వ్యూ అంటూ అడ్డంగా దోచుకోవడం ఇపుడు సర్వత్రా చర్చనీయంశం అవుతోంది.

Pay For View : కొండ నాలుక్కి మందేస్తే.. ఉన్న నాలుక ఉడినట్టు ఉంది.. ఇపుడు ఉన్న ఓటీటీల తీరు చూస్తుంటే అది నిజమే అనిపిస్తోంది. ఇప్పటికే ప్రేక్షకులు వందలకు వందలు పెట్టి థియేటర్స్‌లో సినిమాలు చూసిన ఆడియన్స్‌కు ఆ తర్వాత ఓటీటీలో  సినిమా చూద్దామంటే.. ఇపుడు పే ఫర్ వ్యూ అంటూ అడ్డంగా దోచుకోవడం ఇపుడు సర్వత్రా చర్చనీయంశం అవుతోంది. ఏదో థియేటర్స్‌లో రిలీజ్ కానీ భారీ సినిమాను ఓటీటీలో రిలీజ్ చేస్తే ఓ వారం రోజుల పాటు ఓటీటీ సంస్థలు పే ఫర్ వ్యూ పద్దతి పెడితే ప్రేక్షకులు ఆ సినిమాను చూడాలనుకుంటే చూస్తారు.  కానీ రీసెంట్‌గా థియేటర్స్‌లో ఆడిన కేజీఎఫ్ 2 సినిమాను ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ భారీ రేటుకు కొనుగోలు చేసింది. ఇప్పటికే థియేటర్స్‌లో ఈ చిత్రాన్ని ఎక్కువ డబ్బులు పెట్టి ప్రేక్షకులు చూసారు.

ఇక ఈ సినిమాపై క్రేజ్‌ను క్యాష్ చేసుకోవాలనుకుంటోంది అమెజాన్ ప్రైమ్. ఇక ఇందులో సినిమా చూడాలంటే.. బాటా ప్రైస్ మాదిరి మరో 199 రూపాయలు అదనంగా చెల్లించాలి. అలా చెల్లించ వారికీ ఈ సినిమా చూడటానికి 48 గంటల పాటు అవకాశం ఇస్తారట. ఇప్పటికే థియేటర్స్‌లో టికెట్స్ ధరలు చూసి బెంబెలేత్తిన సినీ ప్రేక్షకులు .. పైరసీ ప్రింట్స్ చూస్తున్నారు. ఇక ఓటీటీల పుణ్యామా అని చాలా మంది ఓటీటీలో మంచి ప్రింట్‌ చూద్దామని దానికి చందాదారులు అయ్యారు.ఇపుడు చాలా మంది థియేటర్స్‌కు వెళ్లని మధ్య తరగతి వారు.. అమెజాన్, నెట్‌ఫ్లిక్స్, జీ 5, హాట్ స్టార్ వంటి వాటికి అడిక్ట్ అయ్యారు. తీరా వాటికి చందా కట్టిన తర్వాత ఆయా ఓటీటీ ఫ్లాట్‌ఫామ్స్‌లో  ఇలా వంద, రెండు వందలు అంటూ ప్రేక్షకుల నుంచి అయికాడికి దోచుకోవడమే అంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు దుమ్మెత్తిపోస్తున్నారు.

Venkatesh assets : విక్టరీ వెంకటేష్‌ ఆస్తుల విలువ.. ఎన్ని వేల కోట్లు ఉన్నాయో తెలుసా..


ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే చాలా మంది ప్రేక్షకులు మంచి ప్రింట్స్ దొరికే పైరసీ వెబ్‌సైట్స్‌ను ఆశ్రయించే అవకాశాలు లేవపోలేదు. ఇప్పటికే ఇలాంటి పైరసీ సైట్స్ ఎన్నో ఉన్నాయి.  ఒకసారి పైరసీ దాంట్లో దొరికే HD ప్రింట్స్‌కు అలవాటు పడ్డ ప్రేక్షకులు మళ్లీ ఆయా ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌ చందాదారులుగా కావడానికి ఇష్టపడరు. మొత్తంగా

కరోనా రెండో వేవ్ తర్వాత రెండు వారాల వ్యవధిలో  థియేటర్స్‌లో విడుదలైన ‘ఆర్ఆర్ఆర్’, కేజీఎఫ్ 2 వంటి సినిమాలు దాదాపు 1200 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టాయి. ఇక రాజమౌళి ఆర్ఆర్ఆర్ ఇప్పటికే 50 రోజుల థియేట్రికల్ రన్ ముగిసింది. కేజీఎఫ్ 40 రోజుల పూర్తి కావొచ్చింది. ఇప్పటికే కేజీఎఫ్ 2 సినిమాను అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ చేస్తున్నారు. అది పే ఫర్ వ్యూ పద్ధతిన. దీంతో ఇంట్లో కుటుంబ సభ్యులతో ఈ సినిమాను చూడాలనుకునే ప్రేక్షకులు ఉసురూ మంటున్నారు. మరోవైపు మే 20న జీ 5లో ఆర్ఆర్ఆర్ సినిమాను ఇదే పే ఫర్ వ్యూ అంటూ షాక్ ఇచ్చింది. ఆయా ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌కు సంబంధించిన సబ్‌స్క్రిప్షన్ ఉన్నా సరే.. వారు చెప్పిన డబ్బులు చెల్లిస్తే కానీ ఈ సినిమా చూడటం సాధ్యం కాదు. ఆల్రెడీ ఓటీటీకి సంబంధించి సంవత్సర చందా  కట్టిన తర్వాత కూడా కొత్త సినిమాలు చూడటానికి ఈ అదనపు బాదుడు ఏమిటనే ప్రశ్న ప్రేక్షకుల నుంచి ఉత్పన్నమవుతోంది. ఏది ఏమైనా పే ఫర్ వ్యూ పద్దతి అంటూ ఓటీటీ చేస్తోన్న ఈ దోపిడి ఏ మేరకు సక్సెస్ అవుతుందా.. లేకపోతే మొదటికే మోసం తెస్తుందా అనేది చూడాలి.
Published by:Kiran Kumar Thanjavur
First published:

Tags: Amazon prime, KGF Chapter 2, RRR, Tollywood

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు