Pawan Kalyan | Bheemla Nayak : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా వచ్చిన లేటెస్ట్ మూవీ ‘భీమ్లా నాయక్’ (Bheemla Nayak). ఈ చిత్రానికి సాగర్ కె చంద్ర దర్శకత్వం వహించగా.. త్రివిక్రమ్ శ్రీనివాస్ మాటలు, కథనం అందించారు. ఈ సినిమా భారీ అంచనాల నడుమ ఫిబ్రవరి 25న ప్రపంచవ్యాప్తంగా విడుదలై బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకుంది. ఈ సినిమా ఇటు రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు అటు ఓవర్సీస్‌లోను మంచి కలెక్షన్స్ దక్కించుకుంది. భీమ్లానాయక్ (Bheemla Nayak) ఓవర్సీస్లో 2 మిలియన్ డాలర్స్‌కు పైగా కలెక్షన్స్ సాధించిందని అదరగొట్టింది. ఇక ఈ సినిమా తాజాగా టీవీలో ప్రసారం అయ్యింది. ఈ చిత్రం ఫస్ట్ టైమ్ టెలివిజన్ ప్రీమియర్‌గా మాత్రం షాకింగ్ టీఆర్పీ అందుకుందని అంటున్నారు ఫ్యాన్స్. ఈ చిత్రం స్టార్ మాలో గత ఆదివారం మొదటి సారి వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్‌గా టెలికాస్ట్ అయ్యింది. కాగా ఈ సినిమా కేవలం 9.1 టీఆర్పీ రేటింగ్ మాత్రమే అందుకుని షాక్ ఇచ్చింది. ఇంత పెద్ద సినిమా, దీనికి తోడు పవన్ ఇమేజ్ కూడా ఉండి.. ఈ రేంజ్లో టీఆర్పీ రావడం చాలా తక్కువే అని అంటున్నారు.
ఇక మరోవైపు ఈ సినిమా ప్రస్తుతం డిస్నీ హాట్ స్టార్‌తో పాటు ఆహాలో గత మార్చి 24న నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సినిమా విడుదలైన సరిగ్గా 4 వారాలకు అంటే 27 రోజులకు రెండు ఓటీటీ ఫ్లాట్‌ఫ్లామ్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. సితార ఎంటర్ టైన్ మెంట్స్ సంస్థ నిర్మాణంలో దర్శకుడు సాగర్ కె చంద్ర రూపొందించిన భీమ్లా నాయక్.. మలయాళ అయ్యప్పనుమ్ కోషియమ్ సినిమాకు రీమేక్‌గా వచ్చింది. నిత్యా మీనన్, సంయుక్త మీనన్ హీరోయిన్లుగా నటించారు.
#BheemlaNayak Trp Rating pic.twitter.com/7JiU9GlHLq
— CineCorn.Com By YoungMantra (@cinecorndotcom) May 19, 2022
#BheemlaNayak Television Premiere Gets 9.06 TRP Ratings 💥💥
— TollywoodBoxoffice.IN (@TBO_Updates) May 19, 2022
ఇక పవన్ ప్రస్తుతం క్రిష్ దర్శకత్వంలో ‘హరి హర వీరమల్లు’ అనే సినిమా చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ అనేక వాయిదాల తర్వాత ఇటీవలే మొదలైంది. ఇక అది అలా ఉంటే పవన్ కళ్యాణ్ ఈ సినిమా కోసం తాజాగా కొన్ని రిహార్సల్స్ చేశారు. సినిమాలో ఓ కీలకసన్నివేశం కోసం ఆయన ఫైట్ మాస్టర్స్‌తో ప్రాక్టీస్ చేసారు. దీనికి సంబంధించి ఇటీవల కొన్ని పిక్స్ వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో నిధి అగర్వాల్ (Nidhi Aggerwal) హీరోయిన్గా నటిస్తున్నారు. భారీ బడ్జెట్‌తో వస్తున్న ఈ ప్యాన్ ఇండియా సినిమా ఇప్పటికే దాదాపు 60 శాతం మేర షూటింగ్ పూర్తి చేసుకుంది. దసరా కానుకగా హరి హర వీరమల్లు (Hari Hara Veera Mallu) చిత్రాన్ని మేకర్స్ అక్టోబర్ 5 న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారని టాక్. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ వజ్రాల దొంగగా కనిపించనున్నాడని అంటున్నారు. పవన్ కళ్యాణ్ నుంచి వస్తున్న మొదటి పాన్ ఇండియన్ సినిమా ఇది. హాట్ బ్యూటీ నిధి అగర్వాల్ (Nidhi Aggerwal) హీరోయిన్ గా నటిస్తుండగా కీరవాణి (Keeravani) సంగీతం అందిస్తున్నారు.
మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ఏ యం రత్నం (AM Ratnam) నిర్మిస్తున్నారు. ఈ సినిమా పవన్ కెరీర్ లోనే భారీ బడ్జెట్ తో తెరకెక్కుతుంది. ఈచిత్రం ఆడియో హక్కులను ప్రముఖ సంస్థ టిప్స్ సొంతం చేసుకుందని తెలుస్తోంది. టిప్స్ సంస్థ హరిహర వీరమల్లు సినిమా ఆడియో రైట్స్‌ను భారీ ధరకు దక్కించుకుందని అంటున్నారు. కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ఇక మరోవైపు పవన్ త్వరలో తమిళ రీమేక్ వినోదయ సీతమ్ రీమేక్‌లో నటించనున్నారు. ఈ సినిమా అతి త్వరలో సెట్స్‌పైకి వెళ్లనుంది. సాయి ధరమ్ తేజ్ మరో కీలకపాత్రలో నటించనున్నారు. త్రివిక్రమ్ స్క్రీన్ ప్లే, మాటలు అందించనున్నారు. సముద్రఖని దర్శకత్వం వహించనున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bheemla Nayak, Pawan kalyan