పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీ తర్వాత హీరోగా వస్తున్న ‘పింక్’ రీమేక్ రిలీజ్ ఎప్పుడో చెప్పేశాడు ఆ సినిమా నిర్మాత దిల్ రాజు. పవన్ కళ్యాణ్ సినిమాకు దిల్ రాజు కూడా ఓ నిర్మాత. జాను సినిమా రిలీజ్ కావడంతో ఆ సినిమా యూనిట్ తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామిని దర్శించుకుంది. దిల్ రాజు, శర్వానంద్, సమంత వెంకన్నను దర్శించుకున్నారు. ఉదయం నైవేద్యవిరామ దమయంలో శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం దిల్ రాజు మీడియాతో మాట్లాడారు. ‘పవన్ కళ్యాణ్ సినిమా షూటింగ్ జరుగుతోంది, మార్చ్ లో ట్రైలర్ వస్తుంది. అలాగే పవన్ కళ్యాణ్ సినిమా మేలో రిలీజ్ అవుతుంది.’ అని దిల్ రాజు చెప్పారు. మరోవైపు నాని హీరోగా చేస్తున్న "ఉగాదిరోజు" చిత్రం మార్చ్ 25 న విడుదల అవుతుందన్నారు. ఇక జాను సినిమా మంచి విజయాన్ని సాధించిందని, తమిళ సినిమాను రీమేక్ చేసినా తెలుగు ప్రజలు జాను సినిమాను అంగీకరించారన్నారు. అభిమానుల నుంచి స్పందన బాగుందని, ర్వానంద్, సమంతలు తమ నటనతో అభిమానులను ఆకట్టుకున్నారని చెప్పారు. తమిళంలో చూసిన తర్వాత కూడా ఆ ఎమోషన్స్ ను మిస్ కాకుండా చూపించగలిగామని దిల్ రాజు చెప్పారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Dil raju, Pawan kalyan, Tollywood Movie News