అమితాబ్ బచ్చన్‌కు పవన్ కళ్యాణ్ లేఖ.. మీ ఆరాధకుడు అంటూ..

Pawan Kalyan: బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్‌కు కరోనా వచ్చిందని తెలియగానే క్రికెటర్స్, సెలబ్రిటీస్ అంతా ఒక్కసారిగా ప్రేయర్స్ మొదలు పెట్టారు. బిగ్ బికి ఏం కాదని..

Praveen Kumar Vadla | news18-telugu
Updated: July 12, 2020, 4:47 PM IST
అమితాబ్ బచ్చన్‌కు పవన్ కళ్యాణ్ లేఖ.. మీ ఆరాధకుడు అంటూ..
పవన్ కళ్యాణ్ అమితాబ్ బచ్చన్ (pawan kalyan amitabh bachchan)
  • Share this:
బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్‌కు కరోనా వచ్చిందని తెలియగానే క్రికెటర్స్, సెలబ్రిటీస్ అంతా ఒక్కసారిగా ప్రేయర్స్ మొదలు పెట్టారు. బిగ్ బికి ఏం కాదని.. చాలా త్వరగా ఆయన కరోనాను జయించి వస్తారని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే తెలుగులో కూడా చాలా మంది సినిమా స్టార్స్ అమితాబ్ బచ్చన్‌కు ధైర్యం చెప్పారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా అమితాబ్‌ను ఉద్ధేశ్యించి పెద్ద లేఖ రాసాడు. ఈయన రాసిన లెటర్ ఇప్పుడు వైరల్ అవుతుంది.
పవన్ కళ్యాణ్ అమితాబ్ బచ్చన్ (pawan kalyan amitabh bachchan)
పవన్ కళ్యాణ్ అమితాబ్ బచ్చన్ (pawan kalyan amitabh bachchan)


అందులో ఇలా ఉంది.. నా ప్రియమైన, గౌరవనీయులైన శ్రీ అమితాబ్ బచ్చన్ జీ అంటూ మొదలు పెట్టాడు పవన్ కళ్యాణ్. తన చిన్నపుడు కూలీ షూటింగ్ చేస్తున్నపుడు అమితాబ్ గాయపడితే తన కుటుంబం అంతా ఆయనకు మంచి జరగాలని పూజలు చేసిన విషయం తనకు ఇంకా గుర్తుందని చెప్పాడు పవర్ స్టార్. మీ ఇమేజ్ అన్ని వయసుల వాళ్లది.. మీరెప్పుడూ అలాంటి అద్భుతమైన ప్రేమనీ, నమ్మకాన్నీ, అనురాగాన్నీ పొందుతూ వస్తున్నారని పేర్కొన్నాడు.

కేవలం మీ ప్రతిభ కారణంగానే కాకుండా మీ పోరాటతత్వం.. సింప్లిసిటీ.. వినమ్రతతో కూడా మేమంతా మీకు ఫ్యాన్స్ అయ్యాం అంటూ తెలిపాడు పవన్. మీరు, మీ కుటుంబ సభ్యులు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యారని తెలిసిన క్షణం తనలో తీవ్రమైన బాధ కలిగిందని రాసుకొచ్చాడు పవర్ స్టార్. తన స్వస్థతా శక్తులతో ఆ ధన్వంతరి దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించు గాక అంటూ లేఖను ముగించాడు పవన్. ఇట్లు మీ అభిమాని, ఆరాధకుడు అంటూ లెటర్‌లో రాసాడంటే అమితాబ్‌ను పవన్ ఎంతగా ఆరాధిస్తాడో అర్థమైపోయింది.
Published by: Praveen Kumar Vadla
First published: July 12, 2020, 4:47 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading