హోమ్ /వార్తలు /సినిమా /

SP Balu Health | SPB త్వరగా కోలుకుంటారు...పవన్ కల్యాణ్ ధీమా

SP Balu Health | SPB త్వరగా కోలుకుంటారు...పవన్ కల్యాణ్ ధీమా

ఎస్పీ బాలసుబ్రమణ్యం(File/Photo)

ఎస్పీ బాలసుబ్రమణ్యం(File/Photo)

SP Balasubramanyam Health | ఎంతో ఆత్మస్థైర్యంతో ఉన్నఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ...ప్రస్తుత అనారోగ్య స్థితి నుంచి వీలైనంత త్వరగా కోలుకొని మన ముందుకు వస్తారనే విశ్వాసం ఉందని జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.

  ప్రఖ్యాత గాయకులు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం త్వరగా కోలుకోవాలని జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ఆకాంక్షించారు.  కరోనా సోకడంతో ఎస్పీబీ  చెన్నైలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతుండటం తెలిసిందే. ఆయన ఆరోగ్య పరిస్థితి క్షిణించడంతో శుక్రవారం ఆయన్ను ఐసీయూలో ఉంచి చికిత్స కల్పిస్తున్నారు. ఆయన ఆరోగ్యం విషమంగానే ఉన్నా... నిన్నటితో పోలిస్తే ఇవాళ ఆయన ఆరోగ్య మెరుగ్గా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.  ఈ నేపథ్యంలో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం అనారోగ్యం నుంచి కోలుకోవాలని కోరుకుంటున్నట్లు శనివారం సాయంత్రం పవన్ ఓ ప్రకటన విడుదల చేశారు.

  ఎంతో ఆత్మస్థైర్యంతో ఉన్నఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ...ప్రస్తుత అనారోగ్య స్థితి నుంచి వీలైనంత త్వరగా కోలుకొని మన ముందుకు వస్తారనే విశ్వాసం ఉందన్నారు. ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని కుటుంబ సభ్యులు చెబుతున్నారని..ఇది ఊరటనిచ్చే వార్త గా పేర్కొన్నారు. తమ కుటుంబానికి ఎస్పీబీ ఎంతో సన్నిహితులని.. వారు ఈ పరిస్థితి నుంచి బయటకు రావాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నట్లు పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.

  Published by:Janardhan V
  First published:

  Tags: Pawan kalyan, SP Balasubrahmanyam

  ఉత్తమ కథలు