Home /News /movies /

PAWAN KALYAN WILL SING A SONG FOR THAMAN IN AYYPPANUM KOSIYUM REMAKE MHN

Pwan Kalyan Song In Ak: ప‌వ‌న్.. అప్పుడు దేవిశ్రీ కోసం చేశాడుమ‌రి ఈసారి త‌మ‌న్ కోసం చేస్తాడా?

pawan kalyan and rana daggubati

pawan kalyan and rana daggubati

Pawan Kayan - Ayyappanum Kosiyum Remake: పవన్‌ కల్యాణ్‌ హీరోగా, రానా ప్రధాన పాత్రలో రూపొందనున్న అయ్యప్పనుమ్‌ కోశియుమ్‌ రీమేక్‌లో పవన్‌, రానాలు పాట పాడతారని అంటున్నారు.

    పవర్‌స్టార్‌ పవన్‌కల్యాణ్‌ పాట బోడుతున్నారా? అంటే అవునని ఇండస్ట్రీ వర్గాల నుండి సమాధానం వస్తుంది. అసలు మళ్లీ పవన్‌ ఎందుకు పాట పాడుతారు? ఏ సినిమాలో? అనే వివరాల్లోకెళ్తే.. సినిమాల్లోకి పవన్‌కల్యాణ్‌ రీ ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఐదు సినిమాలకు ఓకే చెప్పారు. మరో రెండు, మూడింటికో ఆయన ఒకే చెబుతారనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. అయితే ఇందులో ముందుగా 'వకీల్‌సాబ్‌' సినిమా రావడం పక్కా. దీని తర్వాత పవన్‌ క్రిష్‌ దర్శకత్వంలో సినిమాను స్టార్ట్‌ చేసినప్పటికీ ఇప్పుడున్న పరిస్థితులు దృష్ట్యా ఆ సినిమాలో ఇప్పుడప్పుడే పాల్గొనేలా లేడు. అయితే అంత కంటే ముందుగానే మలయాళ చిత్రం 'అయ్యప్పనుమ్‌ కోశియుమ్‌' రీమేక్‌లో పాల్గొంటాడని సినీ వర్గాల సమాచారం. ఇందులో రానా మరో హీరోగా నటించనున్నాడట. సాగర్‌ చంద్ర దర్శకత్వంలో తెరకెక్కబోతున్న ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్‌ పనులు శరవేగంగా జరుగుతున్నాయని టాక్‌ వినిపిస్తోంది. ఇప్పటికే తమన్‌ ఈ సినిమా కోసం రెండు, మూడు అదిరిపోయే ట్యూన్స్‌ను రెడీ చేశాడని కూడా అంటున్నారు.

    ఈ సినిమా మాతృక 'అయ్యప్పనుమ్‌ కోశియుమ్‌' సినిమా ప్రోమోసాంగ్‌ను జిజూమీనన్‌, పృథ్వీరాజ్‌ కలిసి పాడారు. ఇప్పుడు అలాగే తెలుగు రీమేక్ కోసం కూడా పవన్‌కల్యాణ్, రానా కలిసి పాడాతారని వార్తలు వినిపిస్తున్నాయి. పవన్‌కల్యాణ్‌కు పాటలు పాడటం కొత్తేమీ కాదు. రానాకు ప్రయోగాలు చేయడం కొత్తేమీ కాదు. ఇప్పటి వరకు లుక్‌ పరంగా ఎక్స్‌పెరిమెంట్స్‌ చేసిన రానా ఈసారి గొంతుతో ఎక్స్‌పెరిమెంట్‌ చేస్తాడా? అనేది చూడాలి. అయితే సాధారణంగా మ్యూజిక్‌ డైరెక్టర్‌ తమన్‌ తన సినిమాల్లో హీరోలతో పాటలు పాడించడం చేస్తుంటాడు. మరి ఈ సినిమాలో పవన్‌, రానాలకు కూడా అలాగే పాడిస్తాడా? అనేది ఆసక్తికరంగా మారింది. ఈ సినిమాలో హీరోయిన్‌గా సాయిపల్లవి నటింనుందని కూడా వార్తలు వినిపిస్తున్నాయి. సినిమా వ్యవహారాలను త్రివిక్రమ్‌ దగ్గరుండి పర్యవేక్షిస్తున్నాడట.

    పవన్‌ కల్యాణ్‌ టైటిల్‌ పాత్రలో నటిస్తోన్న 'వకీల్‌సాబ్‌' సినిమా చిత్రీకరణ తుది దశకు చేరుకుంది. వచ్చే ఏడాది సమ్మర్‌లో సినిమాను విడుదల చేసే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. బాలీవుడ్‌ చిత్రం 'పింక్‌'కి ఇది రీమేక్‌. ఇందులో నివేదా థామస్‌, అంజలి కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాకు కూడా తమనే సంగీతం అందించడం విశేషం. ఇంకా పవన్‌ ఓకే చెప్పిన సినిమాల్లో హరీశ్‌ శంకర్‌, సురేందర్ రెడ్డి, డైరెక్టర్‌ క్రిష్‌ సినిమాలు లైన్‌లో ఉన్నాయి. ఇది కాకుండా బండ్లగణేశ్‌తో ఓ సినిమా పవన్‌ చేస్తాడని కూడా వార్తలు వినిపిస్తున్నాయి.
    Published by:Anil
    First published:

    Tags: Malayala Cinema, Pawan kalyan, Rana daggubati, Thaman

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు