పవన్‌తో పూరీ సినిమాపై క్లారిటీ.. అదే కథను కొత్తగా..

Pawan Kalyan : జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఏపీలో రాజకీయాలతో బిజీగా ఉంటూనే.. ఎన్నికలకు సమయం ఉండటంతో ఈ గ్యాప్‌లో వరుసగా సినిమాలు చేస్తున్నాడు.

news18-telugu
Updated: March 15, 2020, 11:21 AM IST
పవన్‌తో పూరీ సినిమాపై క్లారిటీ.. అదే కథను కొత్తగా..
పవన్ కళ్యాణ్, పూరి జగన్నాధ్ Photo : Twitter
  • Share this:
Pawan Kalyan : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రాజకీయాలతో బిజీగా ఉంటూనే.. ఏపీలో ఎన్నికలకు సమయం ఉండటంతో ఈ గ్యాప్‌లో వరుసగా సినిమాలు చేస్తున్నాడు. అందులో భాగంగా ఆయన MCA ఫేమ్ వేణు శ్రీరామ్ దర్శకత్వంలో 'వకీల్ సాబ్' అనే సినిమాను చేస్తోన్న సంగతి తెలిసిందే. హిందీలో అమితాబ్ బచ్చన్ ప్రధాన పాత్రలో నటించిన ‘పింక్’ సినిమాకు రీమేక్‌‌గా వస్తోంది. అంతేకాదు ఇటీవల ఈ చిత్రానికి సంబందించి ఫస్ట్ లుక్‌ను విడుదల చేసింది చిత్రబృందం. VakeelSaabఅంటూ విడుదలైన ఈ సినిమా ఫస్ట్ లుక్‌లో ట్విట్టర్‌లో దేశ వ్యాప్తంగా తెగ ట్రెండ్ అవుతూ అదరగొట్టింది. ఇక ఈ సినిమాతో పాటు పవన్ మరో రెండు సినిమాలకు ఓకే చెప్పిన సంగతి తెలిసిందే. వకీల్ సాబ్ చిత్రం చిత్రీకరణ చివరి దశకు చేరుకోగా, క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మూవీ షూటింగ్ కూడా ప్రోగ్రెస్‌లో ఉంది. ఇక ఆయన హరీష్ శంకర్‌తో మరో సినిమాకి సై అనడంతో ఆ మూవీ ప్రీ ప్రొడక్షన్ దశలో ఉంది. ఇలా ఒకదాని తర్వాత ఒకటిగా ఉండగా.. పవన్ మరో చిత్రం కూడా ఒప్పుకోనున్నారని ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే.

అందులో భాగంగా పవన్ కళ్యాణ్ తన 29వ చిత్రాన్ని దర్శకుడు పూరి జగన్నాధ్ డైరెక్షన్ లో చేయనున్నారు. మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఈ మూవీలో పవన్ పాత్ర సీఎం పాత్రలో అదరగొట్టనున్నాడని సమాచారం. పూరీ గతంలో మహేష్ బాబుతో చేయాలనుకున్న ఈ సినిమాను పవన్‌తో చేయనున్నాడట. అంతేకాదు ప్రస్తుత రాజకీయాలను దృష్టిలో పెట్టుకుని పూరీ తన మార్క్ స్టైల్ లో ఈ కథను అల్లుకుని పవన్ కు నచ్చే విధంగా అనేక మార్పులు చేసాడట. అయితే ప్రస్తుతం పవన్ ఇతర సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఇటూ పూరీ కూడా విజయ్ దేవరకొండతో ఓ సినిమా చేస్తున్నాడు. ఆ సినిమాలు పూర్తి కాగానే ఈ సినిమా పట్టాలెక్కనుంది. కాగా గతంలో ఈ ఇద్దరి కాంబినేషన్‌లో 'కెమెరా మెన్ గంగతో రాంబాబు' వచ్చిన సంగతి తెలిసిందే.
Published by: Suresh Rachamalla
First published: March 15, 2020, 10:28 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading