Pawan Kalyan : అరువు కథలు ఎక్కడున్న వెతికి పట్టుకోవడంలో ఈ జనరేషన్లో పవన్ కళ్యాణ్ తర్వాతే ఎవరైనా.. ఈ యేడాది పవన్ కళ్యాణ్ చేసిన ‘వకీల్‌సాబ్’ మూవీ కూడా హిందీలో హిట్టైన ‘పింక్’ మూవీకి రీమేక్. బాలీవుడ్లో అమితాబ్ బచ్చన్ చేసిన పాత్రను తెలుగులో పవన్ కళ్యాణ్ కొన్ని కమర్షియల్ అంశాలు జోడించి చేశారు.ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర మంచి విజయాన్ని నమోదు చేసింది. ఇపుడు త్రివిక్రమ్ దర్శకత్వ పర్యవేక్షణలో సాగర్ చంద్ర దర్శకత్వంలో చేస్తోన్న ‘భీమ్లా నాయక్’ సినిమా కూడా మలయాళంలో సూపర్ హిట్టైన ‘అయ్యప్పనుమ్ కోషియమ్’ సినిమాకు రీమేక్. ఒరిజినల్ వెర్షన్లో ఇద్దరు హీరోలకు సమాన ప్రాధాన్యతతో తెరకెక్కించారు. కానీ తెలుగులో పనవ్ కళ్యాణ్.. తన ఇమేజ్‌తో రానాను తొక్కేసాడని నెటిజన్స్‌తో పాటు సామాన్య ప్రేక్షకులు సోషల్ మీడియా వేదికగా ప్రశ్నిస్తున్నారు.
ఆ సంగతి పక్కన పెడితే.. తాజాగా పవన్ కళ్యాణ్ మరో రీమేక్‌కు ఓకే చెప్పినట్టు సమాచారం.ఒక భాషలో హిట్టైన సినిమాను వేరే భాషలో రీమేక్ చేయడమనేది ఎప్పటి నుంచో ఉంది. గత కొన్నేళ్లుగా అన్ని ఇండస్ట్రీస్‌లో కథల కొరత చాలా ఉంది. అందుకే ఏదైనా ఒక భాషలో సినిమా హిట్టైయితే వెంటనే వేరే భాషల వాళ్లు ఆయా సినిమాలను రీమేక్ చేస్తున్నారు. ఆల్రెడీ ఒక భాషలో ప్రూవ్ అయిన కథ కాబట్టి రిస్క్ తక్కువ. అందుకే ఇండస్ట్రీలో చాలా మంది వేరే భాషలో ఏదైనా సినిమా హిట్టైయితే వెంటనే తమ భాషలో రీమేక్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపెడుతారు.
ఈ రీమేక్‌లు ఎక్కువ మటుకు సూపర్ హిట్ అవ్వడమే కాదు..నిర్మాతలకు కాసుల వర్షం కురిపిస్తున్నాయి. తాజాగా పవన్ కళ్యాణ్ తమిళంలో హిట్టైన ఓ సినిమాను తెలుగులో రీమేక్ చేయాలనే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం. తమిళంలో సముద్రఖని ప్రధాన పాత్రలో నటించిన ‘వినోధాయ సిత్తం’ అనే సినిమాను తెలుగులో రీమేక్ చేయాలనే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం. ఇప్పటికే త్రివిక్రమ్ ఈ రీమేక్ రైట్స్‌ను కొనుగోలు చేసినట్టు సమాచారం. ఇందులో సముద్రఖనితో పాటు తంబి రామయ్య, సంచిత శెట్టి ప్రధాన పాత్రలో నటించారు.
ఈ చిత్రంలో తంబి రామయ్య హఠాత్తుగా కనుమూస్తాడు. ఆ తర్వాత పరలోకంలో అడుగుపెడతాడు. అక్కడ తంబి రామయ్య మరణించిన తర్వాత ఇహ లోక బంధాలను తెంచుకోలేక సతమతమవుతూ ఉంటాడు. దేవుడు అతని కోరికను తెలుసుకుంటాడు. మూడు నెలల బ్రతికిస్తే తన బాధ్యతలు పూర్తి చేసుకొని వస్తానని చెబుతారు. ఈ క్రమంలో చనిపోయన వ్యక్తి తిరిగి భూమిపైకి వస్తాడు. ఈ నేపథ్యంలో చోటు చేసుకునే సంఘటనల నేపథ్యమే ఈ మూవీ. ఈ సినిమా చూసి పవన్ కళ్యాణ్ ఇంప్రెస్ అయినట్టు సమాచారం. త్వరలో ఈ సినిమాలో నటించే విషయమై అఫీషియల్ ప్రకటన వెలుబడాల్సి ఉంది.
మరోవైపు పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ తర్వాత క్రిష్ దర్శకత్వంలో ‘హరి హర వీరమల్లు’ తో పాటు హరీష్ శంకర్ దర్శకత్వంలో ‘భవధీయుడు భగత్ సింగ్’ సినిమాకు ఓకే చెప్పారు. అటు సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ‘యథా కాలమ్ తథా వ్యవహారమ్’ సినిమాకు ఓకే చెప్పిన సంగతి తెలిసిందే కదా. (Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News)
Published by:Kiran Kumar Thanjavur
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.