PAWAN KALYAN WIFE ANNA LEZHNEVA NOT CAME FOR NIHARIKA MARRIAGE HERE THE REASON PK
Niharika Marriage: నిహారిక పెళ్లికి పవన్ భార్య అన్నా లెజినోవా ఎందుకు రాలేదు.. కారణమేంటి..?
పవన్ కళ్యాణ్ అన్నా లెజినోవా (pawan kalyan anna lezhneva)
Niharika Marriage: ఇంట్లో పెళ్లి జరుగుతున్నపుడు పెద్దమ్మలు, పిన్నమ్మలు అంతా కలిసి వస్తారు. కచ్చితంగా అందరూ అమ్మాయి పెళ్లిని ఘనంగా చేస్తుంటారు. ఇప్పుడు మెగా కుటుంబంలో కూడా ఇదే జరిగింది. నిహారిక కొణిదెల పెళ్లికి మెగా ఫ్యామిలీ..
ఇంట్లో పెళ్లి జరుగుతున్నపుడు పెద్దమ్మలు, పిన్నమ్మలు అంతా కలిసి వస్తారు. కచ్చితంగా అందరూ అమ్మాయి పెళ్లిని ఘనంగా చేస్తుంటారు. ఇప్పుడు మెగా కుటుంబంలో కూడా ఇదే జరిగింది. నిహారిక కొణిదెల పెళ్లికి మెగా ఫ్యామిలీ అంతా కలిసి వచ్చింది. అన్నా చెల్లి అక్కా తమ్ముడు ఇలా ప్రతీ ఒక్కరు ఆమె పెళ్లిలో కనిపించారు. మూడు రోజుల పాటు అన్ని పనులు పక్కనబెట్టి పూర్తిగా నిహారిక పెళ్లిలోనే గడిపేసారు. ఇదిలా ఉంటే ఈ పెళ్లిలో ఎంత మంది కనిపించినా ఒక్కరు మాత్రం మిస్ అయ్యారు. ఆమె ఎవరో కాదు.. పవన్ భార్య అన్నా లెజినోవా. పెళ్లికి మెగా కుటుంబం అంతా వచ్చినా పవన్ భార్య మాత్రం అక్కడ కనిపించలేదు. ఆయన పిల్లలు కూడా లేరు. కాకపోతే రేణు దేశాయ్ పిల్లలు అకీరా నందన్, ఆద్య మాత్రం తండ్రితో కలిసి వచ్చారు. పెళ్లిలో వాళ్లపైనే కెమెరాలన్నీ ఫోకస్ అయ్యాయి కూడా. ఎక్కువగా బయట కనిపించని అకీరా అక్కడ ఒకేసారి ఆజానుబాహుడిగా కనిపించే సరికి హైలైట్ అయిపోయాడు. అయితే పవన్ మూడో భార్య అన్నా లెజినోవా మాత్రం అక్కడ కనిపించకపోయేసరికి లేనిపోని అనుమానాలు వస్తున్నాయి.
పవన్ కళ్యాణ్ అన్నా లెజినోవా (pawan kalyan anna lezhneva)
మెగా కుటుంబంలో జరిగే అన్ని కార్యక్రమాలకు అన్నా హాజరవుతూనే ఉంటుంది. శ్రీజ పెళ్లితో పాటు ఆమె కూతురు అన్న ప్రాసన వేడుకలో కూడా కనిపించి అన్నా లెజినోవా. అలాంటిది నాగబాబు కూతురు పెళ్లిలో మాత్రం పవన్ ఒక్కడే వచ్చాడు. దాంతో ఈయన సతి ఏమైందబ్బా అనే ఆసక్తి మొదలైంది అందరిలోనూ. అయితే అన్నా లెజినోవా రాకపోవడానికి కొన్ని కారణాలున్నాయి. ఈమె ప్రస్తుతం ఇండియాలో లేదని తెలుస్తుంది. ప్రతీ డిసెంబర్లోనూ ఈమె తమ పుట్టింటికి వెళ్తుంది. అంటే రష్యా అన్నమాట.
పవన్ కళ్యాణ్ అన్నా లెజినోవా (pawan kalyan anna lezhneva)
అక్కడే నెల రోజులకు పైగా ఉండి క్రిస్మస్ వేడుకలను జరిపి ఇండియాకు వస్తుంది. ఈ సారి కూడా ఇదే చేసింది అన్నా. డిసెంబర్ అంతా ఆమె రష్యాలోనే ఉండి.. క్రిస్మస్ వేడుకలు పూర్తి చేసి న్యూ ఇయర్ అయ్యాక ఇండియాకు వస్తుంది. అందుకే నిహారిక పెళ్లిలో అన్నా లెజినోవా కనిపించలేదు.