పవన్ కళ్యాణ్‌ కోసం రాసిన కథను విజయ్ చేశాడు...

పవర్‌ స్టార్‌ పవన్ కళ్యాణ్ కోసం కథ రాస్తే ఆ సినిమాను విజయ్ సేతుపతి చేశాడన్నారు దర్శకుడు విజయ్ చందర్. 

news18-telugu
Updated: November 12, 2019, 11:50 AM IST
పవన్ కళ్యాణ్‌ కోసం రాసిన కథను విజయ్ చేశాడు...
పవన్ కల్యాణ్ (ఫైల్ ఫోటో)
  • Share this:
పవర్‌ స్టార్‌ పవన్ కళ్యాణ్ కోసం కథ రాస్తే ఆ సినిమాను విజయ్ సేతుపతి చేశాడన్నారు దర్శకుడు విజయ్ చందర్.  విజయ్ సేతుపతి హీరోగా తమిళంలో వస్తోన్న  ‘సంగ తమిళన్’ సినిమాను తెలుగులో విజయ్ సేతుపతి పేరుతో విడుదల చేస్తూన్నారు. ఈ సినిమాలో విజయ్ సేతుపతి సరసన రాశీ ఖన్నా, నివేదా పేతురాజ్‌ హీరోయిన్స్‌గా చేస్తున్నారు. ఈ సినిమా నవంబరు 15న విడుదల కానుంది. హర్షితా మూవీస్ పతాకంపై రావూరి శ్రీనివాస్ ఈ చిత్రాన్ని తెలుగులో విడుదల చేస్తున్నారు. అందులో భాగంగా ప్రచార కార్యక్రమాలు జోరందుకున్నాయి. ఈ సందర్బంగా దర్శకుడు విజయ్‌ చందర్‌ మాట్లాడుతూ... ‘ఈ కథను పవన్‌ కోసం రాసుకున్నా. అయితే ఆయన రాజకీయాల్లో బిజీగా ఉండటంలో సినిమా చేయడం కుదరలేదు. దీంతో తెలుగులో ఎలాగైతే పవన్ కళ్యాన్‌కు మాస్ ఫాలోయింగ్‌ ఉందో అదే మాదిరిగా తమిళంలో విజయ్ సేతుపతికి మంచి ఫాలోయింగ్ ఉంది. దీంతో ఈ కథ ఆయనకు వినిపించడం... కథ నచ్చడంతో విజయ్ సేతుపతితో రూపోందించడం జరిగిందన్నారు.
 View this post on Instagram
 

‪Second look Poster #SangaThamizhan teaser from today morning 10:30 AM.‬ @raashikhannaoffl @vijayfilmaker


A post shared by Vijay Sethupathi (@actorvijaysethupathi) on
బ్లాక్ అండ్ బ్లాక్‌లో అదిరిన సమంత..
First published: November 12, 2019, 11:41 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading