Pawan Kalyan Vs Posani : ప్రముఖ రచయత, దర్శకుడు, నిర్మాత, నటుడు పోసాని కృష్ణ మురళి సినిమాల్లోనే కాదు.. రియల్ లైఫ్‌లోను మెంటల్ కృష్ణ అంటూ జనసేన మహిళ నేత నిహారిక చేసిన కామెంట్స్ ఇపుడు హాట్ టాపిక్‌గా మారాయి. పోసానిని పిచ్చాసుపత్రిలో చేర్పిస్తే బాగుంటుందన్నారు. పవన్ కళ్యాణ్ తెలుగు చిత్ర పరిశ్రమను దృష్టిలో పెట్టుకొని ఏపీ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ కొన్నిమాటలు మాట్లాడితే.. పోసాని కృష్ణ మురళి అచ్చొసిన ఆంబోతులా మెంటల్ కృష్ణలా మాట్లాడుతున్నారన్నారని విరుచు పడింది. పవన్ కళ్యాణ్ ఏపీ ప్రభుత్వం పై చేసిన వ్యాఖ్యలపై పోసాని అదే రీతిలో విరుచుకుపడిన సంగతి తెలిసిందే కదా.
ఈ సందర్భంగా పోసాని పవన్ కళ్యాణ్ మూడు పెళ్లిళ్లపై కామెంట్స్ చేస్తూ పర్సనల్‌గా టార్గెట్ చేసారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్‌కు ఎక్కడ ఎలా మాట్లాడాలో తెలియదన్నారు. ఏపీ సీఎం జగన్‌కు పవన్ కళ్యాణ్‌కు పోలికే లేదన్నారు. ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డికి కుల పిచ్చి ఎక్కువని పవన్ కళ్యాణ్ ఆధారాలు చూపించాలని డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే కదా. పవన్ పై పోసాని కామెంట్స్ చేసిన సందర్భంగా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కొంత మంది పోసానిపై హైదరాబాద్‌లో ప్రెస్‌క్లబ్‌లో దాడికి పాల్పడిన సంగతి తెలిసిందే కదా.
Ranbir Kapoor - Alia Bhatt : రణ్‌బీర్ కపూర్, ఆలియా భట్ త్వరలో పెళ్లి పీఠలు ఎక్కబోతున్నారా.. ?
ఈ సందర్భంగా పోసాని .. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్‌ను సైకోగా అభివర్ణించారు. చిరంజీవికి, పవన్ కళ్యాణ్‌కు అసలు పోలికే లేదన్నారు. అంతేకాదు పవన్ కళ్యాణ్‌ను అదుపులోకి పెట్టుకోవాలంటూ చిరంజీవిని హెచ్చరించిన సంగతి తెలిసిందే కదా. పోసాని వ్యాఖ్యలపై జనసేన తెలంగాణ ఇంఛార్జ్ శంకర్ గౌడ్ పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అంతేకాదు మెగాభిమానులు పోసానిపై కారాలు మిరియాలు నూరుతున్నారు. ఈ సందర్భంగా జనసేన పార్టీ నాయకురాలు నిహారిక మాట్లాడుతూ.. పవన్ కళ్యాణ్.. ఆడవాళ్లపై ఒక్క కామెంట్స్ చేయలేదు. కేవలం ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ తీరు పై కామెంట్స్ చేసారు.
ఈ సందర్భంగా పోసాని పవన్ కళ్యాణ్‌ను సినిమాల పరంగా ఎటాక్ చేయకుండా.. ఆయన పర్సనల్ విషయాలను ప్రస్తావించడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా ఏపీ ప్రభుత్వం పవన్ కళ్యాణ్ పై చర్యలు తీసుకోవాలన్నారు. అంతేకాదు ఆయన్ని ఏదైనా మంచి హాస్పిటల్‌లో చేర్పించాలని సలహా ఇచ్చారు. ఏమైనా .. ఏపీ ప్రభుత్వం పై పవన్ కళ్యాణ్ చేసిన కామెంట్స్ పై పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఒకలా స్పందిస్తే.. వైసీపీ ప్రభుత్వ అభిమానులు మరోలా.. చిత్ర పరిశ్రమల ఇంకోలా స్పందిస్తున్నారు. మొత్తంగా ఈ మ్యాటర్ ఇప్పట్లో చల్లారేలా కనపడటం లేదు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.