‘సైరా నరసింహా రెడ్డి’ కోసం పవన్ కళ్యాణ్ వాయిస్ ఓవర్..

Sye raa | చిరంజీవి హీరోగా నటిస్తోన్న లేటెస్ట్ మూవీ ‘సైరా నరసింహారెడ్డి’. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను అక్టోబర్ 2న విడుదల చేయాలనే ప్లాన్‌లో ఉన్నారు. తాజాగా ఈ సినిమా టీజర్‌కు పవన్ కళ్యాణ్ వాయిస్ ఓవర్ చెప్పారు.

news18-telugu
Updated: August 16, 2019, 10:33 AM IST
‘సైరా నరసింహా రెడ్డి’ కోసం పవన్ కళ్యాణ్ వాయిస్ ఓవర్..
‘సైరా నరసింహారెడ్డి’ మూవీకి పవన్ కల్యాణ్ వాయిస్ ఓవర్ (Twitter/Photos)
  • Share this:
చిరంజీవి హీరోగా నటిస్తోన్న లేటెస్ట్ మూవీ ‘సైరా నరసింహారెడ్డి’. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను అక్టోబర్ 2న విడుదల చేయాలనే ప్లాన్‌లో ఉన్నారు. ఈ సినిమాను కొణిదెల ప్రొడక్షన్ బ్యానర్‌లో రామ్ చరణ్ ఈ సినిమాను భారీ ఎత్తున తెరకెక్కిస్తున్నాడు. రూ.  200 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ‘సైరా నరసింహారెడ్డి’లో బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్..ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గురువు గోసాయి వెంకన్న పాత్రలో ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసారు. దీంతో ఈ సినిమాకు హిందీలో మంచి మార్కెట్ ఏర్పడింది. మరోవైపు సౌతిండియా లేడీ సూపర్ స్టార్ నయనతార ఈ సినిమాలో చిరంజీవికి జోడిగా నటించింది. మరోవైపు తమన్నా కూడా ఈ సినిమాలో నర్తకి పాత్రలో నటిస్తోంది. ఇంకోవైపు కన్నడ స్టార్ హీరో సుదీప్, తమిళ హీరో విజయ్ సేతుపతి ముఖ్యపాత్రల్లో నటించారు. తాజాగా ఈ సినిమా కోసం పవన్ కళ్యాణ్ వాయిస్ ఓవర్ అందిస్తున్నాడు. పవన్ కళ్యాణ్ ఈ సినిమా మొత్తానికి కాకుండా.. కేవలం టీజర్ కోసమే తన వాయిస్ ఓవర్ అందించారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాన్ అన్నయ్య చిరంజీవి, సురేందర్ రెడ్డితో వాయిస్ ఓవర్ చెబుతున్న ఫోటోను చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఈ సినిమా టీజర్‌ను ఆగష్టు 20న విడుదల చేయనున్నారు.
Published by: Kiran Kumar Thanjavur
First published: August 16, 2019, 10:33 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading