హోమ్ /వార్తలు /సినిమా /

Pawan Kalyan : పవన్ కళ్యాణ్ అక్కడ కూడా తన ప్రతాపాన్ని చూపిస్తారా... మరో పరీక్ష..

Pawan Kalyan : పవన్ కళ్యాణ్ అక్కడ కూడా తన ప్రతాపాన్ని చూపిస్తారా... మరో పరీక్ష..

Pawan Kalyan Photo : Twitter

Pawan Kalyan Photo : Twitter

Vakeel Saab : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లాయర్ పాత్రలో నటించిన ‘వకీల్ సాబ్’. ఈ సినిమా ఈరోజు టీవీలో ప్రసారం కానుంది.

  Vakeel Saab : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లాయర్ పాత్రలో నటించిన ‘వకీల్ సాబ్’. ఈ సినిమా ఈరోజు టీవీలో ప్రసారం కానుంది. హిందీ సినిమా పింక్‌కు తెలుగు రీమేక్‌గా వచ్చిన ఈ సినిమాకు వేణు శ్రీరామ్ దర్శకుడు. మంచి అంచనాల నడుమ ఏప్రిల్ 9న ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన అదరగొట్టిన సంగతి తెలిసిందే. దాదాపు మూడు సంవత్సరాల తర్వాత పవన్ కళ్యాణ్ సినిమా రావడంతో ఈ సినిమాకు ఓపెనింగ్స్ అదిరిపోయే రేంజ్‌లో వచ్చాయి. అయితే కరోనా వలన ఈ చిత్రాన్ని ఎక్కువ రోజులు థియేటర్ లో ప్రదర్శించలేకపోయారు దర్శకనిర్మాతలు. కాగా ఈ మూవీ ఈరోజు ‘జీ తెలుగు’లో టెలికాస్ట్‌ కాబోతోంది. ఈరోజు జీ తెలుగులో సాయత్రం 6 గంటలకు ప్రసారం కానుంది. థియేటర్‌లో దుమ్ములేపిన ఈ వకీల్ సాబ్ మరి చిన్నతెరపై ఎలాంటీ రికార్డ్స్ క్రియేట్ చేస్తారో చూడాలి. టాలీవుడ్‌లో ఉన్న రికార్డ్స్‌ను బద్దలు కొడుతుందా.. రేటింగ్స్ ఏ రేంజ్‌లో వస్తాయి.. అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు ఆయన అభిమానులు.. చూడాలి మరి వకీల్ సాబ్ ఏ మేరకు టీవీ ప్రేక్షకులను అలరిస్తారో... ఎన్ని రేటింగ్స్‌ను తీసుకోస్తారో... ఇక ఈ సినిమా విషయానికి వస్తే.. పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్ సరసన శృతిహాసన్ కథానాయికగా నటించింది. ఇక ఇతర ముఖ్య పాత్రల్లో అనన్య,అంజలి, నివేదా థామస్, ప్రకాష్ రాజ్‌లు కనిపించారు. దిల్‌ రాజు నిర్మించారు.

  పవన్ కళ్యాణ్ నటిస్తున్న ఇతర సినిమాల విషయానికి వస్తే.. క్రిష్ జాగర్లమూడి సినిమాలో నటిస్తున్నారు. చారిత్రక నేపథ్యంలో వస్తున్న ఈ సినిమాకు హరిహర వీరమల్లు టైటిల్‌ను ఖరారు చేశారు. ఈ సినిమాలో పవన్ కళ్యాన్ వ‌జ్రాల దొంగగా క‌నిపించ‌నున్నారని అంటున్నారు. ఎం రత్నం నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. ఈ మూవీకి కీరవాణి సంగీతం అందిస్తున్నారు. 2022 సంక్రాంతికి విడుదల కానుందని టాక్.


  ఈ సినిమాతో పాటు పవన్.. ఓ మలయాళ సినిమాను తెలుగులో రీమేక్ చేస్తున్నారు. మలయాళంలో సూపర్ హిట్ అయిన అయ్యప్పనుమ్ కోషియమ్.. అనే సినిమాను తెలుగులో రీమేక్ చేస్తున్నారు. మరో కీలక పాత్రలో రానా దగ్గుబాటి నటిస్తున్నారు. థమన్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాకు పరుశురామ కృష్ణమూర్తి అనే టైటిల్‌ పరిశీలినలో ఉంది.

  Published by:Suresh Rachamalla
  First published:

  Tags: Pawan kalyan, Vakeel Saab