Vakeel Saab : 100 కోట్ల డీల్ కాదన్న దిల్ రాజు.. రిస్క్ చేశాడా..

Pawan Kalyan : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దిల్ రాజు నిర్మాణంలో వకీల్ సాబ్ అనే సినిమాను చేస్తోన్న సంగతి తెలిసిందే.

news18-telugu
Updated: September 27, 2020, 7:08 AM IST
Vakeel Saab : 100 కోట్ల డీల్ కాదన్న దిల్ రాజు.. రిస్క్ చేశాడా..
వకీల్ సాబ్‌గా పవన్ కళ్యాణ్ (Twitter/Photo)
  • Share this:
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వరుసగా సినిమాలు చేస్తున్నాడు. ఏపీలో ఎన్నికలకు కాస్తా సమయం ఉండటంతో ఆయన ఓ నాలుగు సినిమాలకు ఓకే అన్నాడు. అందులో ఒకటి వకీల్ సాబ్. దిల్ రాజు నిర్మాణంలో వస్తోన్న ఈ సినిమాకు వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్‌, మోషన్ పోస్టర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ మూవీ హిందీలో అమితాబ్ బచ్చన్ హీరోగా నటించిన ‘పింక్’ మూవీకి రీమేక్‌గా తెరకెక్కుతోంది. ఈచిత్రంలో పవన్ కళ్యాణ్ తన కెరీర్‌లోనే ఫస్ట్ టైమ్ లాయర్ పాత్రలో నటిస్తున్నాడు. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్..సరసన తమన్నా నటించనున్నదని సమాచారం. గతంలో పవన్ కళ్యాణ్ సరసన 'కెమేరామెన్ గంగతో రాంబాబు' చిత్రంలో కథానాయికగా నటించిన తమన్నా ఇప్పుడు మళ్లీ ఆయనతో మరో సినిమా చేసే ఛాన్స్ కొట్టేసిందట. ఈ సినిమాలో నివేదా థామస్, అంజలి, అనన్యలు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. వకీల్ సాబ్‌ను దిల్ రాజు, బోనీ కపూర్‌లో సంయుక్తంగా నిర్మిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తున్నాడు. ఇక ఈ సినిమాకు సంబందించి ఓ వార్త ఇండస్ట్రీలో తెగ హల్ చల్ చేస్తోంది. ఈ సినిమాకు 100 కోట్ల డిజిటల్ ఆఫర్ వచ్చిందట. అయినా కూడా నిర్మాత దిల్ రాజు పక్కన పెట్టారనే వార్త వినిపిస్తోంది.

ఒకవేళా అది నిజమైతే.. ఈ విషయంలో దిల్ రాజు రిస్క్ చేశాడని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. అసలే కరోనా కారణంగా ప్రజలు ఇంటి నుండి అంతంత మాత్రంగా బయటకు వస్తున్నారు. అయితే ఒకవేళా సంక్రాంతి వరకు కొంత భయం తగ్గినా ఓ సినిమా చూడానికి జనాలు తమ ప్రాణాలను పణంగా పెడతారా అని సందేహా పడుతున్నారు. కాబట్టి ఈ విషయంలో దిల్ రాజు రిస్క్ చేశాడని అంటున్నారు. ఇక్కడ ఇంకో విషయం ఏమంటే.. పవన్ సినిమా థియేటర్‌లో విడుదలైన సినిమా బాగుంటేనే 100 కోట్లు కలెక్ట్ చేస్తుందని.. లేక పోతే కష్టమేనని అంటున్నారు. ఈ సందర్భంగా ఎటువంటీ పబ్లిసిటీ ఖర్చు లేకుండా 100 కోట్ల డీల్ ఆఫర్ చేసిన ఓటీటీలో ప్రసారం చేస్తే లాభాసాటిగా ఉండేదని భావిస్తున్నారు. చూడాలి ఈ సినిమా భవిష్యత్తు ఏలా ఉందో..

మరో విషయం ఏమంటే.. ఇప్పటికే ఈ సినిమా నుండి ఫస్ట్ లుక్ పోస్టర్, ఫస్ట్ సింగిల్.. పవన్ పుట్టినరోజు సందర్భంగా మోషన్ పోస్టర్ ను విడుదల చేసిన చిత్ర బృందం సెకండ్ సింగిల్ ను కూడా విడుదల చేసేందుకు ప్లాన్ చేయనున్నట్టు తెలుస్తుంది. అంతేకాదు అతి తొందరలోనే ఈ చిత్రం నుంచి రెండో సాంగ్ వచ్చే అవకాశం ఉందని సమాచారం.  ఈ సినిమాను సంక్రాంతి బరిలో దించనున్నారని సమాచారం. పవన్ ఈ సినిమాతో పాటు క్రిష్ దర్శకత్వంలో వస్తోన్న విరూపాక్షలోను.. హరీష్ శంకర్ దర్శకత్వంలో వస్తోన్న మరో సినిమాలోను నటించనున్నాడు. వీటికి తోడు ఓ మలయాళ సినిమాకు కూడా ఓకే అన్నాడట. ఈ సినిమా గురించి పూర్తి వివరాలు తెలియాల్సీ ఉంది.
Published by: Suresh Rachamalla
First published: September 27, 2020, 6:58 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading