Vakeel Saab Trailer: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా శృతి హాసన్ హీరోయిన్ గా శ్రీరామ్ వేణు దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘వకీల్ సాబ్’. మహిళ ఇతివృత్తంతో ఈ సినిమాను సందేశాత్మకంగా తెరకెక్కించారు. తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ను ఎపుడు విడుదల చేసే డేట్ అనౌన్స్ చేసారు.
Vakeel Saab Trailer: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా శృతి హాసన్ హీరోయిన్ గా శ్రీరామ్ వేణు దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘వకీల్ సాబ్’. మహిళ ఇతివృత్తంతో ఈ సినిమాను సందేశాత్మకంగా తెరకెక్కించారు. ఈ సినిమా బాలీవుడ్లో బ్లాక్ బస్టర్ ‘పింక్’ సినిమాకు రీమేక్‌గా తెరకెక్కింది. . అక్కడ అమితాబ్ బచ్చన్ చేసిన ఆ లాయర్ పాత్రను తెలుగులో పవన్ కళ్యాణ్ చేస్తున్నాడు. ఈ సినిమా ఏప్రిల్ 9న ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతోంది. ఇక విడుదలకు దగ్గరపడుతుండడంతో ప్రమోషన్స్‌ను మొదలు పెట్టింది చిత్రబృందం. అందులో భాగంగా ఈ సినిమా టీమ్ ప్రమోషన్స్‌ను స్టార్ట్ చేసింది. ఇక ఇప్పటికే టీమ్ ఇంటర్యూలు.. మ్యూజిక్ పెస్ట్లు నిర్వహిస్తుండగా.. తాజాగా ఈ సినిమా నుంచి ట్రైలర్ కూడా విడుదల చేయనున్నట్లు మార్చి 29న విడుదల చేయనున్నట్టు ప్రకటించింది. దీంతో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. ఏప్రిల్ 29 ఎపుడా అని అపుడే ఎదురు చూస్తున్నారు.
ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి నిర్మాతలు ఓ ట్వీట్ కూడా చేశారు. ఇక ఈ సినిమాకు మొదట ‘మగువ’ అనే టైటిల్‌ను అనుకున్నట్లు తెలిపింది చిత్రబృందం. ఆ ఇంటర్వూలో సినిమా దర్శకుడు వేణు శ్రీరామ్ మాట్లాడుతూ.. ఈ సినిమా టైటిల్ గురించి మాట్లాడుతూ తాము ముందు “వకీల్ సాబ్” టైటిల్ అనుకోలేదని సినిమా కథకు తగ్గట్టుగా “మగువ” అని అనుకున్నామని తెలిపారు. అయితే ఆ తర్వాత మళ్లీ పవన్ ఇమేజ్ కు తగ్గట్టుగా ఆ సినిమాకు ‘లాయర్ సాబ్’ అనే టైటిల్ అనుకున్నాం. ఫైనల్‌గా “వకీల్ సాబ్” అని పేరును నిర్ణయించామని పేర్కోన్నాడు.
వకీల్ సాబ్ ఏప్రిల్ 9 ప్రపంచవ్యాప్తంగా విడుదలకానుంది. అది అలా ఉంటే ఈ సినిమాకు ఓటీటీ డీల్ కుదిరిందని తెలుస్తోంది. అమెజాన్ ప్రైమ్ వకీల్ సాబ్ స్ట్రీమింగ్ హక్కులను భారీ ధరకు కొనుగోలు చేసింది. . దిల్ రాజు నిర్మించిన అన్ని సినిమాలు కూడా ప్రైమ్ వీడియోనే డిజిటల్ హక్కులను సొంతం చేసుకోగా.. తాజాగా ఈ సినిమా కూడా అమెజాన్ ప్రైమ్ దక్కించుకున్నట్టు సమాచారం. ఇక ఇక్కడ కండీషన్ ఏమంటే.. వకీల్ సాబ్ చిత్రాన్ని థియేటర్లో 50 రోజులు పూర్తి అయ్యే వరకు కూడా అమెజాన్‌లో స్ట్రీమింగ్ చెయ్యకూడదని ఒప్పందం కుదుర్చుకున్నారట. వకీల్ సాబ్ శాటిలైట్ రైట్స్‌ను జీ తెలుగు కొనేసింది. ఇక ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తుండగా నివేతా థామస్, అంజలి, అనన్య నాగల్ల కీలక పాత్రల్లో నటిస్తున్నారు. బోనీ కపూర్ సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు.
వకీల్ సాబ్ సినిమా (Vakeel Saab movie)
పవన్ కళ్యాణ్ ఇతర సినిమాల విషయానికి వస్తే.. క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో ‘హరి హర వీరమల్లు’ సినిమాలో నటిస్తున్నాడు. చారిత్రక నేపథ్యం లో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమాలో పవన్ కళ్యాన్ వజ్రాల దొంగగా కనిపించనున్నాడని అంటున్నారు. ఈ సినిమా పవన్ కెరీర్ లోనే భారీ బడ్జెట్ తో తెరకెక్కుతుంది. ఏ ఎం రత్నం నిర్మాత వ్యవహరిస్తున్నాడు. ఈ మూవీకి కీరవాణి సంగీతం అందిస్తున్నాడు. మరోవైపు మలయాళంలో హిట్టైన ‘అయ్యప్పనుమ్ కోషియమ్’ సినిమాను ఇదే యేడాది విడుదల చేయాలనే ప్లాన్‌లో ఉన్నాడు.
Published by:Kiran Kumar Thanjavur
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.