• HOME
  • »
  • NEWS
  • »
  • MOVIES
  • »
  • PAWAN KALYAN VAKEEL SAAB TO STREAM ON AMAZON PRIME ON THIS DATE HERE ARE THE DETAILS SR

Vakeel Saab : అమెజాన్ ప్రైమ్‌లో వకీల్ సాబ్.. స్ట్రీమింగ్ డేట్ ఖరారు...

Vakeel Saab : అమెజాన్ ప్రైమ్‌లో వకీల్ సాబ్.. స్ట్రీమింగ్ డేట్ ఖరారు...

అమెజాన్ ప్రైమ్‌లో పవన్ కళ్యాణ్ ‘వకీల్ సాబ్’ మూవీ (Twitter/Photo)

Pawan Kalyan Vakeel Saab : వేణు శ్రీరామ్ దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన తాజా చిత్రం ‘వకీల్ సాబ్’. హిందీ సినిమా పింక్‌కు తెలుగు రీమేక్‌గా వచ్చిన ఈ నెల 9న ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన సంగతి తెలిసిందే.

  • Share this:
    Pawan Kalyan Vakeel Saab : వేణు శ్రీరామ్ దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన తాజా చిత్రం ‘వకీల్ సాబ్’. హిందీ సినిమా పింక్‌కు తెలుగు రీమేక్‌గా వచ్చిన ఈ నెల 9న ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన సంగతి తెలిసిందే. దాదాపు మూడు సంవత్సరాల తర్వాత పవన్ కళ్యాణ్ సినిమా రావడంతో ఈ సినిమాకు ఓపెనింగ్స్ అదిరిపోయే రేంజ్‌లో వచ్చాయి. ముఖ్యంగా కోవిడ్ సమయంలో కూడా ఈ రేంజ్‌లో వసూళ్లు అంటే మాటలు కాదు. ముఖ్యంగా మొదటి మూడు రోజులు అదిరిపోయే కలెక్షన్స్‌ వచ్చాయి. ఇక ఆ తర్వాత పెద్దగా రాబట్టలేకపోయింది. దీనికి అనేక కారణాలు ఉన్నాయి. ముఖ్యంగా దేశంలో కరోనా సెకండ్ వేవ్ కారణంగా కరోనా కేసులు రోజు రోజుకు పెరుగుతున్నాయి. దీంతో జనాలు ఇంటి నుంచి బయటకు రావాడానికి బయపడుతున్నారు. అలాంటిదీ సినిమా కోసం అంటే ఆలోచిస్తున్నారు. దీంతో ఆల్రెడీ థియేటర్స్ లోకి వచ్చిన పలు చిత్రాలు ఓటిటిలోకి కూడా వచ్చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో వకీల్ సాబ్ కూడా ఓటీటీ బాట పట్టనుందని తెలుస్తోంది. ఈ చిత్రం వచ్చే మే 7 నుంచి ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కు వస్తుంది అని టాక్ మొదలయ్యింది. ప్రస్తుత సమయంలో థియేటర్‌లో చూసేవారి సంఖ్య పూర్తిగా తగ్గడంతో ఒప్పందం డేట్ కన్న ముందుగానే స్ట్రీమింగ్ కానున్నట్లు టాలీవుడ్ వర్గాల నుంచి సమాచారం. ఈ విషయంపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.

    థమన్ సంగీతం అందించగా అనన్య నాగల్ల, నివేతా థామస్, అంజలిలు కీలక పాత్రల్లో నటించారు. శృతి హాసన్ ఓ చిన్న పాత్రలో మెరిసింది. మరో కీలకపాత్రలో ప్రకాష్ రాజ్ కనిపించారు. అది అలా ఉంటే వకీల్ సాబ్.. ప్రోడ్యూసర్‌కు హీరోకు మంచి లాభాలను తెచ్చిపెట్టిందని అంటున్నారు. పవన్ కళ్యాణ్, నిర్మాత దిల్ రాజు ఇద్దరూ ఈ ప్రాజెక్ట్ ద్వారా భారీ లాభం పొందారని టాలీవుడ్ వర్గాల సమాచారం. ముందుగా కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం పవన్ కళ్యాణ్ ఈ చిత్రం కోసం రూ .50 కోట్లుగా తన రెమ్యూనరేషన్ తీసుకున్నాడట. ఆ తర్వాత మరో 15 కోట్లు లాభాల్లో వాటాగా తీసుకున్నట్లు తెలుస్తోంది. దిల్ రాజు ఈ సినిమాను 150 కోట్ల రూపాయలకు అంటే థియేట్రికల్, శాటిలైట్ ఇంకా డిజిటల్ హక్కులను అమ్మినట్లు తెలుస్తోంది.

    Pawan Kalyan Vakeel Saab, the remuneration of shruti haasan anjali and nivetha thomas for acting vakeel saab, Vakeel Saab Overseas collections, Vakeel Saab Collections,pawan kalyan,Vakeel Saab 8 days collections,pawan kalyan Vakeel Saab 8 days ww collections,Vakeel Saab 8 days world wide collections,Vakeel Saab 8 days collections 79 crores,telugu cinema,వకీల్ సాబ్,వకీల్ సాబ్ కలెక్షన్స్,పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ 8 డేస్ కలెక్షన్స్,పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ 8 డేస్ కలెక్షన్స్
    దర్శకుడు వేణుతో అనన్య, అంజలి, నివేదా Photo : Twittter


    దీంతో మొత్తం మీద అన్ని ఖర్చులు పోను దిల్ రాజు రూ .50 కోట్ల వరకు లాభం పొందాడని అంటున్నారు. మరోవైపు శృతి హాసన్‌, నివేదా థామస్‌కు చేరో 75 లక్షలు, అంజలికి 50 లక్షలు, ప్రకాష్ రాజ్‌కు కోటి రూపాయలు, అనన్య కు ముప్పై లక్షల వరకు రెమ్యూనరేషన్‌గా ఇచ్చినట్లు సోషల్ మీడియాలో టాక్ నడుస్తోంది. దీనిపై కూడా కొంత క్లారిటీ రావాల్సి ఉంది. ఇక తాజాగా మరో వార్త ఏమంటే.. దిల్ రాజు పవన్ కళ్యాణ్‌తో మరో సినిమాను ప్లాన్ చేస్తున్నట్లు టాక్ నడుస్తోంది. ఈ సినిమాపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.


    ఇక పవన్ కళ్యాణ్ నటిస్తున్న ఇతర సినిమాల విషయానికి వస్తే.. క్రిష్ జాగర్లమూడి సినిమాలో నటిస్తున్నాడు. చారిత్రక నేపథ్యం లో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమాలో పవన్ కళ్యాన్ వ‌జ్రాల దొంగగా క‌నిపించ‌నున్నాడ‌ని అంటున్నారు. ఈ సినిమాకు హరిహర వీరమల్లు అనే పేరును ఖరారు చేసారు. ఈ సినిమా పవన్ కెరీర్ లోనే భారీ బడ్జెట్ తో తెరకెక్కుతుంది. ఏ ఎం రత్నం నిర్మాత వ్యవహరిస్తున్నాడు. ఈ మూవీకి కీరవాణి సంగీతం అందిస్తున్నాడు. వచ్చే సంవత్సరం అంటే 2022 సంక్రాంతికి విడుదల కానుందని టాక్.
    Published by:Suresh Rachamalla
    First published:

    అగ్ర కథనాలు