PAWAN KALYAN VAKEEL SAAB TEASER TALK POWER STAR POWER PACKED COURT DRAMA TA
PSPK Vakeel Saab Teaser Talk: పవన్ కళ్యాణ్ ‘వకీల్ సాబ్’ టీజర్ టాక్.. వకీల్ సాబ్‌గా పవర్ స్టార్ ఓ రేంజ్లో అదరగొట్టేసాడుగా..
పవన్ కళ్యాణ్ ‘వకీల్ సాబ్’ టీజర్ విడుదల (Twitter/Photo)
Pawan Kalyan PSPK Vakeel Saab Teaser Talk | పవర్ స్టార్ అభిమానులు ఎపుడెపుడా అని ఎదురు చూస్తున్న ‘వకీల్ సాబ్’ టీజర్ సంక్రాంతి పండగ సందర్భంగా విడుదల చేసారు.
Pawan Kalyan PSPK Vakeel Saab Teaser Talk | పవర్ స్టార్ అభిమానులు ఎపుడెపుడా అని ఎదురు చూస్తున్న ‘వకీల్ సాబ్’ టీజర్ సంక్రాంతి పండగ సందర్భంగా విడుదల చేసారు. రీసెంట్గా ఈ సినిమా షూటింగ్‌ను కంప్లీట్ చేసారు పవన్ కళ్యాణ్. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ తొలిసారి వకీల్ పాత్రలో అలరించనున్నాడు. ఈ సినిమా హిందీలో అమితాబ్ బచ్చన్ హీరోగా నటించిన ‘పింక్’ మూవీకి రీమేక్. దిల్ రాజు, బోనీ కపూర్ సంయుక్త నిర్మాణంలో శ్రీరామ్ వేణు ఈ సినిమాను డైరెక్ట్ చేసాడు.పవన్ కళ్యాణ్ ఇమేజ్‌కు తగ్గట్టు ఈ చిత్రంలో కొన్ని కీలక మార్పులు చేసారు. ఈ సినిమాను ఎక్కువగా హైదరాబాద్, అరకు లాంటి ప్రదేశాల్లో వకీల్ సాబ్ షూటింగ్ జరిపారు. ఈ సినిమాలో శృతి హాసన్ హీరోయిన్గా నటిస్తుండగా.. అంజలి, నివేదా థామస్, అనన్య కీలక పాత్రల్లో నటిస్తున్నారు. థమన్ సంగీతం అందిస్తున్నాడు.
కరోనా కారణంగా ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ కావడానికి యేడాదిన్నర సమయం తీసుకున్నారు పవన్ కళ్యాన్. వకీల్ సాబ్ కోసం పవన్ కళ్యాణ్ రూ. 40 కోట్ల నుంచి రూ. 50 కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకున్నట్లు ప్రచారం జరుగుతుంది. షూటింగ్ పూర్తి కావడంతో పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా వీలైనంత త్వరగా పూర్తి చేయాలని చూస్తున్నారు. తాజాగా సంక్రాంతి పండగ సందర్భంగా ‘వకీల్ సాబ్’ టీజర్‌ను విడుదల చేసారు.
ఈ టీజర్లో పవన్ కళ్యాణ్ .. తన దైన శైలిలో ఆకట్టుకున్నారు. ముఖ్యంగా పెన్నుతో టిక్ టిక్ అనిపించడం.. చేతి వాచ్‌ను స్టైలిష్‌గా ఆయుధంగా వాడటం.. అంతేకాదు కోర్టులో వాదించడం తెలుసు.. కోర్టు తీసి కొట్టడం తెలుసు అంటూ మెట్రో రైలులో పవన్ కళ్యాణ్ చెప్పే డైలాగులు ఫ్యాన్స్ చేత కెవ్వు కేక పుట్టించేలా ఉన్నాయి. చివర్లో ఇళ్లు ఖాళీ వెళ్లే సమయంలో గడ్డం లుక్‌లో పవన్ కళ్యాణ్ ఫినిషింగ్ టచ్ ఇచ్చారు. మొత్తంగా పవన్ కళ్యాణ్ ఆశించే అన్ని హంగులతో ‘వకీల్ సాబ్’ ఉండబోతున్నట్టు అర్ధమవుతోంది.
ఇక టీజర్లో పవన్ కళ్యాణ్.. వకీల్ సాబ్‌గా కోర్టు హాలులో అబ్షక్షన్ యువర్ హానర్ .. అంటూ చెప్పే డైలాగు కూడా ఇరగదీసే విధంగా ుంది. ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా రూ. 100 కోట్లకు పైగానే జరుగుతుంది. అజ్ఞాతవాసి లాంటి డిజాస్టర్ తర్వాత కూడా పవన్ సినిమాపై ఉన్న క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు. పవన్ రీ ఎంట్రీ సినిమా కావడంతో అంచనాలు భారీగానే ఉన్నాయి. మరి ఈ చిత్రంతో పవన్ ఏ మేరకు అంచనాలు అందుకుంటాడో చూడాలి. మరోవైపు వకీల్ సాబ్తో పాటు అయ్యప్పునుమ్ కోషియుమ్ రీమేక్, హరీష్ శంకర్ సినిమా, క్రిష్, సురేందర్ రెడ్డి సినిమాలకు కూడా కమిట్ అయ్యాడు పవర్ స్టార్.
Published by:Kiran Kumar Thanjavur
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.