Pawan Kalyan Vakeel Saab Teaser | పవన్ కళ్యాణ్ అభిమానులకు శుభవార్త. ఆయన యాక్ట చేస్తోన్న ‘వకీల్ సాబ్’ సినిమా టీజర్‌కు ముహూర్తం ఖరారైంది. రీసెంట్గా ఈ సినిమా షూటింగ్‌ను కంప్లీట్ చేసారు పవన్ కళ్యాణ్. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ తొలిసారి వకీల్ పాత్రలో అలరించనున్నాడు. ఈ సినిమా హిందీలో అమితాబ్ బచ్చన్ హీరోగా నటించిన ‘పింక్’ మూవీకి రీమేక్. దిల్ రాజు, బోనీ కపూర్ సంయుక్త నిర్మాణంలో శ్రీరామ్ వేణు ఈ సినిమాను డైరెక్ట్ చేసాడు.పవన్ కళ్యాణ్ ఇమేజ్‌కు తగ్గట్టు ఈ చిత్రంలో కొన్ని కీలక మార్పులు చేసారు. ఈ సినిమాను ఎక్కువగా హైదరాబాద్, అరకు లాంటి ప్రదేశాల్లో వకీల్ సాబ్ షూటింగ్ జరిగింది. ఈ సినిమాలో శృతి హాసన్ హీరోయిన్గా నటిస్తుండగా.. అంజలి, నివేదా థామస్, అనన్య కీలక పాత్రల్లో నటిస్తున్నారు. థమన్ సంగీతం అందిస్తున్నాడు.
కరోనా కారణంగా ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ కావడానికి యేడాదిన్నర సమయం తీసుకున్నారు పవన్ కళ్యాన్. వకీల్ సాబ్ కోసం పవన్ కళ్యాణ్ రూ. 40 కోట్ల నుంచి రూ. 50 కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకున్నట్లు ప్రచారం జరుగుతుంది. షూటింగ్ పూర్తి కావడంతో పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా వీలైనంత త్వరగా పూర్తి చేయాలని చూస్తున్నారు. ఇదిలా ఉంటే జనవరి 1న న్యూ ఇయర్ సందర్భంగా వకీల్ సాబ్ టీజర్ విడుదల చేయాలనుకున్నారు. కానీ పోస్టర్‌తో సరిపెట్టారు. తాజాగా ఈ సినిమా టీజర్‌ను సంక్రాంతి కానుకగా జనవరి 14 సాయంత్రం 6 గంటల 3 నిమిషాలకు విడుదల చేయనున్నట్టు ప్రకటించారు.
తొలిసారి పవన్ కళ్యాణ్.. వకీల్ సాబ్‌గా కోర్టు హాలులో ఏ విధంగా అదరగొడతా అని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా రూ. 100 కోట్లకు పైగానే జరుగుతుంది. అజ్ఞాతవాసి లాంటి డిజాస్టర్ తర్వాత కూడా పవన్ సినిమాపై ఉన్న క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు. పవన్ రీ ఎంట్రీ సినిమా కావడంతో అంచనాలు భారీగానే ఉన్నాయి. మరి ఈ చిత్రంతో పవన్ ఏ మేరకు అంచనాలు అందుకుంటాడో చూడాలి. మరోవైపు వకీల్ సాబ్తో పాటు అయ్యప్పునుమ్ కోషియుమ్ రీమేక్, హరీష్ శంకర్ సినిమా, క్రిష్, సురేందర్ రెడ్డి సినిమాలకు కూడా కమిట్ అయ్యాడు పవర్ స్టార్.
Published by:Kiran Kumar Thanjavur
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.