• Home
  • »
  • News
  • »
  • movies
  • »
  • PAWAN KALYAN VAKEEL SAAB PRE RELEASE EVENT CANCEL DUE TO COVID 19 SECOND WAVE TA

Pawan Kalyan - Vakeel Saab: ఆ విషయంలో వకీల్ సాబ్ సినిమాకు తీవ్ర నిరాశే.. ఫ్యాన్స్ గుస్సా..

పనవ్ కళ్యాణ్ ‘వకీల్ సాబ్’ (Vakeel Saab)

Pawan Kalyan - Vakeel Saab: ఆ విషయంలో వకీల్ సాబ్ సినిమాకు తీవ్ర నిరాశే.. ఫ్యాన్స్ గుస్సా అవుతున్నారు. వివరాల్లోకి వెళితే..

  • Share this:
    Pawan Kalyan - Vakeel Saab: ఆ విషయంలో వకీల్ సాబ్ సినిమాకు తీవ్ర నిరాశే.. ఫ్యాన్స్ గుస్సా అవుతున్నారు. వివరాల్లోకి వెళితే.. పవన్ కళ్యాణ్ హీరోగా శ్రీరామ్ వేణు దర్శకత్వంలో దిల్ రాజు, బోనీ కపూర్ సంయుక్తంగా నిర్మించిన చిత్రం ‘వకీల్ సాబ్’. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ట్రైలర్ యూట్యూబ్‌లో అన్ని రికార్డులను తుడిచిపెట్టే పనిలో పడింది. ఈ నెల 9న ఈ సినిమాను ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నారు. ఈ సినిమా హిందీలో అమితాబ్ బచ్చన్ ప్రధాన పాత్రలో నటించిన ‘పింక్’ సినిమాకు రీమేక్. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను ఏప్రిల్ 3వ తేదిన యూసుఫ్ గుడ పోలీస్ లైన్స్‌లో నిర్వహించాలనున్నారు. ఈ సందర్భంగా అనుమతి కోరుతూ చిత్ర నిర్మాతలు పోలీసులకు దరఖాస్తు చేసుకున్నారు.

    తాజాగా  దేశ వ్యాప్తంగా కరోనా సెకండ్ తీవ్ర రూపం దాల్చింది. వారం పది రోజుల్లోనే 10 రెట్లు కేసులు పెరిగాయి. ప్రభుత్వం కూడా ప్రజలందరూ  బయటకు వెళ్లేటపుడు మాస్క్ కంపల్సరీ పెట్టుకోవాలనే ఆదేశాలు జారీ చేసారు. ఈ నేపథ్యంలో పోలీసులు పోలీస్ లైన్స్‌లో ‘వకీల్ సాబ్’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు పర్మిషన్ ఇవ్వడం కుదరదని చెప్పారు. ప్రీ రిలీజ్ ఈవెంట్ అంటే ప్రేక్షకులు ఎక్కువగా గూమిగూడే అవకాశం ఉంది. మరోవైపు ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో దాదాపు 5 వేల మంది హాజరు కాబోతున్నట్టు తమ లేఖలో పేర్కొన్నారు.  ఈ సందర్భంగా కరోనా మరింత పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో ఈ  సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కుపోలీసులు అనుమతి నిరాకరించారు. ఈ నేపథ్యంలో పనవ్ కళ్యాణ్‌ను చూడాలనుకున్న అభిమానులు ఉసురు మంటున్నారు.

    ‘వకీల్ సాబ్’లో పవన్ కళ్యాణ్ (Twitter/Photo)


    వకీల్ సాబ్ విషయానికొస్తే..  ఏప్రిల్ 9 ప్రపంచవ్యాప్తంగా విడుదలకానుంది. అది అలా ఉంటే ఈ సినిమాకు ఓటీటీ డీల్ కుదిరింది. అమెజాన్ ప్రైమ్ వకీల్ సాబ్ స్ట్రీమింగ్ హక్కులను భారీ ధరకు కొనుగోలు చేసింది. . దిల్ రాజు నిర్మించిన అన్ని సినిమాలు కూడా ప్రైమ్ వీడియోనే డిజిటల్ హక్కులను సొంతం చేసుకోగా.. తాజాగా ఈ సినిమా కూడా అమెజాన్ ప్రైమ్ దక్కించుకున్నట్టు  సమాచారం. ఇక ఇక్కడ కండీషన్ ఏమంటే.. వకీల్ సాబ్ చిత్రాన్ని థియేటర్‌లో 50 రోజులు పూర్తి అయ్యే వరకు కూడా అమెజాన్‌లో స్ట్రీమింగ్ చెయ్యకూడదని ఒప్పందం కుదుర్చుకున్నారట. వకీల్ సాబ్ శాటిలైట్ రైట్స్‌ను జీ తెలుగు కొనేసింది. ఇక ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తుండగా నివేతా థామస్, అంజలి, అనన్య నాగల్ల కీలక పాత్రల్లో నటిస్తున్నారు. బోనీ కపూర్ సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు.

    vakeel saab movie,vakeel saab movie tickets price,vakeel saab movie benefit show ticket 1500 rs,vakeel saab movie updates,pawan kalyan vakeel saab,vakeel saab movie trailer,pawan kalyan vakeel saab teaser,vakeel saab teaser release date,vakeel saab motion poster,vakeel saab movie release date,vakeel saab movie trialer,వకీల్ సాబ్,వకీల్ సాబ్ టికెట్ రేట్స్ 1500,వకీల్ సాబ్ బెనిఫిట్ షో టికెట్ 1500
    ‘వకీల్ సాబ్’గా పవన్ కళ్యాణ్ (Twitter/Photo)


    పవన్ కళ్యాణ్ ఇతర సినిమాల విషయానికి వస్తే.. క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో ‘హరి హర వీరమల్లు’ సినిమాలో  నటిస్తున్నాడు. చారిత్రక నేపథ్యం లో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమాలో పవన్ కళ్యాన్ వ‌జ్రాల దొంగగా క‌నిపించ‌నున్నాడ‌ని అంటున్నారు. ఈ సినిమా పవన్ కెరీర్ లోనే భారీ బడ్జెట్ తో తెరకెక్కుతుంది. ఏ ఎం రత్నం నిర్మాత వ్యవహరిస్తున్నాడు. ఈ మూవీకి కీరవాణి సంగీతం అందిస్తున్నాడు. మరోవైపు మలయాళంలో హిట్టైన ‘అయ్యప్పనుమ్ కోషియమ్’ సినిమాను ఇదే యేడాది విడుదల చేయాలనే ప్లాన్‌లో ఉన్నాడు. ‌‌
    Published by:Kiran Kumar Thanjavur
    First published: