Pawan Kalyan - Vakeel Saab | పవన్ కళ్యాణ్ పై వకీల్ సాబ్ రిలీజ్ డేట్ ఎపుడు అంటూ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో ఒకటే రచ్చ చేస్తున్నారు. వివరాల్లోకి వెళితే.. కరోనా లాక్డౌన్ కారణంగా దాదాపు 9 నెలలు థియేటర్స్‌లో సినిమాలు లేక బోసి పోయింది. అన్‌లాక్ 5.0లో భాగంగా థియేటర్స్ ఓపెన్ చేసుకోవడానికి ప్రభుత్వం షరతులతో కూడిన పర్మిషన్ ఇచ్చింది. ఈ సంక్రాంతి పండక్కి ..రవితేజ క్రాక్ మూవీ సగం ఆక్యుపెన్షీతో మంచి సక్సెస్ అందుకుంది.కరోనా తర్వాత థియేటర్స్‌లో రిలీజై మంచి సక్సెస్ అందుకున్న తొలి చిత్రంగా రవితేజ క్రాక్ మూవీ రికార్డులకు ఎక్కింది. దీంతో కంటెంటె బాగుంటే ఆడియన్స్ థియేటర్స్‌కు వస్తారన్న విషయం స్పష్టం అయింది. దీంతో ఒక్కొక్కరుగా తమ సినిమాల రిలీజ్ డేట్స్ ప్రకటిస్తూ.. థియేటర్స్‌ను బుక్ చేసుకుంటున్నారు. ఈ కోవలోనే రాజమౌళి, ఎన్టీఆర్, రామ్ చరణ్, అజయ్ దేవ్‌గణ్‌ల ‘ఆర్ఆర్ఆర్’ సినిమాను అక్టోబర్ 13న విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు.
మరోవైపు చిరంజీవి ఆచార్య సినిమాను మే 13న థియేటర్స్‌లో విడుదల చేస్తున్నట్టు అఫీషియల్‌గా అనౌన్స్ చేసారు. మరోవైపు వెంకటేష్ నారప్ప.. ఒక రోజు ఆలస్యంగా మే 14న విడుదల కానుంది. జూలై 16న కేజీఎఫ్ 2, ఇంకోవైపు వెంకటేష్, వరుణ్ తేజ్‌ల ఎఫ్ 3 మూవీని ఆగష్టు 27న, అల్లు అర్జున్ , సుకుమార్‌ల ‘పుష్ఫ’ మూవీని మే 13న, వరుణ్ తేజ్ ‘గని’ మూవీని జూలై 30న విడుదల చేస్తున్నట్టు ప్రకటించేసారు. అటు మహేష్ బాబు కూడా వచ్చే సంక్రాంతికి ఇపుడు కర్చీఫ్ వేసేసాడు. దీంతో పవన్ కళ్యాణ్ తన సినిమాను ఎపుడు విడుదల చేస్తారా అని అభిమానులు అడుగుతున్నారు. అంతేకాదు తొందర్లనే రిలీజ్ డేట్ ప్రకటించమని నిర్మాత, దర్శకులపై ఒత్తిడి పెంచుతున్నారు.
పవన్ కళ్యాణ్ (Twitter/Photo)
ఇప్పటకే షూటింగ్ పార్ట్ కంప్లీటైన ఈ సినిమాకు పోస్ట్ ప్రొడక్షన్స్ వర్క్ మాత్రం బ్యాలెన్స్ ఉంది. ఈ చిత్రాన్ని సమ్మర్ కానుకగా ఏప్రిల్ 9న ఉగాది కానుకగా విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నారు. అదే రోజున ఈ సినిమాను విడుదల చేస్తారా లేదా అనేది తెలియాల్సి ుంది. ‘వకీల్ సాబ్’ సినిమాను శ్రీరామ్ వేణు డైరెక్ట్ చేస్తున్నాడు. దిల్ రాజు, బోనీ కపూర్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
వకీల్ సాబ్‌గా పవన్ కళ్యాణ్ (Twitter/Photo)
ఇక పవన్ కళ్యాణ్... సెకండ్ ఇన్నింగ్స్‌లో మొదలు పెట్టిన ఫస్ట్ మూవీ ఇదే. ఈ సినిమా హిందీలో అమితాబ్ బచ్చన్, తాప్సీ ప్రధాన పాత్రలో నటించిన ‘పింక్’ సినిమాకు రీమేక్. తెలుగు నేటివిటీతో పాటు పవన్ కళ్యాణ్ ఇమేజ్‌కు అనుగుణంగా ఈ సినిమాలో భారీ మార్పులు చేర్పులు చేసి కమర్షియల్ హంగులతో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఇక విడుదలకు ముందే ‘వకీల్ సాబ్’ సినిమాన డిజిటల్ రైట్స్ అమెజాన్ ప్రైమ్ రూ. 25 కోట్లకు అమ్ముడుపోయినట్టు సమాచారం. అంతేకాదు ఈ సినిమా శాటిలైట్ రైట్స్ .. రూ. 15 కోట్లకు జీ తెలుగు కొనుగోలు చేసినట్టు సమాచారం. ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ సరసన శృతి హాసన్ హీరోయిన్గా నటిస్తోంది. మరో ముఖ్యపాత్రల్లోఅంజలి, నివేదా థామస్ నటిస్తున్నారు.
Published by:Kiran Kumar Thanjavur
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.