Home /News /movies /

PAWAN KALYAN VAKEEL SAAB NEW POSTER FOR WOMENS DAY SPECIAL TA

Vakeel Saab: ఉమెన్స్ డే సందర్భంగా ‘వకీల్ సాబ్’ స్పెషల్ పోస్టర్ విడుదల చేసిన చిత్ర యూనిట్..

ఉమెన్స్ డే సందర్భంగా ‘వకీల్ సాబ్’ కొత్త పోస్టర్ విడుదల (Twitter/Photo)

ఉమెన్స్ డే సందర్భంగా ‘వకీల్ సాబ్’ కొత్త పోస్టర్ విడుదల (Twitter/Photo)

Pawan Kalyan -Vakeel Saab - Womens Day 2021 | ప్రస్తుతం పవన్ కళ్యాణ్.. శ్రీరామ్ వేణు దర్శకత్వంలో ‘వకీల్ సాబ్’ సినిమా చేస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన ఈ మూవీ ఫస్ట్ లుక్, టీజర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఉమెన్స్ డే సందర్భంగా ఈ సినిమా కొత్త పోస్టర్‌ను విడుదల చేసారు.

ఇంకా చదవండి ...
    Pawan Kalyan -Vakeel Saab - Womens Day 2021 | ప్రస్తుతం పవన్ కళ్యాణ్.. శ్రీరామ్ వేణు దర్శకత్వంలో ‘వకీల్ సాబ్’ సినిమా చేస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన ఈ మూవీ ఫస్ట్ లుక్, టీజర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ కంప్లీట్ అయింది. ఈ చిత్రాన్ని ఏప్రిల్ 9న విడుదల చేస్తున్నారు. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ తొలిసారి వకీల్ పాత్రలో అలరించనున్నాడు. ఈ సినిమా హిందీలో అమితాబ్ బచ్చన్ హీరోగా నటించిన ‘పింక్’ మూవీకి రీమేక్. దిల్ రాజు, బోనీ కపూర్ సంయుక్త నిర్మాణంలో శ్రీరామ్ వేణు ఈ సినిమాను డైరెక్ట్ చేసాడు.పవన్ కళ్యాణ్ ఇమేజ్‌కు తగ్గట్టు ఈ చిత్రంలో కొన్ని కీలక మార్పులు చేసారు.   ఈ సినిమాలో శృతి హాసన్ హీరోయిన్‌గా నటిస్తుండగా.. అంజలి, నివేదా థామస్, అనన్య కీలక పాత్రల్లో నటిస్తున్నారు. థమన్ సంగీతం అందిస్తున్నాడు.

    ఉమెన్స్ డే సందర్భంగా ‘వకీల్ సాబ్’ పోస్టర్ (Twitter/Photo)


    ఈ రోజు ఉమెన్స్ డే సందర్భంగా ‘వకీల్ సాబ్’ నుంచి మరో పోస్టర్‌ను విడుదల చేసారు. ఇందులో పవన్ కళ్యాణ్‌తో పాటు అంజలి, అనన్య, నివేదా థామస్‌తో కలిసి ఉన్న ఫోటోను విడుదల చేసారు. మహిళ ఇతివృత్తంతో ఈ చిత్రం తెరకెక్కింది. ముఖ్యంగా మూడేళ్ళ తర్వాత పవన్ నటిస్తున్న సినిమా కావడంతో వకీల్ సాబ్‌పై అంచనాలు పెంచేస్తుంది. బిజినెస్ కూడా 100 కోట్ల వరకు జరుగుతుంది.

    వకీల్ సాబ్‌లో పవన్ కళ్యాణ్, నివేదా థామస్,అంజలి, అనన్య (Twitter/Photo)


    దిల్ రాజు, బోనీ కపూర్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. శృతి హాసన్ హీరోయిన్‌‌గా నటిస్తోంది. ఈ సినిమా ఓటీటీ రైట్స్ అమెజాన్ ప్రైమ్ వీడియో సొంతం చేసుకుంది. దాదాపు 15 కోట్లకు పైగా చెల్లించి వకీల్ సాబ్ డిజిటల్ హక్కులను అమెజాన్ దక్కించుుంది. మరోవైపు జీ సినిమాస్ శాటిలైట్ రైట్స్ సొంతం చేసుకుంది. దీనికోసం కూడా 15 కోట్ల వకు పెట్టినట్లు తెలుస్తుంది. ఇదిలా ఉంటే సినిమా విడుదలైన 50 రోజుల తర్వాత అమెజాన్‌లో వకీల్ సాబ్ విడుదల కానుంది.
    Published by:Kiran Kumar Thanjavur
    First published:

    Tags: Pawan kalyan, Tollywood, Vakeel Saab, Womens day 2021

    తదుపరి వార్తలు