HOME »NEWS »MOVIE »pawan kalyan vakeel saab movie unit following gabbar singh way pk

‘వకీల్ సాబ్’ కోసం ‘గబ్బర్ సింగ్’ దారిలో వెళ్తున్న పవన్ కళ్యాణ్..

‘వకీల్ సాబ్’ కోసం ‘గబ్బర్ సింగ్’ దారిలో వెళ్తున్న పవన్ కళ్యాణ్..
పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ (gabbar singh vakeel saab)

Pawan Kalyan: అదేంటి.. గబ్బర్ సింగ్‌కు, వకీల్ సాబ్‌కు లింక్ ఏంటి..? ఈ రెండు సినిమాలకు అస్సలు సంబంధం లేదు కదా అనుకుంటున్నారా..? కానీ ఒక్క విషయంలో మాత్రం..

  • Share this:
అదేంటి.. గబ్బర్ సింగ్‌కు, వకీల్ సాబ్‌కు లింక్ ఏంటి..? ఈ రెండు సినిమాలకు అస్సలు సంబంధం లేదు కదా అనుకుంటున్నారా..? కానీ ఒక్క విషయంలో మాత్రం ఈ రెండు సినిమాలకు పోలిక ఉంది. అదే ఈ రెండు సినిమాలు కూడా రీమేకులే. అప్పుడు దబంగ్ సినిమాను తీసుకుని తన ఇమేజ్‌కు తగ్గట్లు మార్చుకుని గబ్బర్ సింగ్ చేసాడు పవన్ కళ్యాణ్. ఇప్పుడు పింక్ సినిమాను తెలుగులో రీమేక్ చేస్తున్నాడు దర్శకుడు వేణు శ్రీరామ్. ఈ సినిమా షూటింగ్ కూడా చివరి దశకు వచ్చేసింది.
వకీల్ సాబ్‌గా పవన్ కళ్యాణ్ (Twitter/Photo)
వకీల్ సాబ్‌గా పవన్ కళ్యాణ్ (Twitter/Photo)

కరోనా వైరస్ నియంత్రణ తర్వాత మిగిలిన షూటింగ్ కూడా చేయనున్నారు దర్శక నిర్మాతలు. ఈ క్రమంలోనే పవన్ కూడా డిసెంబర్ తర్వాత షూటింగ్‌కు వస్తానని చెప్పినట్లు ప్రచారం జరుగుతుంది. ఈ సినిమాతో పాటు హరీష్ శంకర్, క్రిష్ సినిమాలతో కూడా బిజీగా ఉన్నాడు పవర్ స్టార్. ఇదిలా ఉంటే వకీల్ సాబ్ విషయంలో ఓ వార్త ఇప్పుడు బాగానే వినిపిస్తుంది. ఈ సినిమాను పింక్ రీమేక్ అంటున్నారు కానీ అది పేరుకే అని తెలుస్తుంది. అర్థం కాలేదు కదా.. ఇక్కడే గబ్బర్ సింగ్ పాలసీ నడుస్తుంది.


గబ్బర్ సింగ్ సినిమాకు 8 ఏళ్లు (gabbar singh 8 years )
పవన్ కళ్యాణ్ (Pawan Kalyan)

అదేంటి అంటే.. అప్పుడు దబంగ్ లైన్ మాత్రమే తీసుకుని స్క్రీన్ ప్లే అంతా మార్చుకున్నాడు దర్శకుడు హరీష్ శంకర్. ఈ సినిమాను చూసి అసలు ఇది నా సినిమానేనా అని సల్మాన్ కూడా జోకులు పేల్చేసాడు. అలాగే ఇప్పుడు పింక్ సినిమా లైన్ మాత్రమే తీసుకుని పూర్తిగా పవన్ ఇమేజ్‌కు తగ్గట్లుగా స్క్రిప్ట్‌పై వేణు శ్రీరామ్ వర్క్ చేసినట్లు తెలుస్తుంది. ఒరిజినల్‌లోని ఆత్మ చెడిపోకుండా కేవలం కథను తీసుకుని ఇక్కడి ఆడియన్స్‌కు తగ్గట్లు వకీల్ సాబ్ తెరకెక్కిస్తున్నాడు శ్రీరామ్ వేణు. మరి ఈయన ప్రయత్నం ఎంతవరకు వర్కవుట్ అవుతుందో చూడాలి.
Published by:Praveen Kumar Vadla
First published:September 09, 2020, 18:03 IST