Vakeel Saab: పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. ‘వకీల్ సాబ్’ షూటింగ్ షురూ..

Pawan Kalyan Vakeel Saab: లాక్ డౌన్ కారణంగా చాలా కాలంగా నిర్మాణంలో వున్న సినిమాలు ఆగిపోయాయి. బయటికి రాలేని పరిస్థితులు ఉండటంతో ఎవరూ ఏం చేయలేకపోతున్నారు. కొన్ని సినిమాలు అయితే విడుదలకు సిద్ధంగా ఉన్నా కూడా ఏం చేయలేని పరిస్థితి.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: September 24, 2020, 2:23 PM IST
Vakeel Saab: పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. ‘వకీల్ సాబ్’ షూటింగ్ షురూ..
వకీల్ సాబ్‌గా పవన్ కళ్యాణ్ (Twitter/Photo)
  • Share this:
లాక్ డౌన్ కారణంగా చాలా కాలంగా నిర్మాణంలో వున్న సినిమాలు ఆగిపోయాయి. బయటికి రాలేని పరిస్థితులు ఉండటంతో ఎవరూ ఏం చేయలేకపోతున్నారు. కొన్ని సినిమాలు అయితే విడుదలకు సిద్ధంగా ఉన్నా కూడా ఏం చేయలేని పరిస్థితి. ఇదిలా ఉంటే తాజాగా పవన్ కళ్యాణ్ అభిమానులకు శుభవార్త వచ్చింది. ఈయన వకీల్ సాబ్ సినిమా షూటింగ్ మళ్లీ మొదలైంది. కొన్ని నెలలుగా ఖాళీగానే ఉన్న చిత్ర యూనిట్ ఇప్పుడు పట్టాలెక్కించారు. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లోనే ఈ చిత్ర షూటింగ్ జరుగుతుంది. వేణు శ్రీరామ్ తెరకెక్కిస్తున్న వకీల్ సాబ్ షూటింగ్ చాలా రోజుల తర్వాత మళ్లీ మొదలు కావడంతో అభిమానులు కూడా సంతోష పడుతున్నారు.
వకీల్ సాబ్‌గా పవన్ కళ్యాణ్ (Twitter/Photo)
వకీల్ సాబ్‌గా పవన్ కళ్యాణ్ (Twitter/Photo)


అయితే పవన్ మాత్రం ఈ షూట్‌కు రాలేదు. నిజానికి ఈ సినిమా షూటింగ్ లాక్ డౌన్‌కి ముందే దాదాపు 80 శాతం పూర్తయింది. కేవలం కొన్ని రోజుల పార్ట్ మాత్రమే మిగిలిపోయింది. దాంతో పాటు హీరోయిన్ శృతి హాసన్ రావడం కూడా ఆలస్యమే అయింది. ఆమె వస్తే మిగిలిన షూటింగ్ కూడా పూర్తైపోతుందని ఇప్పటికే అనౌన్స్ చేసాడు దర్శకుడు వేణు శ్రీరామ్. కేవలం 15 రోజుల షూటింగ్ మాత్రమే బ్యాలెన్స్ ఉండటంతో త్వరగా పూర్తి చేయాలని చూస్తున్నారు దర్శక నిర్మాతలు.
వకీల్ సాబ్ కోర్టు సీన్ లీక్ (pawan kalyan vakeel saab look leak)
వకీల్ సాబ్ కోర్టు సీన్ లీక్ (pawan kalyan vakeel saab look leak)

ఈ క్రమంలోనే హైదరాబాద్ పరిసరాల్లో వకీల్ సాబ్ సినిమా షూటింగ్ చేస్తున్నారు యూనిట్. ఈ చిత్రీకరణలో కథానాయిక అంజలితో పాటు మరికొందరు ప్రముఖులు కూడా పాల్గొంటున్నారు. కానీ హీరో పవన్ కళ్యాణ్ మాత్రం అక్టోబర్‌లో జాయిన్ కానున్నాడని తెలుస్తుంది. అంజలి, నివేద థామస్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. హిందీ సినిమా 'పింక్' రీమేక్‌గా వకీల్ సాబ్ వస్తుంది. తెలుగులో దిల్ రాజు, బోనీ కపూర్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. సంక్రాంతికి దీనిని విడుదల చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి.
అంజలి (anjali/Instagram)
అంజలి (anjali/Instagram)

పవన్ వస్తే కేవలం వారం రోజుల్లోనే షూటింగ్ పూర్తి కానుంది. ఎందుకంటే ఆయనది చాలా తక్కువ పార్ట్ మాత్రమే మిగిలి ఉంది. హీరోయిన్ శృతి హాసన్‌తో ఉన్న ఫ్లాష్ బ్యాక్ సీన్స్ మాత్రమే బ్యాలెన్స్ ఉన్నాయి. దాంతో త్వరగానే అయిపోతుందని చెప్తున్నాడు వేణు శ్రీరామ్. కచ్చితంగా ఈ సినిమాతో పవన్ అదిరిపోయే రీ ఎంట్రీ ఇస్తాడని నమ్ముతున్నారు అభిమానులు. నిజానికి ఈ సినిమాను మేలోనే విడుదల చేయాలనుకున్నారు. కానీ కరోనా కారణంగా ప్లాన్స్ అన్నీ పాడైపోయాయి.
పవన్ కళ్యాణ్ (Pawan Kalyan)
పవన్ కళ్యాణ్ (Pawan Kalyan)

ప్రస్తుతం ఈయన వకీల్ సాబ్ సినిమాతో పాటు క్రిష్, హరీష్ శంకర్ సినిమాలకు కూడా కమిట్‌మెంట్ ఇచ్చాడు. దాంతో పాటే సురేందర్ రెడ్డి, త్రివిక్రమ్ సినిమాలు కూడా లైన్‌లోనే ఉన్నాయి. అయితే ఎన్ని సినిమాలు ఒప్పుకున్నా కూడా రెండేళ్లలోపే పూర్తి చేయాలని చూస్తున్నాడు పవన్. ఎందుకంటే 2024 ఎన్నికలకు మళ్లీ సిద్ధం కానున్నాడు జనసేనాని. ఇప్పుడు చేస్తున్న సినిమాలు కూడా పార్టీని బతికించుకోడానికే. ఒక్కో సినిమాకు దాదాపు 50 కోట్ల వరకు పవన్ తీసుకుంటున్నట్లు ప్రచారం అయితే భారీగానే జరుగుతుంది.
Published by: Praveen Kumar Vadla
First published: September 24, 2020, 2:23 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading