Pawan Kalyan Vakeel Saab: పవన్ కళ్యాణ్ అభిమానులకు శుభవార్త. ఈయన హీరోగా నటిస్తున్న వకీల్ సాబ్ షూటింగ్ పూర్తయింది. ఈ రోజుల్లో పవన్ ఓ సినిమాకు కమిటైన తర్వాత అది షూటింగ్ ఎప్పుడు పూర్తవుతుందో కనీసం చెప్పలేని పరిస్థితి ఎదురైంది.
పవన్ కళ్యాణ్ అభిమానులకు శుభవార్త. ఈయన హీరోగా నటిస్తున్న వకీల్ సాబ్ షూటింగ్ పూర్తయింది. ఈ రోజుల్లో పవన్ ఓ సినిమాకు కమిటైన తర్వాత అది షూటింగ్ ఎప్పుడు పూర్తవుతుందో కనీసం చెప్పలేని పరిస్థితి ఎదురైంది. ఎందుకంటే ఆయన డేట్స్ ఎప్పుడు ఇస్తున్నాడో ఎవరికీ అర్థం కావడం లేదు కూడా. ఇలాంటి సమయంలో వకీల్ సాబ్ షూటింగ్ పూర్తి చేసుకోవడంతో అంతా సంతోషపడుతున్నారు. దీనికి సంబంధించిన ఫోటోలు కూడా ఇప్పుడు బయటికి వచ్చాయి. షూటింగ్ పూర్తైన ఆనందంలో దర్శకుడు వేణు శ్రీరామ్‌ను హత్తుకున్నాడు ఈయన. హైదరాబాద్, అరకు లాంటి ప్రదేశాల్లో వకీల్ సాబ్ షూటింగ్ జరిగింది. ఈ సినిమాలో శృతి హాసన్ హీరోయిన్గా నటిస్తుండగా.. అంజలి, నివేదా థామస్, అనన్య కీలక పాత్రల్లో నటిస్తున్నారు. థమన్ సంగీతం అందిస్తున్నాడు. దిల్ రాజు, బోనీ కపూర్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు ఈ సినిమాను. పింక్ సినిమా రీమేక్‌గా వస్తున్నా కూడా పవన్ ఇమేజ్‌కు తగ్గ మార్పులు చేసాడు దర్శకుడు వేణు. ఈ చిత్రం కోసం దాదాపు ఏడాదిన్నర సమయం కూడా తీసుకున్నాడు ఈయన. వకీల్ సాబ్ కోసం పవన్ కళ్యాణ్ 40 కోట్లకు పైగానే రెమ్యునరేషన్ తీసుకున్నట్లు ప్రచారం జరుగుతుంది. షూటింగ్ పూర్తి కావడంతో పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా వీలైనంత త్వరగా పూర్తి చేయాలని చూస్తున్నారు. ఇదిలా ఉంటే జనవరి 1న న్యూ ఇయర్ సందర్భంగా వకీల్ సాబ్ టీజర్ విడుదల కానుందని తెలుస్తుంది.
ఈ మేరకు మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన కూడా రానుంది. ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా 100 కోట్లకు పైగానే జరుగుతుంది. అజ్ఞాతవాసి లాంటి డిజాస్టర్ తర్వాత కూడా పవన్ సినిమాపై ఉన్న క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు. పవన్ రీ ఎంట్రీ సినిమా కావడంతో అంచనాలు భారీగానే ఉన్నాయి. మరి ఈ చిత్రంతో పవన్ ఏ మేరకు అంచనాలు అందుకుంటాడో చూడాలి. మరోవైపు వకీల్ సాబ్తో పాటు అయ్యప్పునుమ్ కోషియుమ్ రీమేక్, హరీష్ శంకర్ సినిమా, క్రిష్, సురేందర్ రెడ్డి సినిమాలకు కూడా కమిట్ అయ్యాడు పవర్ స్టార్.