• HOME
  • »
  • NEWS
  • »
  • MOVIES
  • »
  • PAWAN KALYAN VAKEEL SAAB MOVIE SATHYAMEVA JAYATHE LYRICAL SONG RELEASED AND ITS LIKE JANASENA PARTY PROMOTION PK

Vakeel Saab Sathyameva Jayathe: ‘వకీల్ సాబ్’ సత్యమేయ జయతే సాంగ్.. జనసేన ప్రమోషనల్ సాంగ్‌లా ఉందే..!

Vakeel Saab Sathyameva Jayathe: ‘వకీల్ సాబ్’ సత్యమేయ జయతే సాంగ్.. జనసేన ప్రమోషనల్ సాంగ్‌లా ఉందే..!

సత్యమేవ జయతే సాంగ్ (Vakeel Saab)

Vakeel Saab Sathyameva Jayathe: 2020 మార్చ్‌లో ఉమెన్స్ డే కానుకగా మగువ మగువ పాట విడుదలైంది. మళ్లీ ఆ సినిమా నుంచి రెండో పాట విడుదల కావడానికి ఏడాది పట్టింది. పవన్ కళ్యాణ్ హీరోగా వేణు శ్రీరామ్ తెరకెక్కిస్తున్న సినిమా వకీల్ సాబ్.

  • Share this:
2020 మార్చ్‌లో ఉమెన్స్ డే కానుకగా మగువ మగువ పాట విడుదలైంది. మళ్లీ ఆ సినిమా నుంచి రెండో పాట విడుదల కావడానికి ఏడాది పట్టింది. పవన్ కళ్యాణ్ హీరోగా వేణు శ్రీరామ్ తెరకెక్కిస్తున్న సినిమా వకీల్ సాబ్. పింక్ సినిమాకు రీమేక్‌గా రూపొందుతున్న ఈ చిత్రంపై అంచనాలు ఎలా ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మూడేళ్ల తర్వాత పవన్ నుంచి వస్తున్న సినిమా కావడంతో అభిమానులతో పాటు ఇండస్ట్రీ కూడా ఆసక్తిగా చూస్తుంది. ఇదిలా ఉంటే ఈ సినిమా నుంచి రెండో పాట విడుదలైంది. సత్యమేవ జయతే అంటూ సాగే ఈ పాటను రామజోగయ్య శాస్త్రి రాసాడు. శంకర్ మహదేవన్, పృథ్వీ చంద్ర పాడారు. థమన్ మరోసారి ఎనర్జిటిక్ బీట్ ఇచ్చాడు. ఈ పాట ఇప్పుడు యూ ట్యూబ్‌లో వైరల్ అవుతుంది. లిరిక్స్ కూడా అదిరిపోయాయి. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ఒరిజినల్ కారెక్టర్‌కు సరిపోయేలా ఈ పాట రాయించాడు దర్శకుడు వేణు శ్రీరామ్. ప్రస్తుతం రాజకీయాల్లో కూడా ఉండటంతో సత్యమేవ జయతే పాట జనసేన పార్టీకి కూడా బాగానే పనికొచ్చేలా కనిపిస్తుంది. పేదోళ్ల తరఫున నిలబడతాడు.. నిజం మనిషిరా.. కష్టమంటే వెంటనే అండగా ఉంటాడు.. అసలు మనిషిరా అంటూ రామజోగయ్య కలం నుంచి పవర్ ఫుల్ పదాలు జాలువారాయి. మరోవైపు థమన్ కూడా పవన్ అభిమానులు కోరుకునేలా బీట్ ఇచ్చాడు. ఏప్రిల్ 9న వకీల్ సాబ్ విడుదల కానుంది.

దిల్ రాజు, బోనీ కపూర్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. శృతి హాసన్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో అంజలి, నివేదా థామస్, అనన్య కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
Published by:Praveen Kumar Vadla
First published: