• Home
  • »
  • News
  • »
  • movies
  • »
  • PAWAN KALYAN VAKEEL SAAB MOVIE AGAIN RE RELEASED IN THEATRES HERE ARE THE DETAILS TA

Pawan Kalyan - Vakeel Saab: పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఖుషీ చేసుకునే వార్త.. మరోసారి థియేటర్స్‌లో ‘వకీల్ సాబ్’..

పవన్ కళ్యాణ్ ‘వకీల్ సాబ్’(Twitter/Photo)

Pawan Kalyan - Vakeel Saab: ‘అజ్ఞాతవాసి’ తర్వాత దాదాపు మూడేళ్ల లాంగ్ గ్యాప్ తర్వాత పవన్ కళ్యాణ్ ‘వకీల్ సాబ్’ మూవీతో హీరోగా టాలీవుడ్‌లో రీ  ఎంట్రీ ఇచ్చారు. తాజాగా ఈ సినిమాను మరోసారి థియేటర్స్‌లో రీ రిలీజ్ చేయాలనే ఆలోచనలో దిల్ రాజు ఉన్నట్టు సమాచారం.

  • Share this:
    Pawan Kalyan - Vakeel Saab: ‘అజ్ఞాతవాసి’ తర్వాత దాదాపు మూడేళ్ల లాంగ్ గ్యాప్ తర్వాత పవన్ కళ్యాణ్ ‘వకీల్ సాబ్’ మూవీతో హీరోగా టాలీవుడ్‌లో రీ  ఎంట్రీ ఇచ్చారు. శ్రీరామ్ వేణు డైరెక్ట్ చేసిన ఈ సినిమాను దిల్ రాజు భారీ ఎత్తున నిర్మించారు. ఏప్రిల్ 9న విడుదలైన ఈ సినిమాకు పాజిటిక్ టాక్ సొంతం చేసుకుంది. ఇంతలా దేశంలో కరోనా సెకండ్ వేవ్ విజృంభనతో థియేటర్స్‌ మూతపడ్డాయి. ఐనా.. పవన్ కళ్యాణ్ ఈ సినిమా తక్కువ టైమ్‌లోనే దాదాపు రూ. 80 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను సాధించి హీరోగా పవన్ కళ్యాణ్ స్టామినా ఏంటో మరోసారి ప్రూవ్ చేసింది. కరోనా  సెకండ్ వేవ్ కారణంగా థియేట్రికల్ రన్ ముగిసిన ఈ చిత్రాన్ని మూడు వారాల్లోనే అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ చేసారు.

    అక్కడ ఈ సినిమా ఎక్కువ వ్యూస్ సాధించిన తెలుగు సినిమాగా రికార్డు క్రియేట్ చేసినట్టు అమెజాన్ ప్రైమ్ వాళ్లు ప్రకటించారు. ఆ సంగతి పక్కన పెడితే.. ప్రస్తుతం దేశంలో కరోనా కేసులు కనిష్ఠ స్థాయికి చేరుకుంది. ఒక్కొక్కటిగా ప్రభుత్వాలు అన్‌లాక్ విధిస్తున్నాయి.ఈ నేపథ్యంలో 50 శాతం అక్యుపెన్షీతో థియేటర్స్ ఓపెన్ చేసుకోవడానికి పలు రాష్ట్ర ప్రభుత్వాలు పర్మిషన్ కూడా ఇచ్చాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ, ఏపీ రాష్ట్ర ప్రభుత్వాలు కూడా త్వరలో థియేటర్స్ ఓపెన్ చేసుకోవడానికి పర్మిషన్ ఇవ్వనున్నాయి.

    ‘వకీల్ సాబ్‌’గా పవన్ కళ్యాణ్ (Twitter/Photo)


    దీంతో నిర్మాత దిల్ రాజు.. పవన్ కళ్యాణ్ నటించిన ‘వకీల్ సాబ్’ సినిమాను 300 థియేటర్స్‌లో రీ రిలీజ్ చేయనున్నట్టు సమాచారం. థియేటర్స్ ఓపెన్ చేసుకోవడానికి పర్మిషన్ లభిస్తే.. ఇప్పటికిపుడు కొత్త సినిమాల కంటే ఆల్రెడీ ప్రూవ్ అయిన ‘వకీల్ సాబ్’ సినిమాతో థియేటర్స్ రీ ఓపెన్ చేస్తే.. ప్రేక్షకులు కూడా థియేటర్స్‌కు క్యూ కడతారనే ఆలోచనలో దిల్ రాజు ఉన్నట్టు సమాచారం. వకీల్ సాబ్ విషయానికొస్తే.. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ సరసన శృతి హాసన్ కథానాయికగా నటించింది. మరోవైపు అంజలి, నివేదా థామస్, అనన్య నాగళ్ల, ప్రకాష్ రాజ్ ఇతర ముఖ్యపాత్రల్లో నటించారు.

    Pawan Kalyan Vakeel Saab Working Stills Goes Viral On Socila Media,Vakeel Saab: పవన్ కళ్యాణ్ ‘వకీల్ సాబ్’ వర్కింగ్ స్టిల్స్ విడుదల.. సోషల్ మీడియాలో వైరల్..,Pawan Kalyan Vakeel Saab Working Stills,Vakeel Saab Working Stills,PSPK 26,Vakeel Saab Collections,pawan kalyan,Vakeel Saab 10 days collections,pawan kalyan Vakeel Saab 10 days ww collections,Vakeel Saab 10 days world wide collections,Vakeel Saab 10 days collections 79 crores,telugu cinema,వకీల్ సాబ్,వకీల్ సాబ్ కలెక్షన్స్,పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ 8 డేస్ కలెక్షన్స్,పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ 10 డేస్ కలెక్షన్స్,పవన్ కళ్యాణ్ వర్కింగ్ స్టిల్స్,
    పవన్ కళ్యాణ్ ‘వకీల్ సాబ్’ వర్కింగ్ స్టిల్స్ (Twitter/Photo)


    ఇక పవన్ కళ్యాణ్ ఇతర సినిమాల విషయానికి వస్తే.. క్రిష్ జాగర్లమూడి సినిమాలో నటిస్తున్నాడు. చారిత్రక నేపథ్యం లో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమాలో పవన్ కళ్యాన్ వ‌జ్రాల దొంగగా క‌నిపించ‌నున్నాడ‌ని అంటున్నారు. ఈ సినిమాకు ‘హరిహర వీరమల్లు’ అనే పేరును ఖరారు చేసారు. ఈ సినిమా పవన్ కెరీర్ లోనే భారీ బడ్జెట్ తో తెరకెక్కుతుంది. ఏ ఎం రత్నం నిర్మాత వ్యవహరిస్తున్నాడు. ఈ మూవీకి కీరవాణి సంగీతం అందిస్తున్నాడు. వచ్చే యేడాది విడుదల కానుంది.

    హరి హర వీరమల్లుగా పవన్ కళ్యాణ్ (File/Photo)


    ఈ సినిమాతో పాటు పవన్.. ఓ మలయాళ సినిమాను తెలుగులో రీమేక్ చేస్తున్నాడు. మలయాళంలో సూపర్ హిట్ అయిన అయ్యప్పనుమ్ కోషియమ్.. అనే సినిమాను తెలుగులో రీమేక్ చేస్తున్నారు. మరో కీలక పాత్రలో రానా దగ్గుబాటి నటిస్తున్నాడు. ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమాకు రుద్రపత్రాప్ అనే టైటిల్‌ను పరిశీలినలో ఉంది.
    Published by:Kiran Kumar Thanjavur
    First published: