Pawan Kalyan Vakeel Saab 8 Days Collections: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన తాజా చిత్రం ‘వకీల్ సాబ్’. ఈ నెల 9న ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన ఈ సినిమాకు అద్భుతమైన ఓపెనింగ్స్ వచ్చాయి. ఈ సినిమా 8 రోజులకు గాను ఏరియా వైజ్ కలెక్షన్స్ వివరాలు..
Pawan Kalyan Vakeel Saab 8 Days Collections: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన తాజా చిత్రం ‘వకీల్ సాబ్’. ఈ నెల 9న ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన ఈ సినిమాకు అద్భుతమైన ఓపెనింగ్స్ వచ్చాయి. దాదాపు మూడేళ్ల లాంగ్ గ్యాప్ తర్వాత పవన్ కళ్యాణ్ నటించిన సినిమా కావడంతో ఆటోమేటిక్‌గా ఈ చిత్రంపై అంచనాలు ఆకాశాన్ని అంటాయి. అలాగే విడుదలైన తొలి నాలుగైదు రోజులు కలెెక్షన్లు బాగానే వచ్చాయి. అయితే 6వ రోజు నుంచి వసూళ్లు తగ్గుముఖం పట్టాయి. దిల్ రాజు, బోనీ కపూర్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రాన్ని శ్రీరామ్ వేణు తెరకెక్కించాడు. ఈ సినిమాలో అంజలి, అనన్య, నివేదా థామస్ కీలక పాత్రల్లో నటించారు. శృతి హాసన్ పవన్ కళ్యాణ్ భార్య పాత్రలో కాసేపు అలా మెరిసింది. పింక్ సినిమా రీమేక్‌గా వచ్చిన వకీల్ సాబ్ సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి. తమిళంలో నేర్కొండ పార్వైగా రీమేక్ అయిన ఈ చిత్రం అక్కడ విజయం సాధించింది. ఇప్పుడు తెలుగులోనూ పింక్ కథ సత్తా చూపిస్తుంది.
పవన్ కళ్యాణ్ ఇమేజ్‌కు తగ్గట్లుగా ఈ సినిమా కథను మార్చేసాడు వేణు శ్రీరామ్. ఇది కూడా చాలా వరకు సక్సెస్ అయింది. సినిమాలో జనసేనకు ప్రచారం కూడా బాగానే చేసారు. ఫస్టాఫ్ యావరేజ్‌గానే ఉన్నా కూడా సెకండాఫ్ మాత్రం అదిరిపోయింది. స్క్రీన్ ప్లే కూడా చాలా చక్కగా రాసుకున్నాడు శ్రీరామ్ వేణు. మాటలు కూడా అద్భుతంగా ఉన్నాయి. ఈ సినిమా కలెక్షన్స్ ఊహించినంత రాకపోవడానికి కారణం ఏపీలో టికెట్ రేట్స్ తగ్గడంతో పాటు కరోనా కూడా ఉండటం. ఈ సినిమా 8 డేస్ కలెక్షన్స్ బయటికి వచ్చాయి. ఈ సినిమా ఏరియా వైజ్ వసూళ్ల లెక్కలు ఇప్పుడు చూద్దాం..
ఏపీ + తెలంగాణ (టోటల్)- 72.55 కోట్లు
రెస్ట్ ఆఫ్ ఇండియా- 3.53 కోట్లు
ఓవర్సీస్- 3.77 కోట్లు వరల్డ్ వైడ్ (టోటల్)- 79.85 కోట్లు షేర్
వకీల్ సాబ్ కలెక్షన్లు (Twitter/Photo)
ఈ సినిమా రూ. 89 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. రూ. 90 కోట్లు షేర్ వసూలు చేస్తే హిట్ అనిపించుకుంటుంది. 8 రోజుల్లో 79.85 కోట్ల షేర్ వసూలు చేసింది. అంటే ఇంకా రూ. 11 కోట్ల దూరంలో ఉన్నాడు వకీల్ సాబ్. అయితే టికెట్ రేట్స్.. కరోనా ఈ సినిమా వసూళ్లపై తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయి. మొత్తంగా వకీల్ సాబ్ అనుకున్న టార్గెట్ రీచ్ అవుతుందో లేదో చూడాలి.
Published by:Kiran Kumar Thanjavur
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.