• HOME
  • »
  • NEWS
  • »
  • MOVIES
  • »
  • PAWAN KALYAN VAKEEL SAAB MOVIE 6 DAYS WORLDWIDE COLLECTIONS AND TICKET PRICE SHOW HUGE EFFECT PK

Vakeel Saab 6 days collections: ‘వకీల్ సాబ్’ 6 డేస్ కలెక్షన్స్.. దారుణంగా పడిపోయిన వసూళ్లు..

Vakeel Saab 6 days collections: ‘వకీల్ సాబ్’ 6 డేస్ కలెక్షన్స్.. దారుణంగా పడిపోయిన వసూళ్లు..

వకీల్ సాబ్ కలెక్షన్స్ (Vakeel Saab)

Vakeel Saab 6 days collections: పవన్ కళ్యాణ్(Pawan Kalyan) ఇమేజ్‌కు తగ్గట్లుగా ఈ సినిమా కథను మార్చేసాడు వేణు శ్రీరామ్(Sriram Venu). ఈ సినిమా 6 రోజుల కలెక్షన్ వివరాలు బయటికి వచ్చాయి. అయితే చాలా దారుణంగా వసూళ్లు పడిపోయాయి. పైగా తక్కువగానే వస్తున్నాయి. దీనికి టికెట్ రేట్స్ తగ్గడం కూాడా కారణంగా మారింది.

  • Share this:
పవన్ కళ్యాణ్ సినిమాకు ప్రతికూల పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఈయన నటించిన వకీల్ సాబ్ సినిమా విడుదలైన తర్వాత తొలి నాలుగైదు రోజులు బాగానే వచ్చాయి. అయితే 6వ రోజు నుంచి వసూళ్లు తగ్గుముఖం పట్టాయి. దిల్ రాజు, బోనీ కపూర్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రాన్ని శ్రీరామ్ వేణు తెరకెక్కించాడు. ఈ సినిమాలో అంజలి, అనన్య, నివేదా థామస్ కీలక పాత్రల్లో నటించారు. పింక్ సినిమా రీమేక్‌గా వచ్చిన వకీల్ సాబ్ సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి. తమిళంలో నేర్కొండ పార్వైగా రీమేక్ అయిన ఈ చిత్రం అక్కడ విజయం సాధించింది. ఇప్పుడు తెలుగులోనూ పింక్ కథ సత్తా చూపిస్తుంది. పవన్ కళ్యాణ్ ఇమేజ్‌కు తగ్గట్లుగా ఈ సినిమా కథను మార్చేసాడు వేణు శ్రీరామ్. ఇది కూడా చాలా వరకు సక్సెస్ అయింది. సినిమాలో జనసేనకు ప్రచారం కూడా బాగానే చేసారు. ఫస్టాఫ్ యావరేజ్‌గానే ఉన్నా కూడా సెకండాఫ్ మాత్రం అదిరిపోయింది. స్క్రీన్ ప్లే కూడా చాలా చక్కగా రాసుకున్నాడు శ్రీరామ్ వేణు. మాటలు కూడా అద్భుతంగా ఉన్నాయి. ఈ సినిమా కలెక్షన్స్ ఊహించినంత రాకపోవడానికి కారణం ఏపీలో టికెట్ రేట్స్ తగ్గడంతో పాటు కరోనా కూడా ఉండటం. ఈ సినిమా 6 డేస్ కలెక్షన్స్ బయటికి వచ్చాయి. ఈ సినిమా ఏరియా వైజ్ వసూళ్ల లెక్కలు ఇప్పుడు చూద్దాం..

వకీల్ సాబ్ 6 రోజుల కలెక్షన్స్..

నైజాం- 21.85 కోట్లు
సీడెడ్- 11.60 కోట్లు
ఉత్తరాంధ్ర- 10.30 కోట్లు
ఈస్ట్- 5.55 కోట్లు
వెస్ట్- 6.45 కోట్లు
గుంటూరు- 6.55 కోట్లు
కృష్ణా- 4.45 కోట్లు
నెల్లూరు- 3.01 కోట్లు

ఏపీ + తెలంగాణ (టోటల్)- 69.86 కోట్లు
రెస్ట్ ఆఫ్ ఇండియా- 3.50 కోట్లు
ఓవర్సీస్- 3.75 కోట్లు
వరల్డ్ వైడ్ (టోటల్)- 77.22 కోట్లు షేర్

pawan kalyan,Vakeel Saab 6 days collections,pawan kalyan Vakeel Saab 6 days ww collections,Vakeel Saab 6 days worldwide collections,Vakeel Saab 6 days collections 77 crores,telugu cinema,వకీల్ సాబ్,వకీల్ సాబ్ కలెక్షన్స్,పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ 6 డేస్ కలెక్షన్స్
వకీల్ సాబ్ కలెక్షన్స్ (Vakeel Saab)


ఈ సినిమా 89 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. 90 కోట్లు షేర్ వసూలు చేస్తే హిట్ అనిపించుకుంటుంది. 6 రోజుల్లో 77 కోట్ల షేర్ వసూలు చేసింది. అంటే ఇంకా 13 కోట్ల దూరంలో ఉన్నాడు వకీల్ సాబ్. అయితే టికెట్ రేట్స్ మరీ తక్కువగా ఉండటంతో వసూళ్లు చాలా తక్కువగా వస్తున్నాయి. మరోవైపు కరోనా కేసులు పెరుగుతుండటంతో టార్గెట్ రీచ్ అవుతుందో లేదో చూడాలి.
Published by:Praveen Kumar Vadla
First published: