• HOME
  • »
  • NEWS
  • »
  • MOVIES
  • »
  • PAWAN KALYAN VAKEEL SAAB MOVIE 1ST DAY WORLDWIDE COLLECTIONS AND BIGGEST OPENER FOR 2021 PK

Vakeel Saab 1st day collections: ‘వకీల్ సాబ్’ ఫస్ట్ డే కలెక్షన్స్.. ‘అజ్ఞాతవాసి’ని బీట్ చేయలేకపోయిన పవన్..

Vakeel Saab 1st day collections: ‘వకీల్ సాబ్’ ఫస్ట్ డే కలెక్షన్స్.. ‘అజ్ఞాతవాసి’ని బీట్ చేయలేకపోయిన పవన్..

వకీల్ సాబ్ కలెక్షన్స్ (Vakeel Saab)

Vakeel Saab 1st day collections: పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ‘వకీల్ సాబ్’ (Vakeel Saab) సినిమాకు సంబంధించిన ఫస్ట్ డే కలెక్షన్స్ రిపోర్ట్స్ బయటికి వచ్చేసాయి. ఈ సినిమా 89 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. కరోనా సమయంలో తొలిరోజు ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా 36 కోట్లకు పైగా షేర్ వసూలు చేసింది.

  • Share this:
పవన్ కళ్యాణ్ ‘వకీల్ సాబ్’ సినిమాకు సంబంధించిన ఫస్ట్ డే కలెక్షన్స్ రిపోర్ట్స్ బయటికి వచ్చేసాయి. కాకపోతే కాస్త ఆలస్యంగా వచ్చాయి. దిల్ రాజు, బోనీ కపూర్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రాన్ని శ్రీరామ్ వేణు తెరకెక్కించాడు. ఈ సినిమాలో అంజలి, అనన్య, నివేదా థామస్ కీలక పాత్రల్లో నటించారు. పింక్ సినిమా రీమేక్‌గా వచ్చిన వకీల్ సాబ్ సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి. తమిళంలో నేర్కొండ పార్వైగా రీమేక్ అయిన ఈ చిత్రం అక్కడ విజయం సాధించింది. ఇప్పుడు తెలుగులోనూ పింక్ కథ సత్తా చూపిస్తుంది. పవన్ కళ్యాణ్ ఇమేజ్‌కు తగ్గట్లుగా ఈ సినిమా కథను మార్చేసాడు వేణు శ్రీరామ్. ఇది కూడా చాలా వరకు సక్సెస్ అయింది. సినిమాలో జనసేనకు ప్రచారం కూడా బాగానే చేసారు. ఫస్టాఫ్ యావరేజ్‌గానే ఉన్నా కూడా సెకండాఫ్ మాత్రం అదిరిపోయింది. స్క్రీన్ ప్లే కూడా చాలా చక్కగా రాసుకున్నాడు శ్రీరామ్ వేణు. మాటలు కూడా అద్భుతంగా ఉన్నాయి. ఈ సినిమా ఫస్ట్ డే కలెక్షన్స్ బయటికి వచ్చాయి. ఈ సినిమా తొలిరోజు ఏరియా వైజ్ వసూళ్ల లెక్కలు ఇప్పుడు చూద్దాం..

నైజాం- 8.75 కోట్లు
సీడెడ్- 4.50 కోట్లు
ఉత్తరాంధ్ర- 3.85 కోట్లు
ఈస్ట్- 3.10 కోట్లు
వెస్ట్- 4.50 కోట్లు
గుంటూరు- 3.94 కోట్లు
కృష్ణా- 1.90 కోట్లు
నెల్లూరు- 1.70 కోట్లు

ఏపీ + తెలంగాణ (టోటల్)- 32.24 కోట్లు
రెస్ట్ ఆఫ్ ఇండియా- 1.82 కోట్లు
ఓవర్సీస్- 2.40 కోట్లు
వరల్డ్ వైడ్ (టోటల్)- 36.46 కోట్లు

ఈ సినిమా 89 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. 90 కోట్లు షేర్ వసూలు చేస్తే హిట్ అనిపించుకుంటుంది. బ్రేక్ ఈవెన్ కోసం మరో 53 కోట్ల దూరంలో ఉన్నాడు పవర్ స్టార్. తొలిరోజు ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా 36 కోట్లకు పైగా షేర్ వసూలు చేసింది. తెలుగు రాష్ట్రాల్లో 32 కోట్లు వసూలు చేసిన ఈ చిత్రం.. కర్ణాటక, ఓవర్సీస్ అన్నీ కలిపి 4 కోట్లకు పైగా తీసుకొచ్చింది. మూడేళ్ళ కింద విడుదలైన అజ్ఞాతవాసి సినిమా అప్పట్లో 40 కోట్ల షేర్ తీసుకొచ్చింది తొలిరోజు. ఇప్పుడు వకీల్ సాబ్ దానికంటే 4 కోట్లు తక్కువగానే తీసుకొచ్చింది. అయితే కోవిడ్ సమయంలో కూడా ఈ స్థాయి వసూళ్లు వచ్చాయంటే పవన్ కళ్యాణ్ స్టామినా ఏంటో అర్థం అయిపోతుంది.
Published by:Praveen Kumar Vadla
First published: