• HOME
  • »
  • NEWS
  • »
  • MOVIES
  • »
  • PAWAN KALYAN VAKEEL SAAB MOVIE 13 DAYS WORLDWIDE COLLECTIONS AND ITS ENDED UP WITH ABOVE AVERAGE PK

Vakeel Saab 13 days ww collections: ‘వకీల్ సాబ్’ 13 డేస్ కలెక్షన్స్.. పవన్ సినిమాకు నష్టాలు తప్పలేదుగా..!

Vakeel Saab 13 days ww collections: ‘వకీల్ సాబ్’ 13 డేస్ కలెక్షన్స్.. పవన్ సినిమాకు నష్టాలు తప్పలేదుగా..!

వకీల్ సాబ్ (Vakeel Saab)

Vakeel Saab 13 days ww collections: పవన్ కళ్యాణ్(Pawan Kalyan) సినిమాపై పరిస్థితులు పగబట్టాయి. అందుకే వకీల్ సాబ్(Vakeel Saab) సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చినా కూడా యావరేజ్ దగ్గరే ఆగిపోవాల్సి వచ్చింది. విడుదలైన తర్వాత తొలి నాలుగైదు రోజులు బాగానే వచ్చాయి. అయితే ఆ తర్వాత వసూళ్లు తగ్గుముఖం పట్టాయి.

  • Share this:
పవన్ కళ్యాణ్ సినిమాపై పరిస్థితులు పగబట్టాయి. అందుకే వకీల్ సాబ్ సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చినా కూడా యావరేజ్ దగ్గరే ఆగిపోవాల్సి వచ్చింది. విడుదలైన తర్వాత తొలి నాలుగైదు రోజులు బాగానే వచ్చాయి. అయితే ఆ తర్వాత వసూళ్లు తగ్గుముఖం పట్టాయి. దిల్ రాజు, బోనీ కపూర్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రాన్ని శ్రీరామ్ వేణు తెరకెక్కించాడు. ఈ సినిమాలో అంజలి, అనన్య, నివేదా థామస్ కీలక పాత్రల్లో నటించారు. పింక్ సినిమా రీమేక్‌గా వచ్చిన వకీల్ సాబ్ సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి. తమిళంలో నేర్కొండ పార్వైగా రీమేక్ అయిన ఈ చిత్రం అక్కడ విజయం సాధించింది. ఇప్పుడు తెలుగులోనూ పింక్ కథ సత్తా చూపిస్తుంది. పవన్ కళ్యాణ్ ఇమేజ్‌కు తగ్గట్లుగా ఈ సినిమా కథను మార్చేసారు వేణు శ్రీరామ్. ఇది కూడా చాలా వరకు సక్సెస్ అయింది. సినిమాలో జనసేనకు ప్రచారం కూడా బాగానే చేసారు. టాక్ బాగానే ఉన్నా కూడా సినిమా కలెక్షన్స్ ఊహించినంత రాకపోవడానికి కారణం ఏపీలో టికెట్ రేట్స్ తగ్గడంతో పాటు కరోనా కూడా ఉండటం. ఈ సినిమా 13 డేస్ కలెక్షన్స్ బయటికి వచ్చాయి. ఈ సినిమా ఏరియా వైజ్ వసూళ్ల లెక్కలు ఇప్పుడు చూద్దాం..

వకీల్ సాబ్ 13 రోజుల కలెక్షన్స్..

నైజాం- 24.10 కోట్లు
సీడెడ్- 12.71 కోట్లు
ఉత్తరాంధ్ర- 11.60 కోట్లు
ఈస్ట్- 6.14 కోట్లు
వెస్ట్- 7.13 కోట్లు
గుంటూరు- 7.07 కోట్లు
కృష్ణా- 4.88 కోట్లు
నెల్లూరు- 3.33 కోట్లు

ఏపీ + తెలంగాణ (టోటల్)- 76.99 కోట్లు
రెస్ట్ ఆఫ్ ఇండియా- 3.58 కోట్లు
ఓవర్సీస్- 3.83 కోట్లు
వరల్డ్ వైడ్ (టోటల్)- 84.83 కోట్లు షేర్

ఈ సినిమా 89 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. 90 కోట్లు షేర్ వసూలు చేస్తే హిట్ అనిపించుకుంటుంది. 13 రోజుల్లో 85 కోట్ల షేర్ వసూలు చేసింది. అంటే ఇంకా 5 కోట్ల దూరంలో ఉన్నాడు వకీల్ సాబ్. అయితే టికెట్ రేట్స్ మరీ తక్కువగా ఉండటంతో వసూళ్లు చాలా తక్కువగా వస్తున్నాయి. మరోవైపు కరోనా కేసులు పెరుగుతుండటంతో టార్గెట్ రీచ్ కాలేకపోయింది ఈ చిత్రం. దాంతో అబౌ యావరేజ్ దగ్గరే ఈ చిత్రం ఆగిపోవాల్సి వచ్చింది.
Published by:Praveen Kumar Vadla
First published:

అగ్ర కథనాలు