• HOME
  • »
  • NEWS
  • »
  • MOVIES
  • »
  • PAWAN KALYAN VAKEEL SAAB FIRST WEEKEND AMERICA COLLECTIONS COMPARISON WITH JATHI RATNALU FIRST WEEKEND COLLECTIONS FULL DETAILS HERE SR

Pawan Kalyan | Vakeel Saab : జాతి రత్నాలు కలెక్షన్స్‌ను టచ్ చేయలేకపోయిన వకీల్ సాబ్..

Pawan Kalyan | Vakeel Saab : జాతి రత్నాలు కలెక్షన్స్‌ను టచ్ చేయలేకపోయిన వకీల్ సాబ్..

Vakeel Saab and Jathiratnalu Weekend Collections Photo : Twitter

Pawan Kalyan | Vakeel Saab : మూడు సంవత్సరాల తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో హిందీ సినిమా పింక్‌కు రీమేక్‌గా వచ్చిన వకీల్ సాబ్ ఈ నెల 9న విడుదలై బాక్సాఫీస్ దగ్గర అదిరిపోయే కలెక్షన్స్‌ను రాబడుతోంది.

  • Share this:
    మూడు సంవత్సరాల తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో హిందీ సినిమా పింక్‌కు రీమేక్‌గా వచ్చిన వకీల్ సాబ్ ఈ నెల 9న విడుదలై బాక్సాఫీస్ దగ్గర అదిరిపోయే కలెక్షన్స్‌ను రాబడుతోంది. ముఖ్యంగా కోవిడ్ సమయంలో కూడా ఈ రేంజ్‌లో వసూళ్లు అంటే మాటలు కాదు. అయితే వస్తున్న సమాచారం మేరకు ఈ సినిమా ఓ విషయంలో జాతిరత్నాలు కలెక్షన్స్‌ను మించ లేకుండా పోయిందని తెలుస్తోంది. ఫస్ట్ వీకెండ్‌లో సండే రోజున జాతి రత్నాలు 121 లొకేషన్స్‌లో లక్ష1.26 లక్షల డాలర్స్ వసూలు చేయగా.. పవన్ కళ్యాన్ వకీల్ సాబ్ 283 లొకెషన్స్‌లో 66 వేల డాలర్లకు పరిమితమైంది. కేవలం అమెరికాలోనే కాకుండా.. అటు ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లో కూడా జాతి రత్నాలు మంచి వసూళ్లను రాబట్టింది. మొదటి వీకెండ్ పూర్తై సరికి జాతిరత్నాలు ప్రీమియర్స్‌తో కలుపుకుని ఏడు లక్షల డాలర్స్ వసూలు చేయగా.. వకీల్ సాబ్ మాత్రం ఆరు 6.50 లక్షల డాలర్స్‌ను వసూలు చేసింది. ఇక ఈ సినిమా విషయానికి వస్తే.. పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో నటించగా.. నివేదా థామస్, అంజలి, అనన్య నాగల్ల ఇతర ముఖ్య పాత్రలో కనిపించారు. శ్రీరామ్ వేణు దర్శకత్వం వహించాడు. దిల్ రాజు, బోణీ కపూర్ నిర్మించారు.







    ఇక సినిమా మొత్తం మీద మొదటి మూడు రోజుల్లో టోటల్ వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…
    Nizam: 16.30Cr
    Ceeded: 8.15Cr
    UA: 7.70Cr
    East: 4.62Cr
    West: 5.60Cr
    Guntur: 5.26Cr
    Krishna: 3.25Cr
    Nellore: 2.49Cr
    AP-TG Total:- 53.37CR (79.7Cr~ Gross)
    KA+ROI – 3.15Cr (Corrected)
    OS- 3.30Cr (Corrected)
    Total WW: 59.82CR(91Cr~ Gross)
    ఇవీ సినిమా మూడు రోజుల్లో వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్స్… నాలుగు ఐదు రోజుల వరల్డ్ వైడ్ కలెక్షన్స్ తెలియాల్సి ఉంది.

    ఇక ఈ సినిమా ఓటీటీ డేట్ కూడా దాదాపు ఫిక్స్ అయ్యిందని టాక్ రాగా... అవన్ని రూమర్స్ అంటూ చిత్రబృందం అధికారిక ప్రకటన చేసింది. అయితే ఈ సినిమా ఇప్పట్లో ఓటీటీలో విడుదలకాదని దానికి చాలా టైమ్ ఉందని సమాచారం. వకీల్ సాబ్ స్ట్రీమింగ్ రైట్స్‌ను అమెజాన్ ప్రైమ్ భారీ ధరకు కొనుగోలు చేసింది. దిల్ రాజు నిర్మించిన అన్ని సినిమాలు కూడా ప్రైమ్ వీడియోనే డిజిటల్ హక్కులను సొంతం చేసుకోగా.. తాజాగా ఈ సినిమా కూడా అమెజాన్ ప్రైమ్ దక్కించుకుంది. ఈ సినిమా బహుశా ఏప్రిల్ చివరి వారం లేదా మే మొదటివారంలో అమెజాన్ ప్రైమ్‌లో ప్రసారం కానుందని తాజా సామాచారం.

    ఇక పవన్ కళ్యాణ్ నటిస్తున్న ఇతర సినిమాల విషయానికి వస్తే.. క్రిష్ జాగర్లమూడి సినిమాలో నటిస్తున్నాడు. చారిత్రక నేపథ్యం లో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమాలో పవన్ కళ్యాన్ వ‌జ్రాల దొంగగా క‌నిపించ‌నున్నాడ‌ని అంటున్నారు. ఈ సినిమాకు హరిహర వీరమల్లు అనే పేరును ఖరారు చేసారు. ఈ సినిమా పవన్ కెరీర్ లోనే భారీ బడ్జెట్ తో తెరకెక్కుతుంది. ఏ ఎం రత్నం నిర్మాత వ్యవహరిస్తున్నాడు. ఈ మూవీకి కీరవాణి సంగీతం అందిస్తున్నాడు. వచ్చే సంవత్సరం అంటే 2022 సంక్రాంతికి విడుదల కానుందని టాక్.

    ఈ సినిమాతో పాటు పవన్.. ఓ మలయాళ సినిమాను తెలుగులో రీమేక్ చేస్తున్నాడు. మలయాళంలో సూపర్ హిట్ అయిన అయ్యప్పనుమ్ కోషియమ్.. అనే సినిమాను తెలుగులో రీమేక్ చేస్తున్నారు. మరో కీలక పాత్రలో రానా దగ్గుబాటి నటిస్తున్నాడు. ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమాకు రుద్రపత్రాప్ అనే టైటిల్‌ను పరిశీలినలో ఉంది. దీనిపై అధికారిక సమాచారం విడుదలకావాల్సి ఉంది.
    Published by:Suresh Rachamalla
    First published: