• HOME
  • »
  • NEWS
  • »
  • MOVIES
  • »
  • PAWAN KALYAN VAKEEL SAAB AMAZON PRIME RELEASE DATE FIX HERE ARE THE DETAILS TA

Vakeel Saab Amzon Prime: వకీల్ సాబ్ ‘అమెజాన్ ప్రైమ్’ విడుదల తేది ఖరారు.. ? స్ట్రీమింగ్ డేట్ ఎపుడంటే..

Vakeel Saab Amzon Prime: వకీల్ సాబ్ ‘అమెజాన్ ప్రైమ్’ విడుదల తేది ఖరారు.. ? స్ట్రీమింగ్ డేట్ ఎపుడంటే..

అమెజాన్ ప్రైమ్‌లో పవన్ కళ్యాణ్ ‘వకీల్ సాబ్’ మూవీ (Twitter/Photo)

Vakeel Saab Amzon Prime: వకీల్ సాబ్ ‘అమెజాన్ ప్రైమ్’ విడుదల తేది ఖరారు..  గత కొన్నేళ్లుగా సినిమాలకు థియేట్రికల్ హక్కులతో పాటు డిజిటల్ హక్కులు నిర్మాతలకు పెద్ద వరంలా మారింది.తాజాగా ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్ అయినట్టు సమాచారం.

  • Share this:
    Vakeel Saab Movie On Amzon Prime: వకీల్ సాబ్ ‘అమెజాన్ ప్రైమ్’ విడుదల తేది ఖరారు..  గత కొన్నేళ్లుగా సినిమాలకు థియేట్రికల్ హక్కులతో పాటు డిజిటల్ హక్కులు నిర్మాతలకు పెద్ద వరంలా మారింది. కరోనా సమయంలో డిజిటల్ వేదికలపై సినిమాలు చూసే ప్రేక్షకులు బాగా పెరిగారు. అంతేకాదు గతంలో ఎన్నడు లేనంతగా డిజిటల్‌కు చాలా మంది ప్రేక్షకులు సబ్ స్క్రబ్ చేసుకున్నారు. తాజాగా ఈ శుక్రవారం విడుదలైన ‘వకీల్ సాబ్’ మూవీ ప్రముఖ డిజిటల్ స్ట్రీమింగ్ అమెజాన్ ప్రైమ్ భారీ రేేటుకే దక్కించుకుంది. ఈ సినిమా డిజిటల్ హక్కులను అమెజాన్ దాదాపు రూ. 30 కోట్లకు దక్కించుకున్నట్టు సమాచారం. పవన్ కళ్యాణ్ ఇమేజ్‌‌ను దృష్టిలో పెట్టుకొని  ఒకవేళ నేరుగా ఓటీటీలో విడుదల చేస్తే రూ. 100 కోట్ల ఆఫర్ ప్రకటించారు అమెజాన్ ప్రైమ్. కానీ దిల్ రాజు మాత్రం థియేటర్స్‌లో విడుదలకే మొగ్గు చూపాడు. ఈ ఈ సినిమా మొదటి రోజు ప్రపంచ వ్యాప్తంగా రూ. 36 కోట్లకు పైగా కలెక్ట్ చేసింది. మరోవైపు ఓవర్సీస్ ఈ  సినిమా రూ. హాఫ్ మిలియన్ మార్క్‌ను క్రాస్ చేసింది.


    ఈ విషయాన్ని చిత్ర యూనిట్ అఫీషియల్‌గా ప్రకటించింది. కరోనా లాంటి విపత్కర పరిస్థితుల్లో  ఈ సినిమాకు ఈ రేంజ్ వసూళ్లు రావడం  వెనక పవన్ కళ్యాణ్ ఇమేజ్ ఉందనే విషయం చెప్పక తప్పదు.  వకీల్ సాబ్ స్ట్రీమింగ్ హక్కులను అమెజాన్ ప్రైమ్  భారీ ధరకు కొనుగోలు చేసింది. దిల్ రాజు నిర్మించిన అన్ని సినిమాలు కూడా ప్రైమ్ వీడియోనే డిజిటల్ హక్కులను సొంతం చేసుకోగా.. తాజాగా ఈ సినిమా కూడా అమెజాన్ ప్రైమ్ దక్కించుకుంది. ఈ సినిమా ఏప్రిల్ 23న అమెజాన్ ప్రైమ్‌లో ప్రసారం కానుందని తెలుస్తోంది. ఇప్పటికే ఈ సినిమా స్ట్రీమింగ్ హక్కులకు సంబంధించిన అన్ని హక్కులు పూర్తైయినట్టు సమాచారం.

    pawan kalyan,Vakeel Saab 1st day collections,pawan kalyan Vakeel Saab 1st day collections,Vakeel Saab 1st day worldwide collections,Vakeel Saab 1st day collections 36 crores,telugu cinema,వకీల్ సాబ్,వకీల్ సాబ్ కలెక్షన్స్,పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ ఫస్ట్ డే కలెక్షన్స్
    వకీల్ సాబ్ కలెక్షన్స్ (Vakeel Saab)


    ఇక పవన్ కళ్యాణ్ ఇతర సినిమాల విషయానికి వస్తే.. క్రిష్ జాగర్లమూడి సినిమాలో నటిస్తున్నాడు. చారిత్రక నేపథ్యం లో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమాలో పవన్ కళ్యాన్ వ‌జ్రాల దొంగగా క‌నిపించ‌నున్నాడ‌ని అంటున్నారు. ఈ సినిమాకు ‘హరిహర వీరమల్లు’ అనే పేరును ఖరారు చేసారు. ఈ సినిమా పవన్ కెరీర్ లోనే భారీ బడ్జెట్ తో తెరకెక్కుతుంది. ఏ ఎం రత్నం నిర్మాత వ్యవహరిస్తున్నాడు. ఈ మూవీకి కీరవాణి సంగీతం అందిస్తున్నాడు. వచ్చే సంవత్సరం అంటే 2022 సంక్రాంతికి విడుదల కానుందని టాక్.

    ’హరి హర వీరమల్లు’గా పవన్ కళ్యాణ్


    ఈ సినిమాతో పాటు పవన్.. ఓ మలయాళ సినిమాను తెలుగులో రీమేక్ చేస్తున్నాడు. మలయాళంలో సూపర్ హిట్ అయిన అయ్యప్పనుమ్ కోషియమ్.. అనే సినిమాను తెలుగులో రీమేక్ చేస్తున్నారు. మరో కీలక పాత్రలో రానా దగ్గుబాటి నటిస్తున్నాడు. ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమాకు రుద్రపత్రాప్ అనే టైటిల్‌ను పరిశీలినలో ఉంది.
    Published by:Kiran Kumar Thanjavur
    First published:

    అగ్ర కథనాలు