Pawan Kalyan - Sai Dharam Tej : సాయి ధరమ్ తేజ్ ఆరోగ్యం కోసం ప్రార్ధించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు.. పవన్ కళ్యాణ్..

సాయి ధరమ్ తేజ్, పవన్ కళ్యాణ్ (Twitter/Photo)

Pawan Kalyan - Sai Dharam Tej : సాయి ధరమ్ తేజ్ ఆరోగ్యం కోసం ప్రార్ధించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలియజేసారు పవన్ కళ్యాణ్.

  • Share this:
    Pawan Kalyan - Sai Dharam Tej : సాయి ధరమ్ తేజ్ ఆరోగ్యం కోసం ప్రార్ధించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలియజేసారు పవన్ కళ్యాణ్. దసరా పండగ సందర్భంగా వేళ సాయి ధరమ్ తేజ్... హాస్పిటల్‌ నుంచి డిశ్చార్జ్ అయి ఇంటికి వెళ్లారు. రోడ్డు ప్రమాదం తర్వాత 35 రోజుల పాటు ఆస్పత్రిలో ఉన్న సాయి ధరమ్ తేజ్.. విజయ దశమి(Dussehra 2021) పండగ రోజు అందులోనూ తన పుట్టిన రోజు నాడే ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు. సాయి ధరమ్ తేజ్ ఇవాళ ఇంటికి తిరిగొచ్చాడని ఆయన పెద మావయ్య, మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) ట్వీట్ చేశారు. 'ఈ విజయ దశమి మరో ప్రత్యేకత ఏమిటంటే రోడ్డు ప్రమాదం నుంచి సంపూర్ణంగా కోలుకున్న సాయి ధరమ్ తేజ్ ఇవాళే  ఇంటికి వచ్చాడు. ప్రాణాపాయం నుంచి  తప్పించుకున్నందుకు సంతోషంగా ఉంది.  సాయిధరమ్ తేజ్‌కు ఇది పునర్జన్మ లాంటిది. అత్త, పెద్ద మావయ్య తరపున పుట్టిన రోజు శుభాకాంక్షలు.' అని చిరంజీవి ట్వీట్ చేశారు.

    మరోవైపు సాయి ధరమ్ తేజ్ చిన మేనమామ జనసేనాని, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ట్వీట్ చేస్తూ.. అనుకోని ప్రమాదంలో గత నెల రోజులుగా ఆసుపత్రిలో చికిత్స పొందిన సాయి ధరమ్ తేజ్.. ఈ రోజు ఇంటికి చేరారన్నారు. విజయ దశమి పర్వ దినం రోజు సాయి ధరమ్ తేజ్ ఇంటికి చేరడం మా కుటుంబ సభ్యులకు ఎంతో సంతోషాన్ని కలిగించింది. ఈ రోజు తేజ్.. పుట్టినరోజు. ఇలాంటి బర్త్ డేలు సాయి ధరమ్ తేజ్  మరిన్ని జరుపుకోవాని ఆ శక్తి స్వరూపిణిని ప్రార్ధిస్తున్నట్టు పవన్  కళ్యాణ్ తన లేఖలో పేర్కొన్నారు.


    తేజ్.. ఆసుపత్రిలో ఉన్నపుడు అభిమానులు ఆయన కోలుకోవాలని ఎంతగానో ప్రార్ధించారు. ఆలయాల్లో మిగిలిన ప్రార్ధనా మందిరాల్లో ఆయన క్షేమంగా తిరిగి రావాలని పూజలు  చేశారు. వారిందరి ప్రార్ధన ఫలితంగా సాయి ధరమ్ తేజ్.. క్షేమంగా ఇంటికి చేరారు. వారందరికీ పేరే పేరునా కృతజ్ఞతలు తెలియజేసారు పవన్ కళ్యాణ్.పుట్టినరోజున దసరా రోజున ఇంటికి వస్తున్న సాయి ధరమ్ తేజ్‌కు మెగా హీరోలు అల్లు అర్జున్ (Allu Arjun), వరుణ్ తేజ్ (Varun Tej) పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పారు.

    Chiranjeevi - Mani Sharma: ఆచార్య సహా చిరంజీవి, మణిశర్మ కాంబినేషన్‌లో వచ్చిన సినిమాలు ఇవే..

    కాగా, గత నెల 11న సాయి ధరమ్ తేజ్ రోడ్డు ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. కేబుల్ బ్రిడ్జి సమీపంలో స్పోర్ట్స్ బైక్ జారిపోవడంతో ఆయన కిందపడ్డారు. ప్రమాదంలో సాయి ధరమ్ తేజ్‌ తలతో పాటు ఛాతీ, కాళ్లకు గాయాలయ్యాయి. ప్రమాదం జరిగిన వెంటనే సాయిధరమ్‌తేజ్‌ను 108 సాయంతో సమీపంలోని మెడికవర్‌ ఆస్పత్రికి తరలించి ప్రాథమిక చికిత్స అందించారు. అనంతరం అపోలో ఆస్పత్రిలో అడ్మిట్ చేశారు. అప్పటి నుంచి ఆస్పత్రిలోనే ఉన్నారు సాయి ధరమ్ తేజ్. 35 రోజుల ట్రీట్‌మెంట్ తర్వాత ఇవాళ డిశ్చార్జ్ అవుతున్నారు.

    Rajinikanth - Peddhanna : ‘పెద్దన్న’గా సూపర్ స్టార్ రజినీకాంత్.. అదిరిన ’అన్నాత్తే’ తెలుగు టైటిల్..

    సాయిధరమ్ తేజ్ డిశ్చార్జ్ అవుతున్నారని తెలిసి మెగా అభిమానులు సంబరాల్లో మునిగిపోయారు. దసరా పండగ రోజు అదిరిపోయే శుభవార్త వచ్చిందని, ఆయన పుట్టిన రోజు నాడే డిశ్చార్జి కావడం సంతోషంగా ఉందన్నారు. ప్రమాదం నుంచి కోలుకొని బర్త్ డే రోజున ఇంటికి రావడం నిజంగా పునర్జన్మ అని అభిప్రాయపడుతున్నారు. ఇవాళ తమకు మూడు పండగలని.. ఒకటి దసరా, రెండు సాయి ధరమ్ తేజ్ పుట్టిన రోజు, మూడు ఆయన డిశ్చార్జ్ కావడమని అంటున్నారు. ఈ దసరగా పండగను ఎప్పటికీ మరచిపోలేమని చెబుతున్నారు.
    Published by:Kiran Kumar Thanjavur
    First published: